స్మిత..!!

1
8

[dropcap]నా[/dropcap] ఫోటో
చూసినప్పుడల్లా,
నా ప్రియ స్నేహితులెప్పుడూ
“కాస్త నవ్వచ్చు కదా!”
అంటూ –
ఆశీర్వదిస్తుంటారు నన్ను!

అవి సరదాగా అన్నా..
కోపంగా
మందలించినా..
వెక్కిరింపు ధోరణి ఐనా,
మనసులోనే
నవ్వేసుకుంటాను
వారి అభిమానానికి,
బయటికి –
ఎలాగూ నవ్వలేను గనుక!

నవ్వడం ఒక అదృష్టం,
నవ్వించడం ఒక కళ,
నవ్వేవాడ్ని చూసి
నవ్వే ప్రయత్నం చేయడం,
ఒక అనుభూతి..
అందుకే –
ప్రతి జీవితానికి
హస్యం..
ఒక చైతన్య గుళిక,
ఆనందం కలిగించే,
ఆరోగ్య ప్రణాళిక!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here