స్నేహం

0
11

~
[dropcap]కా[/dropcap]గితపు పడవలా
తొణికిసలాడే చూపుతో కదిలే
చిన్న వానలాటి నవ్వు

మాటల చెకుముకి రాళ్ళతో
తటాలున వెలుగు పంచుతూ
మనసును ముట్టించే ఒక గోరు వెచ్చటి మాట

చిటారుకొమ్మను చేరి చుట్టూ పరికించి
గొంతు విప్పి ఆకసాన పరిచిన పిట్టపాటలా
ముద్దాడే ఓ మనసైన స్పర్శ

మళ్ళీ రేపటి సంతోషాలకై
కనులు వెతికే
తనివారని తీయటి కల!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here