శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావుగారి 101వ జయంతి వేడుకలు – ప్రెస్ నోట్

1
298

24-12-2023, సాయంత్రం 5:30 గం.ల నుండి, విశాఖ సాహితి, ఘండికోట సాహితీపీఠం ఆధ్వర్యాన ప్రముఖ రచయిత, విశాఖ సాహితి తొలి అధ్యక్షులు కీ.శే. ఘండికోట బ్రహ్మాజీరావు గారి 101వ జయంతి వేడుకలు, విశాఖపట్నం, పౌర గ్రంథాలయంలో, విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. కందాళ కనకమహాలక్ష్మి గారి అధ్యక్షతన జరిగినవి.

ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ సభలో డా. దామెర వెంకట సూర్యారావు గారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, 2023వ సంవత్సరానికి గాను ‘ఘండికోట బ్రహ్మాజీరావు మరియు సీతారామ స్మారక సాహితీ పురస్కారం’ ప్రముఖ కథకులు శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారికి ప్రదానం చేయడం జరిగింది.

ఈ సభలో పాల్గొన్న అతిథులు బ్రహ్మాజీరావుగారి సాహితీసేవను కొనియాడుతూ, ‘ఘండికోట సాహితీపీఠం’ ప్రతి ఏటా సాహితీ పురస్కారం అందజేయడాన్ని ప్రశంసించారు.

పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభకు శ్రీ ఘండికోట విశ్వనాధం వందన సమర్పణ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here