శ్రీ రామాంజనేయం

0
7

[dropcap]వా[/dropcap]డి పేరు భోజరాజు, ఏడేళ్ళ వాడు. తల్లి రోజుకు రెండు సార్లు బయటికి పంపిస్తుంది, అన్ని కరోనా జాగ్రత్తలతో. వీధి చివర వరకూ తన ట్రై సికిల్‌తో వెళ్లి సరుకులు తెస్తాడు.

ఇవాళ నా సాయంత్రపు వాహ్యాళితో వాడి ప్రయాణం మేచ్ అయింది.

“ఏమయింది రా దాన్ని మీదికి ఎత్తి నడుస్తున్నావు?” అడిగాను

“టైర్లు కట్. అయినా దీని పేరు మీకు తెలియదా? స్పెషల్ నేమ్, కె.ఎస్.కె.సి అంటే కిక్‌ స్టార్ట్‌ కిడ్స్ సైకిల్.” చెప్పాడు.

Image Courtesy: Internet

ఎంత అజ్ఞానివిరా అన్నట్టు మొహం పెట్టి

“శ్రీలంకలో పడేస్తే ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని చూసి వచ్చినట్టు జాగ్రత్తగా మన సెల్లార్‌లో తెచ్చి పెట్టేస్తాడు అంకుల్‌”

వాడి మాటల విన్యాసాలు మరీ విచిత్రంగా ఉన్నాయి.

“శ్రీలంక ఏమిటిరా?”

“అదే శ్రీలంక తెలుసుగా. సింహళ దేశం. రాముడు వారధి మీద వెళ్లి పది తలల వాడిని చంపాడు”

లాభం లేదు చిన్నవాడు నన్ను డామినేట్ చేస్తున్నాడు.

మెకానిక్ ఉన్న చోటుకు రాగానే “ఇదే శ్రీలంక తెలుసా అండీ” అన్నాడు.

నిజంగానే అక్కడ శ్రీలంక ఉంది. మోకానిక్ రోడ్ మీద ఒక గీత వలయాకారంలో పెయింట్‌ చేసాడు, రిపేరు కొస్తున్నవి దానిలోనే ఉంచాలని చెప్తూ.

భోజరాజు తన సైకిల్ అక్కడ పెట్టాడు, సమస్య వివరించాడు.

“సార్ ఈ బాబుతో కలిసి వచ్చారా? ఈయనని బేగి ఇంటికి చేర్చేయండి. లేకపోతే వీళ్ల అమ్మ గారి నుంచి కాల్స్ మొదలవుతాయి నాకు. ఎంచేతనంటే ఈయన గారు దారి పొడుగునా మీటింగులు పెట్టేస్తాడు.”

నాకు ఒక్క కుతూహలం మిగిలి ఉంది.

“నీ పేరేమిటోయ్?” అడిగాను

“శ్రీ ఆంజనేయులు సార్”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here