యువభారతి వారి ‘స్వామి వివేకానంద కవితా వైభవం’ – పరిచయం

0
15

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

స్వామి వివేకానంద కవితా వైభవం

[dropcap]నే[/dropcap]ను భగవంతుణ్ణి చూశాను అని ప్రకటించిన అవతార పురుషుడు రామకృష్ణ పరమహంస. అతడిలో భగవంతుణ్ణి దర్శించిన మహాపురుషుడు వివేకానందుడు. అతడొక జీవన్ముక్తుడు – ఇతడొక జిజ్ఞాసువు. అతడొక జాగృత దివ్య చైతన్యం – ఇతడొక సుప్త చైతన్యం. ఈ గురుశిష్యుల కలయిక రెండు తేజః పుంజములు సన్నిహితమైన మహత్తర సన్నివేశం.

భారతీయ పునరుజ్జీవనానికి ప్రతీక వివేకానందస్వామి దివ్యవాణి. దాస్య తమస్సుల్లో చిక్కుకుని, దారిద్ర్యంతో, అనైక్యభావంతో, మూఢవిశ్వాసాలతో సతమతమౌతూ స్వీయప్రతిభను కోల్పోయిన భారతీయులకు వివేకానందుడు ఆత్మవిశ్వాస జ్యోతిస్సులను అందించాడు. దైవంపై విశ్వాసం లేనివాళ్ళ కంటే, ఆత్మవిశ్వాసం లేనివాళ్ళు మానవాళికి ఎంతో నష్టం కలిగిస్తారని ఆయన నమ్మాడు. భారతీయుల తత్త్వ జిజ్ఞాసను ఖండాంతరాలలో వెదజల్లి, ఈ వేదభూమికి గొప్ప ఆదర గౌరవాలను సంపాదించి పెట్టాడు. నిరీహుడై, నిస్సంగుడై, భారతీయుల్లో ఆత్మా విశ్వాసాన్నీ, సేవానురక్తినీ, దేశభక్తినీ, ధర్మాభిరతిని కలిగించడానికి తపస్సు చేసిన మహనీయుడు ఆయన. స్వామీ వివేకానందుడు సంస్కృత, వంగ (బెంగాలీ) ఆంగ్లభాషా నిష్ణాతుడు. ఈ మూడు భాషల్లో ఆయన కవితా సృష్టి చేసినాడు. ఆయన గీర్వాణ వాణి అతి గంభీరం, ధ్వనిమంతం. మనోహరమైన శబ్ద సంయోజనకూ, సముదాత్త భావ సంపదకూ, అమోఘ సందేశాత్మకతకూ ఆయన కవిత కాణాచి.

రామకృష్ణ పరమహంస భారతీయ ధర్మరథానికి ఎత్తిన విజయ పతాక – స్వామి వివేకానంద..!

శ్రీ ఓగేటి అచ్యుతరామశాస్త్రిగారు సంస్కృతాంధ్ర ఇంగ్లీషు భాషల్లో చక్కని అభినివేశాన్ని సంపాదించిన వాగ్మివతంసులు. ఆయన వృత్తి అధ్యాపనం. ప్రవృత్తి ధార్మికం.. ఆయన వివేకానందుని సంస్కృత కవితలు కొన్నింటిని తెలుగు వ్యాఖ్య వ్రాసి మాకు ప్రచురణ కోసం అందించారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/page/n6/mode/1up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here