‘శ్రీమద్రమారమణ’ – సరికొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన

0
12

[dropcap]సం[/dropcap]చికలో త్వరలో శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికగా అందించనున్నాము.

‘శ్రీమద్రమారమణ’ ఒక విభిన్న వస్తువును తీసుకోని రాసిన నవల.

అమెరికా, డల్లాస్ లోని సిరికొన సంస్థ వారు, నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.

నవలకి కళాకారుల జీవితం ఇతివృత్తమై ఉండాలనీ, అలా అని సజీవ లేదా కీర్తిశేషుల జీవితచరిత్ర కాకూడదు, సృజనాత్మకమై ఉండాలనేది నిబంధన. ఆ మేరకు, పాణ్యం దత్తశర్మగారు, ఒక హరికథా కళాకారుని జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ‘శ్రీమద్రమారమణ’ అనే చక్కని నవల వ్రాశారు.

నవల రాయలసీమ లోని కర్నూలు, కడప, జిల్లాల నేపథ్యంలో ఎక్కువగా కొనసాగుతుంది.

నవలలోని ముఖ్యపాత్ర) (Protagonist) వైనతేయ యస్.టి. (యానాది) కుటుంబంలో పుడతాడు. అతనికి దైవదత్తంగా సుస్వర గాత్రం బాల్యంలోనే లభించింది. దాన్ని గ్రహించిన అతని టీచర్ దస్తగిరి, ఆ పిల్లవాడికి సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇస్తాడు.

ఆ యానాదుల పిల్లవాడు క్రమక్రమంగా, గురువులు అనుగ్రహంతో, ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు ఎదిగి, లుప్తమయిపోతూ ఉన్న హరికథ అన్న అద్భుత భారతీయ కళారూపాన్ని, సమకాలీన అభిరుచులకు అనుగుణంగా మలచి, మళ్లీ దాన్ని శిఖరాగ్రాలకు చేర్చడమే ఈ నవల ప్రధానాంశం.

హరికథారంగంపై సమగ్ర పరిశోధన ఈ నవల. సంగీత సాహిత్య సౌరభాలను వెదజల్లుతూ, మానవతా పరిమళాలను సైతం పరిఢవిల్ల చేసే ఈ విశిష్ట నవలను ఉత్తమాభిరుచిగల సంచిక పాఠకుల కోసం అందిస్తున్నాము.

***

‘శ్రీమద్రమారమణ’ – కొత్త ధారావాహిక

వచ్చే వారం నుంచే

చదవండి.. చదివించండి.

సంచిక టీమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here