శౌచాలయాలు

    0
    8

    [box type=’note’ fontsize=’16’] పబ్లిక్ టాయ్‌లెట్‌లను వినియోగించుకోడంలోని సంకోచాలను, బిడియాలను, అపోహలను “శౌచాలయాలు” పేరిట కల్పికగా వివరిస్తున్నారు సలీం. [/box]

    [dropcap]టా[/dropcap]య్‌లెట్ అనే ఆంగ్ల పదాన్ని తెలుగులో శౌచాలయం అని ఎవరు అనువదించారో గానీ అతనికి నమస్కరించాలి. నిజంగా అవి మానవాళి పాలిట స్వచ్ఛత కోసం కట్టిన ఆలయాలే. నాకీమధ్య చప్పున ఓ విషయం జ్ఞాపకమొచ్చింది. దాదాపు పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను నాదగ్గర ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా మీనా పనిలోచేరింది. ఇరవైకి మించని వయసు… ఆర్థిక కారణాల వల్ల డిగ్రీ మధ్యలో చదువు ఆగిపోయిందట. కంప్యూటర్ మీద టైప్ బాగా చేసేది. ముగ్గురు ఆఫీసర్లకు ఒకే స్టెనో ఉండటం వల్ల తరచూ టైపింగ్ పనిని మీనా చేతే చేయించుకునేవాడిని.

    నేను రోజూ ఆఫీస్‌కి రెండు బాటిళ్ళ నీళ్ళు తీసుకెళ్ళేవాడిని. మీనా నీళ్ళే తాగేది కాదు. మధ్యాహ్నం లంచ్ చేశాక కూడా రెండు గుక్కల నీళ్ళు మించి ముట్టేది కాదు. ‘నీళ్ళు తాగకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకి కనీసం రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగమని కదా డాక్టర్లు సూచిస్తున్నారు’ అన్నానో రోజు.

    ‘ఇంటికెళ్ళాక తాగుతా’ అంది.

    ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌లో పనిచేస్తూ నీళ్ళు తాగకుండా ఉంటే శరీరం డీహైడ్రేట్ అయిపోదా?’ అన్నాను.

    తనేమీ మాట్లాడలేదు.

    “మన ఆఫీస్‌లో దొరికే నీళ్ళు మంచివే. ఆక్వాఫ్రెష్ కూడా ఉందిగా”

    “అందుకు కాదు”

    “పోనీ ఇంటినుంచి నీళ్ళు తెచ్చుకోవచ్చుగా”

    ఆ అమ్మాయి తలొంచుకుని పని చేసుకుంటోంది తప్ప సమాధానం ఇవ్వలేదు. “నీళ్ళు ఎందుకు తాగవు చెప్పు?” అన్నాను.

    ‘నాకు భయం’ అంది కనురెప్పలు వేగంగా మూసి తెరుస్తూ.

    నీళ్ళు తాగాలంటే భయమా?? నాకర్థంకాక విస్మయంగా చూశాను. కొన్ని క్షణాల తటపటాయింపు తర్వాత చెప్పింది.

    ‘నీళ్ళు తాగితే వాష్‌రూంకి వెళ్ళాల్సి వస్తుంది కదా?’

    ‘మా ఆఫీస్లో లేడీస్ టాయిలెట్ ఉందిగా. ఇబ్బందేముంది?”

    మళ్ళా తను మౌనంగా కూచుంది. కొంతమంది అమ్మాయిలు అపరిశుభ్రంగా కన్పించే పబ్లిక్ టాయ్‌లెట్‌లను వాడరన్న విషయం గుర్తొచ్చింది.

    ‘మన ఆఫీస్ బాత్రూంలు నీట్‌గా ఉంటాయి. ఇద్దరు స్వీపర్లున్నారుగా. రోజుకు మూడు నాలుగు సార్లు బాత్రూంలని ఫినాయిల్‌తో కడిగి శుభ్రం చేస్తారు’ అన్నాను.

    “అది కాదు”

    “మరి”

    ‘వాష్‌రూంకి వెళ్ళాలంటే మీ స్టాఫ్‌ని దాటుకుంటూ వెళ్ళాలి కదా. వాళ్ళేమనుకుంటారు?” అంది.

    నాకు నోట మాట రాలేదు.

    ‘ఎవ్వరూ ఏమీ అనుకోరు. వాళ్ళూ వెళ్తారుగా. ఆడయినా మగయినా వాష్‌రూం కెళ్ళాల్సిన అవసరం సహజం కదా’

    ‘మగవాళ్ళు చూస్తుండగా వాష్‌రూం కెళ్ళాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది’ అంది.

    “మీనాలా ఆలోచించే అమ్మాయిలు మన సొసైటీలో చాలామందే కన్పిస్తారు. వీళ్ళకు కౌన్సెలింగ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే” ఇంటికొచ్చాక రాణితో అన్నాను.

    ‘మన భాగ్యనగరంలో స్త్రీలకోసం కూడా పబ్లిక్ టాయ్‌లెట్లు ఉన్నాయి కదా. ఎవరయినా వాడుకోవడం ఎప్పుడైనా చూశారా?” అంది రాణి.

    ‘తల్లులే అలా ఉంటే పిల్లలకేం చెప్తారు?” అంది ముక్తాయింపుగా.

    ***

    నెలక్రితం ఓ యువ రచయిత్రి వద్దనుంచి ఫోన్ వచ్చింది.

    “మీ నవలలు చాలా చదివాను. మీతో మాట్లాడాలని ఉంది. ఎప్పుడు కలుద్దాం” అనేది తను మాట్లాడిన అరగంట మాటల్లోని సారాంశం.

    తన వద్ద బండి లేదని చెప్పింది. ఎక్కడికి రావాలో చెప్తే ఆటో లోనో బస్‌లోనో వస్తానంది.

    ఆ అమ్మాయిని శ్రమ పెట్టడం ఇష్టం లేక ఓ ఆదివారం నేనే తనుండే చోటుకెళ్ళి పికప్ చేసుకున్నా, సాయంత్రం ఆరు కావస్తోంది. మబ్బు పట్టి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

    ‘ఎక్కడికెళ్తాం’ అని అడిగాను.

    ‘ఏదైనా రెస్టారెంట్లో కూచుని వేడిగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం’ అంది. నాకు రెస్టారెంట్లకెళ్ళే అలవాటు లేదని చెప్పాను.

    “ఐతే మీ ఇష్టం. మీరెక్కడికి తీసుకెళ్ళినా నాకు ఓకేనే” అంది.

    ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ ముందున్న లాన్లో కూచున్నాం. తను నా నవలల గురించి మాట్లాడుతోంది. ఆకాశంలో మెరుపు మెరిసింది.

    ‘వర్షం పడ్తే బావుంటుంది కదూ. నాకు వర్షంలో తడవటమంటే చాలా ఇష్టం’ అంది.

    ‘తడవకుండా ఎక్కడైనా కూచుని వర్షాన్ని చూడటమంటే నాకూ ఇష్టమే’ అన్నాను.

    “మీరు రచయిత కదా… సౌందర్యాన్ని చూసి ఆనందించడమే కాదు ఆస్వాదించడం కూడా తెలిసి ఉండాలి కదా. చూస్తే ఏమొస్తుంది? తడిస్తే కదా మజా’ అంది.

    సన్నగా చినుకులు మొదలయ్యాయి. నేను తల తడవకుండా కర్చీఫ్‌తో కప్పుకుని చెట్టు కింద పార్క్ చేసిన కారు వద్దకు నడిచాను. తను అయిష్టంగా నా వెనకే వచ్చింది. కార్లో నా పక్కనే కూచుంది.

    వర్షాన్ని చూస్తూ ‘సెక్స్ గురించి మీ అభిప్రాయమేంటి’ అని అడిగింది. ఆ ప్రశ్న అడగడంలో ఆ అమ్మాయి ఉద్దేశమేమిటో అర్థం కాక ఆమె వైపు చూశాను.

    ‘సెక్స్ గురించి మాట్లాడటానికి మనుషులెందుకు జంకుతారు? అమ్మాయిలు మాట్లాడితే మన సమాజంలో అసలు తట్టుకోలేరు’ అంది.

    ‘స్త్రీల సాధికారత గురించి, వాళ్ళ సెక్సువాలిటీ గురించి కొంతమంది స్త్రీలు బలమైన కవితలు, కథలూ రాస్తున్నారు’

    ‘నేను మాట్లాడేది సభ్యత ముసుగులో రాసే రాతల గురించి కాదు. మీరందరూ బూతంటారే. పచ్చి బూతు… ఆ మాటల గురించి. ఇంగ్లీష్ సినిమాల్లో అమ్మాయిలు కూడా ఎంత క్యాజువల్‌గా ఫోర్ లెటర్ వర్డ్‌ని వాడతారో గమనించారా. అదే పదాన్ని నేను తెలుగులో చేస్తే మీరు భరించగలరా?”

    నేను మాట్లాడకుండా ఆ అమ్మాయి చెప్తున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను.

    ‘తప్పేమిటి? మన శరీరం గురించేగా మాట్లాడుతున్నాం… నేను సెక్స్ థీమ్‌తో కామసూత్రలాంటి పుస్తకం రాయాలనుకుంటున్నా. మీరేమంటారు?’ అంది.

    ఏదైనా అనడానికి నేనెవర్ని? వద్దనడానికో సరే అనడానికో నాకేం అధికారం ఉంది?

    ఇంటినుంచి బయల్దేరే ముందు మంచినీళ్ళివ్వమంటే ఓ పెద్ద రాగిచెంబులో నీళ్ళిచ్చింది రాణి. ఏదో ఆలోచిస్తూ మొత్తం తాగేశాను. దానికి తోడు బైట వర్షం. నాకు వాష్‌రూం కెళ్ళాల్సిన అవసరం…

    అప్పటికి దాదాపు గంట నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి “ఇక వెళ్తామా? మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టేస్తాను” అన్నాను.

    “అప్పుడేనా… మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది” అంది నిరాశగా మొహం పెట్టి. ‘మరో రోజు కలుద్దాం’ అన్నాను కారు స్టార్ట్ చేస్తూ.

    తనను డ్రాప్ చేసి ఇంటికెళ్ళేవరకు ఆపుకోగలననుకున్నాను కానీ ఆ అవసరం చాలా ఇబ్బందికరంగా మారింది.

    దార్లో ఒక చోట పే అండ్ యూజ్ పబ్లిక్ టాయిలెట్ కనిపించింది. కారుని ఓ పక్కన ఆపి ‘వాష్‌రూంకి వెళ్ళేసి వస్తాను” అన్నాను.

    ఆ అమ్మాయి మొహం వికారంగా పెట్టి “అయ్యో… తెల్సినవాళ్ళెవరైనా మిమ్మల్ని చూస్తే బావుండదు” అంది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here