[డా. బాలాజీ దీక్షితులు పి.వి. రచించిన ‘సుఖరేఖ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]వి[/dropcap]నీల ఆకాశపు
వెన్నెలలా
విహంగ మాలికల
తారకలా
సంధ్యా నవ్వుల
జలధారలా
పురి విప్పిన
హరివిల్లులా
లత లల్లిన
కొమ్మన వ్రాలిన విహారిలా
ప్రేమామృత ఉషస్సులా
భావామృత తపస్సులా
రసామృత మనస్సులా
విరిసిన వసంతం.. నీవు
నవ్వుల.. తరంగం నీవు
రెప్పల పతంగం నీవు
మధు పవనం నీవు
సుగంధ సుఖరేఖవు నీవు