స్వేచ్ఛ

1
9

[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఆర్. శ్రీజు వ్రాసిన కథ ” స్వేచ్ఛ“. చదువులోనూ, లోకజ్ఞానం విషయంలోనూ పిల్లలకు తగినంత స్వేచ్ఛనివ్వాలని చెప్పే కథ ఇది.  బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]రా[/dropcap]మాపురం అనే గ్రామంలో అనే బాలుడి కుటుంబం ఉండేది. రాము వాళ్ళ నాన్న పేరు కనకయ్య, అమ్మ పేరు సుబ్బమ్మ. ‘మా ఊరందరిలో తెలివైనవాడిని నేనే’ అని రాము గర్వంతో ఉండేవాడు. రామాపురం మొత్తానికి ఒకటే పాఠశాల. పాఠశాల పేరు గురుకులం. కనకయ్య గురుకులంలో ఉపాధ్యాయుడుగా పని చేస్తాడు. వాళ్ళకి పెళ్ళైన పది సంవత్సరాలకి రాము పుట్టాడు. అందుకే రాముని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

ఇప్పుడు రాము వయస్సు 10 సంవత్సరాలు. చిన్నప్పటి నుండి రాము ఏ పని చేయాలన్నా వాళ్ళ నాన్న సహాయంతోనే చేసేవాడు. పాఠశాలలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నా కనకయ్య రాముకి ముందే చెప్పి తననే గెలిపించేవాడు. ఇలా ప్రతి దాంట్లో రాముకి కనకయ్య సహాయం చేయడంతో రాముకి దేనిపైనా అవగాహన ఉండేది కాదు. రాముని బయటకి కూడా పంపించేవాడు కాదు కనకయ్య. ఇలా రాము 10వ తరగతి అయిపోయింది.

కనకయ్య రాముని మంచి చదువుల కోసం దూరంగా పంపించాడు. రాము పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కనకయ్య. రామూ మొదటిసారిగా దూరంగా ఇంటి నుండి బయటకి వెళ్ళడంతో ఎంతో సంతోషంగా వెళ్ళాడు. కానీ అక్కడకి వెళ్ళగానే అందర్ని చూసి రాము భయపడ్డాడు. అక్కడ రాముకి ఎంతో కొత్తగా ఉన్నది. రాముకి అక్కడ ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏమైనా కార్యక్రమాలు జరిగినా రాముకి కనీసం ఏమి చేయాలో కూడా అర్థమైయ్యేది కాదు. అప్పుడు రామూ లోపల లోపల ఎంతో కుమిలిపోయేవాడు. ఈ విషయం రాము వాళ్ళ నాన్నకి చెప్పాడు.

అప్పుడు కనకయ్య చాలా బాధపడ్డాడు. ఇంకా ఇలా అనుకున్నాడు – ‘నేను వాడ్ని స్వేచ్ఛగా వదిలేసుంటే, నేను వాడికి నచ్చినట్టు వాడిని చేయమనుంటే ఇలా జరిగేదా?’ అని.  అప్పటినుండి కనకయ్య ఒకటే అనుకున్నాడు – ‘పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనివ్వాలి’ – అని.

  • ఆర్. శ్రీజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here