స్వాధ్యాయ సాహితీ పురస్కారం

0
14

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కవి, విమర్శకుడు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య స్థాపించిన స్వాధ్యాయ పరిశోధన, విద్యాసంస్థ ప్రతి సంవత్సరం సాహిత్య రంగంలో దీర్ఘకాలం ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ, నాణ్యమైన రచనలు చేసిన సాహితీకారుడికి స్వాధ్యాయ సాహితీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా మార్చి నెల 22, ఆదివారం రోజున హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని నారపల్లిలో నెలకొని ఉన్న స్వాధ్యాయ పరిశోధన, విద్యాసంస్థలో తొలి పురస్కారాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మినారాయణ గారికి ప్రదానం చేయాలని నిశ్చయించింది.

స్వాధ్యాయ సాహితీవేత్త పురస్కారం కింద పదివేల రూపాయల నగదు, జ్ఞాపికను ఇచ్చి సత్కరించాలని నిశ్చయించింది. మార్చి 22 ఉదయం 10 గంటలకు ప్రఖ్యాత సాహితీవేత్త శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారి అధ్యక్షతన సభ జరుగుతుంది.

ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ విరమణ చేసిన శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ విమర్శ, తులనాత్మక సాహిత్య అధ్యయనం, అనువాద సాహిత్య రంగాల్లో చేసిన కృషిని పురస్కరించుకొని ఈ అవార్డును అందిస్తున్నట్లు స్వాధ్యాయ అవార్డు కమిటీ పక్షాన.. సంస్థ వ్యవస్థాపకులు కోవెల సుప్రసన్నాచార్య తెలిపారు.

పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, నమస్తే తెలంగాణ సంపాదకులు శ్రీ తిగుళ్ల కృష్ణమూర్తి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్లు శ్రీకట్టా శేఖర్ రెడ్డి, శ్రీ బుద్దామురళి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ ఏనుగు నర్సింహారెడ్డి, ప్రముఖ కవి విమర్శకులు పాల్గొంటారు.

సాహితీప్రియులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి, అవార్డు గ్రహీతను అభినందించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.

అధ్యక్షుడు
కోవెల సంతోష్ కుమార్

ప్రధాన కార్యదర్శి
కస్తూరి మురళీకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here