శ్వాసించనీ

0
11

[మాయా ఏంజిలో రచించిన ‘Call Letters Mrs. VB’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(తనదైన నల్లజాతిని అణగదొక్కుతున్న ఆనాటి అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి వ్యంగ్యం గాను, ఆత్మవిశ్వాసం ఉట్టిపడేట్టుగాను మాయా రాసిన కవిత!)

~

[dropcap]నా[/dropcap]వలా..
తప్పకుండా నేను నడుపుతాను
పడవని చూపించు
అది నీళ్ళపై తేలినట్టయితే
దాన్ని నేను నడిపిస్తాను

మగవాళ్ళా..
అవును నేను వాళ్ళని ఇష్టపడతాను
వాళ్ళకంటూ ఓ రీతి ఉండి
నన్ను నవ్వించేలా వాళ్ళుంటే
వారిని నేను ప్రేమిస్తాను

జీవితమా..
ఎంచక్కా బతికేస్తాను
నా మరణం దాకా
నన్ను హాయిగా శ్వాసించనిస్తే
ఎంచక్కా బతికేస్తాను

వైఫల్యమా..
దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడను
వైఫల్యం కాదు కదా
దాన్ని పలకడాన్నీ
నేనింకా నేర్చుకోలేదు!!

 

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


తన ‘On the pulse of morning’ కవితని మాయా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ first inaugural లో ప్రత్యేక ఆహ్వానితురాలిగా కవితాగానం చేయడానికి ఆహ్వానింపబడింది. 1993 జనవరి 30వ తేదీన ప్రముఖ అతిథుల మధ్య బహిరంగ కవితాగానం చేసింది మాయా. అమెరికా చరిత్రలో first inaugural లో కవితాగానం చేసిన రెండవ poet గాను, మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళగాను మన్ననలు అందుకుంది మాయా. అమెరికా చరిత్రలోని క్రూరమైన హింస, స్థానిక ప్రజల మారణహోమం, వలసజీవులకు సముచిత స్థానం లేకపోవడం ఆ కవితలో చోటు చేసుకున్నాయి.

‘On the pulse of morning’ కవిత Rock, River, Tree, పేరు లేని వక్త – ఈ నాలుగింటినీ ప్రధాన భూమికగా తీసుకొని రాసిన కవిత. ఇందులో కవి తక్కువగా కనిపిస్తారు. మానవత్వం, మానుష విలువలు ఎన్నిపొరలతో కప్పబడి ఉన్నా రేపటి భవిష్యత్తు కోసం సమానత్వం కోసం పోరాడాల్సిందేనన్నది కవిత సారాంశం.

ఇక, ప్రెసిడెంట్ first inaugural లో కవితాగానం చేసిన మొట్టమొదటి కవి Robert Frost.1961 లో John F. Kennedy- first inaugural లో ‘The Gift Outright’ అన్న 16 వరుసల కవితను చదివారు. అమెరికాలో వలసవాదపు మూలాలు, చరిత్రతో పాటు అక్కడ స్థిరపడిన వారి అభివృద్ధి, అమెరికా భూభాగం పైన వారు కురిపించే ప్రేమ, విశ్వాసం, అంకితభావం ఇవన్నీ కలగలిసి ఈ నాటికీ గొప్ప దేశభక్తి గీతంగా నిలిచిపోయింది. Robert Frost ఈ ప్రత్యేక సందర్భంకై రాసి చదివిన కవిత అది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here