సిరివెన్నెల పాట – నా మాట – 20 – ఉల్లాసపు ఊపిరిని నింపే పాట

2
9

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

You and I – యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే

~

చిత్రం: జల్సా

గీతం: You and I

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

~

పాట సాహిత్యం

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే హకూనా మటాట అనుకో
తమాషగా తల ఊపి Varietyగ శబ్దం విందాం అర్థం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night, let’s do bhalle bhalle
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే

ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం కష్టం కూడ అద్భుతం కాదా
Botanicalభాషలో petals పూరేకులు Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరిభాషలో మధురమైన కథలు

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night let’s do bhalle bhalle
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే

పొందాలంటే Victory పోరాటం compulsory
risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే history లిఖ్ లో
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం Anatomy lab లో మనకు మనము దొరకం

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night let’s do bhalle bhalle
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే

అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.. అన్నది జీవిత సందేశం. మనం భూమి మీద జీవించే అత్యంత అమూల్యమైన కాలాన్ని క్షణక్షణం ఆనందాన్ని నింపుకోవడమే ధ్యేయంగా గడపాలి. అలా ఉండాలంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రతిబంధకాన్ని ఈజీగా తీసుకోవడం, ఆ సమస్యను తీర్చుకోవడం నేర్చుకోవాలి. మన భావనలో సమస్య ఎంత తేలికగా ఉంటే, అంతే తేలికగా విలీనమైపోతుంది. సమస్యలు ఎదురుపడని జీవితం ఉండదు. మనం సమస్యలన్నీ మార్చలేము. అందుకే సమస్యను మనం చూసే దృష్టి కోణం మాత్రమే మార్చాలి. Winners, Losers మధ్య ఉన్న తేడా అదే. “You and I lets go high and do bhalle bhalle…” పాట ద్వారా సిరివెన్నెల మనకు ఇస్తున్న సందేశం ఇది.

ఇలాంటి సందేశాన్ని మనకు అందించిన మరికొన్ని ఒకటి రెండు, ఇతర గీతాల్ని చూద్దాం.

ఊర్వశీ ఊర్వశీ take it easy ఊర్వశీ

వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ@2

గెలుపుకీ సూత్రమే take it easy పాలసీ

నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ..”

అని టేక్ ఇట్ ఈజీ పాలసీ జీవితాన్ని ఎంత హాయిగా ముందుకు నడిపిస్తుందో వివరిస్తారు రాజశ్రీ, ప్రేమికుడు చిత్రంలోని ఒక హిట్ సాంగ్‌లో.

“లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో..

కాసేపు టెన్షన్సన్నీ లైట్ తీసుకో..” అని ప్రబోధిస్తారు, రామజోగయ్య శాస్త్రి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్ర గీతంలో.

‘మై హార్ట్ ఈజ్ బీటింగ్..’ (జల్సా)

‘ఎప్పుడైనా రెడీ ఎక్కడైనా రెడీ..’ (రెడీ),

‘ప్యార్ కర్నా సీఖోనా పారిపోతే పరువేనా..

యా ఖుదా జర దేఖోనా, దూకుతున్నది పైపైన.’ (హరే రామ్),

‘మన దారే హైవేరా, సరసర దూసుకుపోరా, మన తీరే ఆవారా బేవర్స్‌గా తిరిగేయ్ రా..’ బ్యాచిలర్ బాయ్స్ సాంగ్ (మొగుడు) లాంటి లైట్, జోష్ ఫుల్ పాటల్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్‌లతో, హుషారైన సాహిత్యాన్ని మనకందించిన సిరివెన్నెల. ఈ పాటల్లో సిండ్రిల్లా, హీ మ్యాన్, స్పైసీ గర్ల్స్, లాంటి ఎన్నో కార్టూన్ చిత్రాలని, fables ని విచ్చలవిడిగా వాడడం, ఆయనకు ఇన్ని సబ్జెక్టుల పట్ల ఉన్న అవగాహననీ, వాటిని సమయానుకూలంగా వాడే నేర్పుని, మనకు తెలియజేస్తుంది. మనం విశ్లేషించుకునే ఈ పాట కూడా ఆ genre కు సంబంధించినదే.

తన స్వీయ సంగీత దర్శకత్వంలో, దేవి శ్రీప్రసాద్ ఆలపించిన ఈ యూత్ ఫుల్ సాంగ్, జల్సా చిత్రంలో, హీరో పవన్ కళ్యాణ్‌పై చిత్రీకరించబడింది. జనజీవన స్రవంతిలో కలిసిపోయి తిరిగి జీవితం ప్రారంభించిన నక్సలైట్ ప్రేమలో పడితే వచ్చే పరిణామాల చుట్టూ తిరిగే కథగా వచ్చిన చిత్రం జల్సా. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో పవన్ కళ్యాణ్ యూత్‌ని ఆకట్టుకునే మేనరిజమ్స్, డాన్సులతో ప్రెష్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తాడు. జీవితాన్ని హాయిగా, లైట్‌గా, ఉల్లాసంగా ఎలా గడపాలో చెప్పే హీరో ఫిలాసఫీని, ఈ పాటలో వ్యక్తీకరించడం జరిగింది. మంచి beat oriented, entertaining సాంగ్ ఇది.

యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబే వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్థం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే don’t worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి

You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night, let’s do bhalle bhalle
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే

జీవితాన్ని నవ్వుతూ గడపాలంటే, విధికి ఎదురీదాల్సిందే! అన్న ప్రేరణాత్మక వాక్యాలతో పల్లవి ప్రారంభమవుతుంది. అంత భయంకరమైన ఆటంబాంబు దాడులను ఎదుర్కొన్న జపాన్ కూడా, మళ్లీ లేచి బలంగా నిలబడింది. అదేవిధంగా నీకు కూడా ఏదైనా సమస్య వస్తే, ‘చల్ చక్ దే’, అంటూ, ‘హకూనా మటాట’, ‘don’t worry be happy’.. అంటూ cheer up అవ్వాలి. ఒత్తిడితో కూడుకున్న ఐదు పని దినాల తర్వాత దొరికే Saturday night లాగా, నువ్వు నేను హై లెవెల్లో- భల్లే, భల్లే అంటూ హుషారుగా డాన్స్ ఆడేద్దాం, బ్రతుకుని ఆటపాటలతో ఒక ఆటలాగా గడిపేద్దాం! అని అందర్నీ ఉల్లాస పరుస్తున్నారు సిరివెన్నెల.

‘చక్ దే’ అనే Punjabi phrase కు అర్థం ‘rock it’.

Hakuna matata” అనేది తూర్పు ఆఫ్రికాకు చెందిన Swahili భాషలోని ఒక నానుడి. దీని అర్థం”no trouble” or “no worries” and “take it easy”. (Literally hakuna: “there are no”; matata: “worries”.)

Evergreen Animation hits లో ఒకటైన The Lion King కార్టూన్ పిక్చర్‌లో, తెలుగులోకి అనువదించబడిన, ఈ పాట కూడా, ఈ జనరేషన్ పిల్లల్లో నోట్లో నానుతూనే ఉంటుంది.. బాధలన్నీ మాయం చింతలు మటుమాయం.. అంటూ, Timon, Pumba.. అడవిలో జంతువులన్నీ ఉల్లాసంగా పాడుకునే ఈ పాట కూడా, మనకు టేక్ ఇట్ ఇజీ సిద్ధాంతాన్నే బోధిస్తుంది.

హకూనా మటాట ఎంత మధురమైన గానం
హకూన మటాట ఉత్సాహం పొంగెనే..
బాధలన్నీ మాయం, చింతలు మటుమాయం..

ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం, కన్నీరైనా అమృతం, కష్టం కూడ అద్భుతం కాదా
Botanical భాషలో petals పూరేకులు Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanical శ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరిభాషలో మధురమైన కథలు..

రంగుల మయమైన జీవితం ఇంద్రధనస్సులా నీకు ఆహ్వానం పలుకుతోంది‌, సంశయించకుండా ముందుకు వెళ్ళు! ఆ అందాల్ని, ఆనందాన్ని అందుకో! అనే ఉల్లాసపు ఊపిరిని మనలో నింపుతోంది ఈ గీతం. నీపై నీకు నమ్మకం ఉంటే, విషాదం కూడా సుఖాంతం అవుతుంది. మనసు పరిభాషలో మధురమైన అనుభూతులను బాటని ఒకలాగా, మెట్ట వేదాంతం మరోలాగా, నిర్వచిస్తూ మన జీవితాన్ని యాంత్రికంగా మార్చకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తూ, ‘నీ జీవితానికి నీవే ఓ నిర్వచనమిచ్చుకో’, అని ప్రబోధిస్తున్నారు సిరివెన్నెల. జీవితాన్ని ఉసూరుమంటూ నిరాశగా గడపకు అన్నది సందేశం.

Think Right అనే ఒక ఇంగ్లీష్ poemలో Dr. David V. Bush.. చాలా చిన్న చిన్న పదాలతో, “నీ ఆలోచన ఎలా ఉంటే జీవితం అలాగే ఉంటుంది”, అన్న ఫిలాసఫీని మన ముందు ఉంచుతారు.

Think smiles, and smiles shall be;
Think doubt, and hopes will flee.
Think love and love will grow;
Think good, and good is here;
Think vice, it’s jaws appear!
Think joy, and joy ne’er ends;
……………………….
Think this: “I’m Going to Win!”
Think not on what has been.
Think “Victory;” Think “I Can!”
Then you’re a Winning Man.

పొందాలంటే Victory పోరాటం compulsory
risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే history లిఖ్ లో
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophy చూపులో ప్రపంచమో బూటకం Anatomy lab లో మనకు మనము దొరకం

ఒక హీరో కోసం గొప్ప ఉద్వేగాన్ని ఇచ్చేలా సిరివెన్నెల ఒక పాటను రాస్తే, అది ఆచరించిన వాళ్ళందరినీ హీరోలుగా మారుస్తుంది ఆ పాట. పోరాటం లేని విజయమే లేదన్న సిద్ధాంతాన్ని ఈ చరణంలో ఆయన ప్రతిఫలిస్తున్నారు. ఏ సమస్యనైనా ఛాలెంజ్ చెయ్! ప్రపంచంలోకంతా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అయితే, నీ సంకల్ప బలంతో దాన్ని నేలకు దించి, కాలం నిన్ను గుర్తుంచుకునే చరిత్ర సృష్టించుకో! నీ మనసులో వచ్చిన కోరిక ఎంత సత్య దూరంగా, కష్టతరంగా అనిపించినా, అలుపెరుగని ఉత్సాహంతో చెలరేగిపో! అంటున్నారు, ఈ Inner Engineering Specialist. అనాటమీ ల్యాబ్‌లో, శరీర భాగాలను వేరు చేసి చూస్తే, మనమేంటి? అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. పోనీ ఫిలాసఫీ చూద్దామంటే, ఈ ప్రపంచమే ఓ బూటకం అంటుంది! మరి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం కోరుకునే గమ్యాన్ని నిర్ణయించుకొని, ఎంత రిస్క్ అయినా, గెలుపు సాధించుకునేలాగా జీవితంలో ముందుకు సాగాలి..

Hellen Keller, Martin Luther King Jr, Lincoln, Malala Yousafzai, Nick Vujicic, Stephen Hawking, Sudha Chandran, Arunima Sinha, లాంటి వారు, Paralympics లో పాల్గొనే physically Challenged persons అందరూ విధిని ధిక్కరించిన వాళ్లే! అంగవైకల్యంతో మొట్టమొదటిసారిగా ఎవరెస్టును అధిరోహించిన Tom Whittaker, అంధుడై ఉండి హిమాలయ శిఖరాన్ని చేరిన Erik, వంటి most inspiring personalities అందరూ ధిక్కార స్వరాలే! తాము అనుకున్న ఆశయాన్ని సాధించడానికి, వీరిని ఏవీ అడ్డగించలేకపోయాయి. “పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ, ఎక్కాలంటే హిమగిరి, ధిక్కారం తప్పనిసరి”, అన్న ఈ రెండు వాక్యాలు, inspirational quotes లాగా మనల్ని ప్రతిరోజు ప్రోత్సహించగలిగినంత దృఢమైనవి.

“Don’t worry be happy
Here’s the little song I wrote
You might want to
Sing it note for note
In every life we
Have some trouble
But when you worry
you make it double”..

అనే Bobby Mc Ferrin Music video కూడా మనకు ఇదే సందేశాన్ని అందిస్తుంది.

“True power of life is the realization that you are your own philosopher, healer, hero, and leader.”

విధాత తలఁపున ప్రభవించినది..! అంటూ సినీ సాహిత్య రంగంలో ప్రభవించిన సూర్యుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన తొలి గీతమే తెలుగు సినీ ప్రేక్షకులు, రసజ్ఞుల గుండెల్లో గొప్ప స్థానం సంపాదించి పెట్టింది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారంరోజులు పట్టినట్లు సిరివెన్నెల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేమని, స్నేహాన్ని, అనుబంధాన్ని, ఎంత చిన్న చిన్న పదాల్లో పొదిగి చూపించగలరో, అంతే సులువుగా జీవిత సత్యాన్ని, జీవన వికాస సూత్రాన్ని, అద్వైతాన్ని, విడమరచి చెప్పగల ప్రజ్ఞాశీలి సిరివెన్నెల. అసలు ఇది తన ప్రత్యేక శైలి అని ముద్ర వేసుకోకుండా తెలుగులో ప్రజనీకానికి తెలిసిన, తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఏ గీతంలో అయినా, గీతామృత సారాన్ని సందేశాల రూపంలో మన కందిస్తూ విధిరాతకు ఎదురీతను నేర్పిన ఒక ఉత్తమ గురువు సిరివెన్నెల.

సిరివెన్నెల, “మనం ఎలా ఉండాలో చెబుతూ పాటలు రాశాడు, మనం ఎలా ఆలోచించాలో చెబుతూ పాటలు రచించాడు, ఓడిపోతే ధైర్యాన్ని కోల్పోకూడదనీ, ఆత్మహత్యలు చేసుకోకూడదని చెబుతూ పాటలు రాశాడు, లైఫ్‌లో ఎలా ఎదగాలో చెబుతూ పాటలు రాశాడు.. జీవితం అనే పరీక్షలో మనల్ని నెగ్గించి, అలా ఒక ఉపాధ్యాయుడిగా తాను మిగిలిపోయాడు, సిరివెన్నెల.. అన్న వి.ఎన్. ఆదిత్య గారి అభిప్రాయం అక్షర సత్యం.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here