[dropcap]2[/dropcap]019-2021 మధ్యకాలంలో వెలువరించిన కవయిత్రుల ‘ఉత్తమ’ ప్రథమ కవితాసంపుటికి పురస్కారం ప్రకటన.
~
- మరో మాటలో చెప్పాలంటే కవయిత్రుల డెబ్యూ సంపుటికి!
- అవి 2019 జనవరి నుంచి 2021 డిసెంబర్ ఆఖరులోగా ‘ముద్రితమై’ ఉండాలి.
- పరిశీలనకు పంపే సంపుటి కనీసం ముద్రణలో 80 పుటలు ఉండి తీరాలి. (ముందు మాటలు, అభినందన వగైరాలు కాకుండా. కేవలం కవితలు మాత్రమే.)
- ‘ముద్రిత సంపుటాలు’ వెలువరించలేని వారు పాల్గొంటూంటే, కనీసం 80 పుటలు రాగలిగే ముద్రిత కవితల జిరాక్స్ ప్రతులనైనా పంపవచ్చు. అయితే అవి కూడా పై మూడేళ్ళ కాలపరిమితిలోనే ఏవైనా ‘పత్రికలలో’ మాత్రమే ముద్రితమై ఉండాలి.
- ఇది ప్రతి ఏటా ఇచ్చే అవార్డు. 2019లో వచ్చిన కవయిత్రి డెబ్యూ సంపుటికి 20 లోనే ఇవ్వాలి. అయితే కరోనా చాలా వాటిల్తో పాటు కాలాన్ని కూడా మింగేయడంతో, 20 లోనూ, 21 లోనూ ముద్రణ కార్యక్రమం బాగా కుంటుపడడంతో, ఈ రెండేళ్ల కాలాన్ని కూడా కలిపి మొత్తం మూడేళ్ళ కాల పరిధిలో వచ్చిన ఉత్తమ కవితా సంపుటికి ఇద్దామని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
- కాలావధి పెంచడం వల్ల, ప్రధానమైన ఉత్తమసంపుటి అవార్డుతో పాటు మరొకటి/లేదా రెండు అర్హమైన ఇతర ఉత్తమ రచనలకు కూడా ప్రత్యేక పురస్కారాన్ని ప్రకటించే అవకాశం కమిటీకి ఉంటుంది.
- ఉత్తమ కవితా సంపుటిగా ఎంపికయ్యే రచనకు రూ.10000 (పదివేల రూపాయల) నగదు పురస్కారం, స్మారిక,పట్టు వస్త్రాలతో సముచిత సత్కారం ఉంటుంది (కరోనా పీడన లేకుంటే హైదరాబాద్లో మార్చి-ఏప్రిల్ నెలల్లో జరిపే సిరికోన సాహిత్యోత్సవంలో సత్కారముంటుంది. లేదంటే జూమ్ సమావేశంలోనే!)
- ప్రత్యేక పురస్కారానికి ఏవైనా ఎంపికైతే రూ.5000 (ఐదువేల రూపాయల) నగదు పురస్కారం, స్మారిక అందించబడుతుంది.
- రచనలు రెండు ప్రతులను పంపాలి. అందాల్సిన ఆఖరు తేదీ: 5 జనవరి 2022
- రచనలు పంపవలసిన చిరునామా: D.Veenavani, Flat No.502, Suja Celestia Apartment, Road No.21, Narsingi, Rangareddy, Hyderabad 500089, దూరవాణి: 9951331122
- పై చిరునామాకు రెండు ముద్రిత ప్రతులు పంపుతూ, ఈక్రింది ఐ.డి.కి pdf ప్రతిని ఈమెయిల్ చేస్తే మరింత హర్షదాయకంగా ఉంటుంది. (Pdf ప్రతులు పూర్తి కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడతాయి) gangisetty.ln@gmail.com