‘సిరికోన’ చర్చాకదంబం-4

0
8

[box type=’note’ fontsize=’16’] సిరికోన వాక్స్థలిలో జరిగిన చర్చ పాఠ్యాన్ని కూర్చి అందిస్తున్నారు డా. గంగిశెట్టి లక్ష్మీ నారాయణ. [/box]

పరాకాష్ఠ”― సాధు శబ్దచర్చ (చర్చాకదంబం)

ప్రశ్న: డా. శొంఠి శారదాపూర్ణ
వివరణ: డా.పాలపర్తి, ఆచార్య రాణీ సదాశివమూర్తి

~
షికాగో వాసిని, బహు కళా శాస్త్ర విదుషీమణి, డాక్టర్ శొంఠి శారదాపూర్ణ గారికి ఒక శబ్దం విషయంగా సందేహం కలిగింది.

పరకాష్ఠ’, ‘పరాకాష్ఠరెండూ సాధుశబ్దాలేనా? అని!

“పరకాష్ఠ” సాధువు అని గురుజనుల వలన విన్నట్లు భావిస్తూ, ‘పరా – కాష్ఠా’ సమాసంలో ‘పరకాష్ఠా’గా మారుతున్నదేమో అని అభిప్రాయపడ్డారు.

సందేహ నివృత్తి కోసం కొంతకాలం క్రితం సిరికోనలో ప్రశ్నించారు.

వెంటనే డాక్టర్ పాలపర్తి శ్యామలానంద శతావధాని గారు స్పందిస్తూ:
“ఇక్కడి ‘పరా’, ఉపసర్గలలోని ‘పరా’. అది ఎప్పుడూ దీర్ఘాంతమే. ‘పర’ శబ్దము వేరు. అది వ్యస్తసమస్తదశలలో మారుచుండును. ఇది మారదు.

ఈ ఉపసర్గకు తురీయమని అర్థము. పరాశక్తి, పరాకాష్ఠ,పరాక్రమ…” ఇత్యాది అని సోదాహరణంగా వివరించారు..
తదుపరి – “సమాసమైనప్పుడు ‘పరా’ ఉపసర్గ ‘పర’గా మార్పు చెందే అవకాశమున్నదా? తెలియజేయ” వలసిందిగా శారదాపూర్ణగారు మళ్లీ కోరారు…

బదులుగా పాలపర్తి గారు:   “ఉపసర్గ ఎప్పుడూ మారదు. ‘పరా చ సా దేవతా పరదేవతా’. ఇక్కడ సుబంతం. పరః,పరా,పరమ్ మూడులింగాలు. సమాసంలో సుప్పులు లోపిస్తాయి కనుక ప్రాతిపదికగానే ‘పర’ గా ఉంటుంది.” అని విశదీకరించారు.

ఆ పిమ్మట ఆచార్య రాణీ సదాశివమూర్తి సాకల్యంగా ఇలా వివరించారు:

  1. పరా, అవ్యయము
    విమోక్షః । ప్రాధాన్యమ్ । ప్రాతిలోమ్యమ్ । ధర్షణమ్ । ఆభిముఖ్యమ్ । భృశార్థమ్ । విక్రమః । గతిః । వధః ।
    ఇతి మేదినీ (అని మేదినీకోశం)
    *ఉపసర్గవిశేషము* । అస్యార్థః । > భఙ్గః । అనాదరః । ప్రత్యావృత్తిః । న్యగ్భావః ।
    అని ముగ్ధబోధటీకలో దుర్గాదాసు ॥
    ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
    *1. నిపాతలు (22)*
    నిపాతలన్నీ అవ్యయాలే.
    ప్ర, పరా, అప, సమ్‌, అను, అవ, నిస్‌, నిర్‌, దుస్‌, దుర్‌, వి,ఆ (ఆఙ్‌), ని, అధి, అపి, అతి, సు, ఉత్ /ఉద్‌, అభి, ప్రతి, పరి ఉప
    ఈ *నిపాతలన్నీ* క్రియలతో కలిసినప్పుడు మాత్రమే *ఉపసర్గలు* అని పిలువబడుతాయి.
    (*ప్రాగీశ్వరాన్నిపాతాః। ఉపసర్గాః క్రియాయోగే।) అని పాణిని సూత్రద్వయం..
    ఈ 22 నిపాతలలో ఒకటి *పరా*. అది క్రియలతో కలిస్తే ఉపసర్గ అనిపిలువబడుతూ ఈ క్రింది రూపాలవంటి రూపాలను పొందుతుంది.
    పరాహత, పరాగత, పరాదృష్ట,  పరాక్రాన్త, పరావృత్త, పరాజిత, పరాధీన, పరాకృత, పరాఙ్ముఖ వంటి రూపాలలో మాత్రమే ఇది ఉపసర్గ. ఉపసర్గలు ఎప్పుడూ మార్పు చెందవు.
    2. పరమ్/పరః/పరా ఇది విశేషణవాచక సుబంతం.
    దీనికి లింగ-విభక్తి-వచనాలు ఉంటాయి. అటువంటి సందర్భాలలో ఈ పరశబ్దానికి అనేకార్థాలూ ఉంటాయి.
    ఇవి ఉపసర్గలు కావుఇవి విశేషణములు మాత్రమే
    వీటి ప్రయోగాలు ఇలా ఉంటాయి.
    1. పుంలింగంలో …
    పరపురుషః … పరశ్చ అసౌ పురుషశ్చ … = పరపురుషుడు (పరమాత్మ)
    పరబ్రహ్మా .. పరశ్చ అసౌ బ్రహ్మా చ = సగుణపరబ్రహ్మ (పుంలింగము)
    2. నపుంసకలింగంలో …
    పరబ్రహ్మ … పరం చ తత్ బ్రహ్మ చ (పరబ్రహ్మము) నిర్గుణ పరబ్రహ్మము
    3. స్త్రీ లింగంలో…
    పరాదేవతా = పరా చ సా దేవతా చ
    పరదేవతా = పరేషాం (సర్వశ్రేష్ఠానాం త్రిమూర్తీనామపి) దేవతా (షష్ఠీతత్పురుష)
    గమనిక :  ఇక్కడపరశబ్దము ఉపసర్గ కాదు. స్త్రీ లింగమూ కాదు.
    త్రిమూర్తి ప్రతిపాదక పుంలింగశబ్దం. అందుకని హ్రస్వమైంది.
    పరా శబ్దము సదా స్త్రీలింగము
    పరావిద్యా, పరాశక్తి, పరా, పరాంబా, పరాభట్టారికా– మొదలైనవి. వీటిలో ఎప్పుడూ రా హ్రస్వము కాదు.
    పరాస్త్రీలింగశబ్దము
    పదనిష్పత్తి > పృ+ అచ్ + తతః టాప్ ।
    1. వన్ధ్యా- కర్కోటకీ (ఒక విషము)। ఇతి రాజనిఘణ్టుః ॥
    (అస్యాః గుణా యథా, — “బన్ధ్యాకర్కోటకీ లఘ్వీ కఫణుద్వ్రణశోధినీ । సర్పదర్పహరీ తీక్ష్ణా విసర్పవిషహారిణీ ॥” ఇతి భావప్రకాశస్య పూర్బ్బఖణ్డే ప్రథమే భాగే ॥)
    2.  పరా వాక్
    నాభిరూపమూలాధారాత్ ప్రథమోదితనాదస్వరూప- వర్ణః । యథా, — “మూలాధారాత్ ప్రథమముదితో యస్తు భావః పరాఖ్యః ॥” ఇత్యలఙ్కారకౌస్తుభే ప్రథమకిరణః ॥
    3. గంగా
    సముద్రమును, భక్తులకోర్కెలను పూరిస్తుంది కనుక గంగ
    పరా అని పిలువబడుతుంది.
    పూరయతి సాగరం భక్తమనోరథఞ్చేతి వ్యుత్పత్యా గఙ్గా । యథా, కాశీఖణ్డే । ౨౯ । ౧౦౬ ।
    “పరానన్దా ప్రకృష్టార్థా ప్రతిష్ఠా పాలనీ పరా ॥”
    అలాగే  గాయత్రీ
    4 . గాయత్త్రీ । యథా, దేవీభాగవతే । ౧౨ । ౬ । ౯౦ । “పార్వ్వతీ పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా ॥”)

 ― స్వస్తి
జ్యేష్ఠ భగినీసదృశులైన శారదాపూర్ణగారికి నమస్సులు.
ఇక్కడ నేను నివేదించుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
1. నేను ఇంకా *పరకాష్ఠం/పరా కాష్ఠా* గురించి మాట్లాడలేదు.
2. శ్రీ పాలపర్తి వారు సంగ్రహంగా చెప్పినదాన్నే నేను వివరించి చెప్పాను.
సారం – ఉపసర్గరూపమైన *పరా* సమాసంలో – *పర* గా మారదు.
మీరు చెప్పిన *పరకాష్ఠం* లోని *పర* ఉపసర్గ కాదు. అది సుబంతరూపమైన *విశేషణ పదమైన  *పర*  అని గ్రహించ గోరతాను.
అందుకే హ్రస్వత్వంలో తిరస్కరించవలసినపనిలేదు.
ఇక *పరకాష్ఠం/పరా కాష్ఠా* ప్రయోగాల గురించి తెలుసుకుందాం.
ఇక్కడ *పర/పరా* శబ్దములు ఉపసర్గలు కావు. వీటి అర్థము *తుది/చరమము/అగ్రము/హద్దు/చిట్టచివరి* అనే అర్థం లో విశేషణం.
ఇక *కాష్ఠం/కాష్ఠా* అనే పదముల అర్థములు –
అ) *కాష్ఠమ్* … వెదురు కర్ర లేక ఖాదిరాది వృక్షముల కట్టె అని అర్థం.
ఈ అర్థం లో *పరకాష్ఠం* కుదురుతుంది.
ఇక్కడ విగ్రహవాక్యం ఇలా చెప్పుకోవాలి.
*కాష్ఠస్య పరమ్* *పరకాష్ఠమ్* అని.
*ఉత్తరకాయః, *పూర్వకాయః*  లాగా.
*గమనిక*-
*ఈ ప్రయోగం ఇలా సాధువు అవుతుంది. కాని నాకు సిద్ధప్రయోగాలు తటస్థ పడలేదు.*
ఆ) ఇక *కాష్ఠా* అంటే 1.కాలముహూర్తభాగము.
2. ఉత్తరావధి అని అర్థం.
ఈ అర్థం లో *పరా కాష్ఠా* అనే ప్రయోగం వ్యస్తం గా ఉన్నది.
*శ్లోకం* (కుమారసంభవం లోని ప్రయోగం)
స్వయంవిశీర్ణద్రుమపర్ణవృత్తితా
*పరా హి కాష్ఠా* తపసస్తయా పునః।
తదప్యపాకీర్ణమతః ప్రియంవదాం
వదన్త్యపర్ణేతి చ తాం పురావిదః॥
– కుమారసమ్భవమ్ ౫.౨౮
*పదచ్ఛేదః*
స్వయం-విశీర్ణ-ద్రుమ-పర్ణ-వృత్తితా పరా హి కాష్ఠా తపసః తయా పునః।
తత్ అపి అపాకీర్ణమ్ అతః ప్రియంవదామ్ వదన్తి అపర్ణా ఇతి చ తామ్ పురావిదః॥
*అన్వయః*
తపసః హి *పరా కాష్ఠా* స్వయం-విశీర్ణ-ద్రుమ-పర్ణ-వృత్తితా (అస్తి)। తత్ అపి తయా పునః అపాకీర్ణమ్। అతః చ పురావిదః తామ్ ప్రియంవదామ్ అపర్ణా ఇతి వదన్తి॥
ఈ విషయాన్ని మల్లినాథులవారూ ఉదహరించారు.
అలాగే కఠోపనిషత్తు లో కూడా…
*సా కాష్ఠా సా పరాగతిః*  … పరమావధి అనే అర్థంలో *పరా* లేకుండానే వాడారు.
జ్యేష్ఠ భగినీసదృశులైన శారదాపూర్ణగారికి నమస్సులు.
ఇక్కడ నేను నివేదించుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.
1. నేను ఇంకా *పరకాష్ఠం/పరా కాష్ఠా* గురించి మాట్లాడలేదు.
2. శ్రీ పాలపర్తి వారు సంగ్రహంగా చెప్పినదాన్నే నేను వివరించి చెప్పాను.
సారం – ఉపసర్గరూపమైన *పరా* సమాసంలో – *పర* గా మారదు.
మీరు చెప్పిన *పరకాష్ఠం* లోని *పర* ఉపసర్గ కాదు. అది సుబంతరూపమైన *విశేషణ పదమైన  *పర*  అని గ్రహించ గోరతాను.
అందుకే హ్రస్వత్వంలో తిరస్కరించవలసినపనిలేదు.
ఇక *పరకాష్ఠం/పరా కాష్ఠా* ప్రయోగాల గురించి తెలుసుకుందాం.
ఇక్కడ *పర/పరా* శబ్దములు ఉపసర్గలు కావు. వీటి అర్థము *తుది/చరమము/అగ్రము/హద్దు/చిట్టచివరి* అనే అర్థం లో విశేషణం.
ఇక *కాష్ఠం/కాష్ఠా* అనే పదముల అర్థములు –
అ) *కాష్ఠమ్* … వెదురు కర్ర లేక ఖాదిరాది వృక్షముల కట్టె అని అర్థం.
ఈ అర్థం లో *పరకాష్ఠం* కుదురుతుంది.
ఇక్కడ విగ్రహవాక్యం ఇలా చెప్పుకోవాలి.
*కాష్ఠస్య పరమ్* *పరకాష్ఠమ్* అని.
*ఉత్తరకాయః, *పూర్వకాయః*  లాగా.
*గమనిక*-
*ఈ ప్రయోగం ఇలా సాధువు అవుతుంది. కాని నాకు సిద్ధప్రయోగాలు తటస్థ పడలేదు.*
ఆ) ఇక *కాష్ఠా* అంటే 1.కాలముహూర్తభాగము.
2. ఉత్తరావధి అని అర్థం.
ఈ అర్థంలో *పరా కాష్ఠా* అనే ప్రయోగం వ్యస్తం గా ఉన్నది.
*శ్లోకం* (కుమారసంభవం లోని ప్రయోగం)
స్వయంవిశీర్ణద్రుమపర్ణవృత్తితా
*పరా హి కాష్ఠా* తపసస్తయా పునః।
తదప్యపాకీర్ణమతః ప్రియంవదాం
వదన్త్యపర్ణేతి చ తాం పురావిదః॥
– కుమారసమ్భవమ్ ౫.౨౮
*పదచ్ఛేదః*
స్వయం-విశీర్ణ-ద్రుమ-పర్ణ-వృత్తితా పరా హి కాష్ఠా తపసః తయా పునః।
తత్ అపి అపాకీర్ణమ్ అతః ప్రియంవదామ్ వదన్తి అపర్ణా ఇతి చ తామ్ పురావిదః॥
*అన్వయః*
తపసః హి *పరా కాష్ఠా* స్వయం-విశీర్ణ-ద్రుమ-పర్ణ-వృత్తితా (అస్తి)। తత్ అపి తయా పునః అపాకీర్ణమ్। అతః చ పురావిదః తామ్ ప్రియంవదామ్ అపర్ణా ఇతి వదన్తి॥
ఈ విషయాన్ని మల్లినాథులవారూ ఉదహరించారు.
అలాగే కఠోపనిషత్తు లో కూడా…
*సా కాష్ఠా సా పరాగతిః*  … పరమావధి అనే అర్థంలో *పరా* లేకుండానే వాడారు.
***

తిరుపతి లోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డీన్ గా ఉన్న  ఆచార్య రాణీ సదాశివమూర్తి గారు అంత విపులంగా చెప్పాక, ఇక అనుమానం అణుమాత్రమైనా మిగిలేది ఎక్కడ?
ఇది ఈ ఏడాది ఏప్రిల్ నెల ఆరేడు తేదీల్లో మేము సదా గుర్తుంచుకొనేలా, పై ముగ్గురికీ ప్రణతులర్పిస్తూ నేర్చుకున్న శబ్దపాఠం.

నివేదన : గంగిశెట్టి లక్ష్మీనారాయణ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here