సవ్యసాచి

0
10

[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘సవ్యసాచి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]తడు సవ్యసాచి
కుడిచేత స్టీరింగ్
ఎడమచేత టిమ్

ఇతడు సవ్యసాచే
కుడిచేత బాటిల్
ఎడమచేత సిగరెట్

ఆమే సవ్యసాచే
కుడిచేత గరిటె
ఎడమచేత బొట్టె

ఈ బుడుగు సవ్యసాచే
కుడిచేత సెల్ ఫోన్
ఎడమచేత పాల గ్లాస్

ఆ విద్యార్థీ సవ్యసాచే
కుడిచేత పెన్
ఎడమచేత బుక్

భావి భారత నిర్మాత ఇతడే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here