‘సీత’ – కొత్త ధారావాహిక – ప్రకటన

0
11

[dropcap]ప్ర[/dropcap]సిద్ధ రచయిత్రి ‘స్పందన అయాచితం’ – సంచిక పాఠకుల కోసం రచించిన ‘సీత’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

***

“ఒరేయ్ నేను నీకు అమ్మాయిని వెతకనా?” అమ్మ అడిగింది.

“ఎరేంజ్డ్ మారేజ్? అంత సీన్ లేదు!!!” అన్నాను.

“అంతా నా ఖర్మ….” అమ్మ మొఖం మాడ్చుకుంది.

నేనేం మాట్లాడలేదు. ఏం చేసినా తగ్గేది లేదు. డిసైడ్ అయిపోయాను ….

“ఒరేయ్! అసలు నీకు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉందా? లేక అబ్బాయంటే ఇష్టమా? నిజం చెప్పు.” అంది అమ్మ.

“అమ్మా! మ్మా… మ్మా….. మ్మ!? (రీసౌండ్). ఎంత మాట అన్నావు? ఈ రొమాంటిక్ హీరోకి ఒక్క అమ్మాయితో కాదు, పది మంది అమ్మాయిల్తో పెళ్ళి అవుతుంది.” నా సమాధానం.

“వద్దు నాయనా! నాకు ఒకటి చాలు. సరే! ఎలాగో మీరిద్దరు విడిపోయారు. ఇప్పుడైనా నీకు నచ్చిన ఒక ఇండియన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోరా!!” అమ్మ బతిమాలింది.

***

వచ్చే వారం నుంచే ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here