శ్రమజీవి ప్రతిభ ఫలమే

0
11

[dropcap]ను[/dropcap]దుట పట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ
అలసట ఆనవాళ్ళు మోముపై
కనిపించకుండా కాపాడుకుంటూ
తిరిగి పనిని ప్రారంభిస్తూ తనదైన
శైలిలో శ్రమిస్తుంటాడు!
పగలంతా పని చేసి ఇంటికి చేరాక..
రాత్రి శయనించినా
అతడి కళ్ళముందు కదిలే కాలం..
రేపటి తన పని గురించిన తపనే!
ఆ తపనే తపస్సుగా మారి ఉషోదయం
తరువాత పనిలో చేరేలా చేస్తుంది!
‘అతడి కల’ మన కళ్ళముందు
సజీవ చిత్రమై నిలుస్తుంది!
కలకాలం నిలిచిపోయే
‘నిర్మాణమై’ వెలుగొందుతుంది!
అతడి కష్టానికి ఫలితంగా..
అత్యద్భుతమైన అందమైన
కట్టడాలు రూపుదిద్దుకుంటాయి!
అధునాతన ఆనకట్ట లెన్నో
నీటి ప్రవాహాన్ని కట్టడి చేస్తూ
నీటిని వృథా కానివ్వకుండా
సృష్టించబడతాయి!
ఎకరాలకెకరాలు పంటలతో
సస్యస్యామలమవుతూ
పచ్చదనాన్ని సంతరించుకుంటాయి!
చూడ చక్కనైన ప్రాకారాలతో
భక్తి తత్వాన్ని విస్తరింపజేసేలా
ఆలయాలు ఎన్నో కట్టబడతాయి!
శ్రమజీవి ప్రతిభ ఫలమే
నేటి నవ నాగరిక జీవనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here