స్రవించే గీతలు

0
10

[శ్రీ జాని తక్కెడశిల అనువదించిన ‘స్రవించే గీతలు’ అనే కవితని అందిస్తున్నాము. ఆంగ్ల మూలం: Tamikio L Dooley]

కలం సున్నితంగా
కాగితాన్ని సంప్రదించిన తర్వాత,
గీతలకు మించిన రహస్యాలు
చుక్కలు చుక్కలుగా స్రవిస్తాయి.
కొందరికి అదొక చూడముచ్చటైన వినికిడి.

కలం శాంతంగా కదులుతుంది.
ఊహించుకోండి!
పదాలుగా చెప్పకముందే,
అక్షరాలకు తియ్యదనాన్ని అద్దాలి.
మొన కాగితాన్ని ముద్దాడగానే,
పదాల మాంసం నుండి
తీపి తప్ప మరేం స్రవించగలదు?
కలం గొంతు
అనేక విషయాలపై సంభాషిస్తుంది.

కలం-
గీతల మీద స్రవిస్తున్న సమయంలో
మొన-
అందమైన పాటలను పాడుతుంది.

తీపి పెదవులు
స్రవించే గీతల మార్గాన్ని అనుసరిస్తాయి.
మాట్లాడే ప్రతి గొంతులో గౌరవం ఉంటుంది.
అది కలం యొక్క సున్నితమైన కదలిక.
అదే గీతలను స్రవించేలా చేస్తుంది.

ఆంగ్లం: Tamikio L Dooley
స్వేచ్ఛానువాదం: జాని తక్కెడశిల (అఖిలాశ)

~

మూల కవితని క్రింద చదవవచ్చు.

Bleeding Lines

It is the gentle stroke of the pen
That which is hidden behind the tongue
When the point touches the paper
The words bleed
A sweet attachment to the thy ear

It is the gentle stroke of the pen
If the sweet words could be announced before written
When the point touches the paper
The flesh of the words bled sweet nothings
And the voice from the pen specks volumes

When the pen causes the words to bleed
The tip strokes a very lovely song
Sweet lips traces the bleeding words
Each tone spoken with dignity
It is the gentle stroke of the pen
That causes the bleeding lines.

Copyright © 2023 by Tamikio L. Dooley

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here