స్పెయిన్ యాత్రానుభవాలు

0
15

[dropcap]ఇ[/dropcap]టీవల తాము స్పెయిన్‍లో జరిపిన క్రీడా పర్యటన గురించి వివరిస్తున్నారు శ్రీమతి నర్మద రెడ్డి.

***

జీవితంలో, క్రీడలలో ఎన్నెన్నో విజయాలు సాధించినవారు ఎందరో వున్నారు. వారి ఇన్‌స్పిరేషన్‌తో నేను గత 43 సంవత్సరాల నుండి బాడ్మింటన్ ఆడుతున్నాను. గత 5 సంవత్సరాలుగా నేషనల్స్ వరకు వెళ్ళి ఆడి గెలుచుకున్నాను. కాని ఎంతో ఉద్వేగ భరితమైన, ఎంతో సంతోషమైన వార్త నేను ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్‌కి అర్హురాలిని అవ్వటం.

స్పెయిన్‍లో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడటానికి ఒక నెల కోచింగ్ తీసుకొని, మా partners తో  సాధన చేసి స్పెయిన్‌కి నేను మా వారు బయల్దేరాము. కరోనా మూలంగా అక్కడ మమ్మల్ని తీసుకువెళ్ళడానికి చక్కటి బస్సులు, వేన్‍లు ఏర్పాటు చేశారు. వీరే వారితో తిరిగినప్పుడు కరోనా సోకకుండా, Rio Punta Umbrio Apartment లో అందరు క్రీడాకారులకి బస ఏర్పాటు చేశారు.  వివిధ దేశాల బాడ్మింటన్ ఆటగాళ్ళు దాదాపు 200 మంది వరకు వున్నారు.

మాస్టర్స్ బాడ్మింటన్ ఛాంపియన్‍షిప్‌కి కూడా ఇంత క్రేజ్ వుంటుందని తెలియదు. మాకు ఐడి కార్డ్స్ ఇచ్చారు. హోలా (Heulva) అనే చోట 2 కోర్టులు పెట్టారు. Diego Lobato లో కూడా ఒక కోర్ట్ ఏర్పాటు చేశారు రోజూ మేము సాధన చేయడానికి.

ప్రతీ అరగంటకి ఒక బస్. రోజంతా క్రీడాకారుల కోసం ఉచిత బస్ సర్వీస్. సాధనకి వెళ్ళడానికి రావడానికి ఈ ఏర్పాటు అచ్చంగా మన క్రికెటర్లకి ఇచ్చిన సౌకర్యాల వంటివే ఇచ్చారు.

బోర్డు మీద మా పేర్లు ఉండడం ఓ అద్భుతమైన అనుభూతి. ఇందులో నేను 55+ కేటగిరిలో డబుల్స్, mixed doubles, singles లో ఆడాను. 17, 18 points మాత్రమే వచ్చాయి. చాలా ప్రాక్టీసు చేయాలి, ఈ లెక్కలో అనుకున్నాము. ఈ ఏడాది టోర్నమెంట్ కొరియాలో వుంది. పోటీలు నవంబరు 29 నుండి డిసెంబర్ 9 వరకు జరిగాయి. ఈ గేమ్స్ ఆడుతూ మేము విరామ సమయంలో అన్ని పర్యాటక స్థలాలు దర్శించాము.

6 రోజులు అన్ని స్థలాలు – Madrid, Sevilla, Heulwa, Córdoba, Punta del Sebo చూశాము. 1929 లోనూ, 2011లో కట్టిన కట్టడాలు దర్శించాము. ఇందులో Heulwaలో కొలంబస్ మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసిన 3 పడవలు – Pinta, Santa Maria, Nina అనే పడవల్ని Replicaగా పెట్టారు. 100 ఎకరాలలో కొలంబస్ స్మారక చిహ్నం ఉంది. 150 మీటర్ల ఎత్తున్న పెద్ద స్థూపము, బురుజు ఉన్నాయి.

ఇక్కడి నుండే… Heulwa అనే స్థలం నుంచే… అతని ప్రయాణం మొదలు పెట్టాడు. మేము అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నాము. అక్కడ పెద్ద మ్యూజియం కూడ వుంది. అందులో అతడు ఉపయోగించిన దిక్సూచి, తాళ్ళు, చెంబు, పళ్ళెం అన్ని పెట్టారు. మొదటి సారి వెళ్ళినప్పుడు అతను ప్రార్థన చేసిన చర్చ్‌కి వెళ్ళాము. కొలంబస్ సమాధి Sevilla లో వుంది.  Sevilla లో అతని పేరున పెద్ద బురుజు వుంది. ఇక్కడే పెద్ద ఆంపి థియేటర్ ఉంది. ఇందులో వారి సాంప్రదాయక దున్నల పొట్లాటలు జరిగేవి. ఇది చాలా విశాలంగా వుంది. ఏదీ చెక్కు చెదరని ఆంపి థియేటర్‌ని అబ్బురంగా చూశాము.

ప్రపంచ వారసత్వ కట్టడాలు:

1402 నుండి 1506 వరకు కట్టిన మసీదు అద్భుతమైనది. La Giralda అనే bell tower మరో గొప్ప కట్టడం. దాన్ని 12వ శతాబ్దంలో కట్టారు. 93 మీటర్ల ఎత్తులో వున్న ఈ Cathedral చాలా అందంగా వుంది. ఇది Gothic wood carvingతో ఎంతో సౌందర్యంతో అలరారుతుంది.

ఇక్కడికి మేము ఆదివారం వెళ్ళాము. పెద్ద ఊరేగింపుతో ఈ చర్చ్‌కి 150 మంది మేళతాళాలతో వెళుతున్నారు. అది చూస్తూ మేము వారితో పాటు నడిచాము. వారు అందరూ నల్లటి  suites వేసుకొని ఉన్నారు. ఊరోగింపు కన్నుల విందుగా సాగింది.

తర్వాత Alcazar Royal King Palaceకు వెళ్ళాము.

అక్కడి నుండి Adriana Rodriguez Leon వెళ్ళాము. ఇది ఎంత అద్భుతమైన కట్టడం అంటే ఎంత వర్ణించినా తక్కువే. ఎంతో విశాలమైనది, దాదాపు ఒక 150 ఎకరాలలో వుండవచ్చు. అంత అందమైన భవనము. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు Spanish dance చేస్తున్నారు. ఇది Andalusia అనే ప్రాంతంలో Guadalquivir అనే నదికి దగ్గరలో వుంది. Espano అనే palace కి María Luisa Park అనే మరో పేరు వుంది. 50,000 చదరపు మీటర్లలో విస్తరించిన ఉన్న పార్కు, అర్ధ చంద్రాకరంలోని అతి సుందరమైన భవనం పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి.

ఈ భవనం చుట్టూ అమర్చిన టైల్స్‌లో 49 స్పెయిన్ provinces ని చూపిస్తూ వున్న చక్కటి నీలం రంగు టైల్స్ ఎంతో అందంగా ఉన్నాయి.

ఎన్నో సినిమాలు:

Lawrence of Arabia, Star Wars: Episode II – Attack of the Clones వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ తీశారు. అక్కడి నుండి  పోర్చుగల్ వెళ్ళాము.

Faro అనే placeకి వెళ్ళాము. ఇక్కడ చాలా అందమైన 5 star hotel ఉన్నాయి. అన్నీ పడవలలోనే. సముద్రతీరంలో మేము ఒక టేబుల్ తీసుకుని కాఫీ త్రాగుతూ 2 గంటలు గడిపాం. మేము వండుకున్న పులిహోర తిని ఆ city అంతా చూశాము. అక్కడ ఒక వేన్ తీసుకొని ఐదుగురం నగరం అంతా చూశాము.

2021 నవంబర్ 24th వెళ్ళాము. డిశంబర్ 11న వచ్చాము.  Córdobaలో కొలంబస్ సాయం అడిగిన Isabella Palace చూశాము.

అలాగే Alcazar building చూశాము. ఇంకా ఎంతో అద్భుతమైన కట్టడాలు, పార్కులు అన్నీ చూశాము.

Carmona అనే ప్రాంతానికి వెళ్ళాము. అన్నీ పురాతన భవంతులు చూశాము. ఇక్కడ Sanjay అతని భార్య 60 రోజుల ప్రయాణంలో ఒక Caravan van తీసుకుని Norway నుండి అన్ని దేశాలు తిరుగుతూ మాకు పరిచయమయ్యారు. వింతలోకంలో వింతైన అనుభవాలు చెప్పారు.

అక్కడి నుండి కరోనా భయంతో 2 రోజుల ముందే మేము మళ్ళీ tickets book చేసుకుని India వచ్చేశాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here