సుందరకాండ.. నవలా రూపంలో!! అతి త్వరలో !!!

0
12

నివృత్త వనవాసం చ త్వయా సార్ధమరిందమమ్!

అభిషిక్తమయోధ్యాయామ్ క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్!!

(వాల్మీకి రామాయణం, సుందరకాండ, LXVIII, 29)

శత్రుసంహారకుడయిన రాముడు వనవాసము పూర్తి చేసుకుని అయోధ్య నగరంలో నీ ( సీత) తో కలసి పట్టాభిషిక్తుడవటం త్వరలో సంభవిస్తుంది. మీరు దాన్ని త్వరలో అనుభవిస్తారు.

భారతీయ సమాజంలో, వాల్మీకి రామాయణం ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రామాయణంలోని అన్ని కాండలలోకీ సుందరకాండ మరింత ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సుందరకాండ పారాయణం సకల సమస్యలకు పరిష్కారం అన్న విశ్వాసం భారతీయ సమాజానికి వుంది. సుందరకాండ పారాయణం సకల దుఃఖ నివారణం అన్న నమ్మకం ఈ దేశ ప్రజల రక్తంతో కలసి ప్రవహిస్తుంది.

అలాంటి సుందరకాండని, తొలిసారిగా నవలారూపంలో అందిస్తోంది సంచిక త్వరలో..

రామాయణంపై, రాముడిపై కుత్సితమతులు  చేస్తున్న  దుర్గంధ భూయిష్ట  దుర్వ్యాఖ్యానాలపై  సృజనాత్మక శర ప్రహారం

సుందరకాండ (నవల)

వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ, ఔచిత్యాన్ని పాటిస్తూ, వాల్మీకి పాత్రల వ్యక్తిత్వాలను ప్రస్ఫుటం చేస్తూ, రామాయణ తత్వాన్ని మరింత చేరువచేసే విధంగా అందమయిన కల్పనలతో సంచిక అందిస్తున్న సరికొత్త ధారావాహిక..

సుందరకాండ (నవల)

చదవండి.. చదివించండి.. రామాయణం అందించే రామరసాన్ని ఆస్వాదించండి.

‘సుందరకాండ’ (నవల)..

అతి త్వరలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here