సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ 2023 – ప్రకటన

0
10

[dropcap]న[/dropcap]టసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి ప్రత్యేక కానుకగా కళాకారుల జీవితానుభవం ఇతివృత్తంపై సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచన పోటీ’ (2023).

ఉత్తమ నవలకు నగదు పురస్కారం ₹30 వేల రూపాయలు.. అర్హమైన ఇతర నవలలకు యథోచిత ప్రత్యేక పురస్కారాలు ఉంటాయి.

తాజాగా ‘రాసే’ నవలలు మాత్రమే పోటీకి అర్హం. ఈ పోటీ ఉద్దేశ్యం వస్తువైవిధ్యంతో తెలుగులో మంచి నవలల రచనను ప్రోత్సహించటమే!

***

డాలస్ నివాసి, తెలుగు భాషా సంస్కృతుల ప్రగాఢ అభిమాని శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు ప్రతి ఏటా తన మాతా పితరులు స్వర్గీయ శ్రీమతి జొన్నలగడ్డ సరోజమ్మ రాంభొట్లు గార్ల సంస్మరణంగా, సిరికోన లో నవలా రచన పోటీని నిర్వహిస్తున్న విషయం సాహిత్య మిత్రులకు తెలిసిందే..

ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ప్రకటించి, దానిపై రచనలు ఆహ్వానిస్తూ, ఆ రూపంగా తెలుగు నవల బహుముఖీనత్వానికి దోహదపడటం జరుగుతున్నది.

మొదటి సంవత్సరం చారిత్రక ఇతివృత్తంపై నిర్వహించిన పోటీల్లో శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు గారి ‘ఉపాసన’, తర్వాతి సంవత్సరం డయోస్ఫోరా ఇతివృత్తంపై డా. మోదుగుల సుధ గారి ‘అంతర్హిత’ ఉత్తమరచనా పురస్కారాలకు ఎంపికై, సముచిత సత్కారాల నందుకొన్నాయి..

వారితో పాటు మొదటి ఏడాది శ్రీమతి హైమాభార్గవ్ గారికి, గత సంవత్సరం శ్రీ మందపాటి సత్యం, శ్రీమతి పి.వి. శేషారత్నం గారలకు ప్రత్యేక బహుమతులనందించి సత్కరించటం జరిగింది..

ఈ ఏడాదికళాకారుల జీవన ఇతివృత్తంగా నవలారచనను సిరికోన ఆహ్వానిస్తోంది..

  1. సంగీతం, నృత్యం, రంగస్థలం, చిత్రలేఖనం మొదలైన ఏ కళారంగానికి సంబంధించిన ఇతివృత్తమైనా తీసుకొని నవలారచన చేయవచ్చు.
  2. పోటీకి పంపే నవల,12 పాయింట్ లో 120 పేజీలకు తక్కువ కాకుండా ఉండాలి. 200 పేజీల వరకు ఉండవచ్చు. పుటల గరిష్ఠ పరిమితి రచయిత ఇష్టం.
  3. పోటీ రచనలు 2023 డిసెంబర్ 31 తేదీలోగా pdf రూపంలో పంపాలి. (రాతప్రతులైనా పంపవచ్చు. రాతప్రతులను పంపవలసిన చిరునామా వ్యక్తిగతంగా తెలుపబడుతుంది.)
  4. ఉత్తమ రచనా పురస్కారం పొందుతున్న రచనకు ఫలితం ప్రకటిస్తున్నప్పుడే 15,000 రూ౹౹లు వారి అకౌంటుకు పంపడం జరుగుతుంది. ముద్రణ పిదప, జూమ్ మాధ్యమంలో పుస్తకావిష్కరణ నిర్వహిస్తూ, సముచిత సత్కారంతో పాటు మిగిలిన 15,000 రూ.లు అందచేయడం జరుగుతుంది.
  5. ముఖపత్రం వెనుక, అంటే రెండో అట్ట మీద, ఫలానా పురస్కారం పొందుతున్న రచన అని, సిరికోన నిర్వాహకుల సూచన మేరకు తప్పక ముద్రించాలి.
  6. పురస్కారం పొందిన వెంటనే నవలను సిరికోనలో సీరియల్ గా సమర్పించాలి.
  7. న్యాయ నిర్ణేతల సూచనను బట్టి, అర్హమైన ఇతర రచనలకు ప్రత్యేక బహుమతులు ప్రకటించే అవకాశం కూడా ఉంది..
  8. ఏదైనా ఇతర సమాచారం నిమిత్తం క్రింది వారిని సంప్రదించవచ్చు:
  • జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం # +1 (214)- 621- 1790 subbujvr@gmail.com
  • గంగిశెట్టి లక్ష్మీనారాయణ # +1 (341)-356-1093 gangisetty.ln@gmail.com

― సిరికోన (Silicon Academy of Letters)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here