TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ

0
10

విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం

రాబోయే సంక్రాంతి (2019) సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటోలో నెలకొనివున్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ నిర్వహిస్తుంది. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగువారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం. మూడువేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తికి 2003వ సంవత్సరం నుండి శాక్రమెంటోలో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరప్ మరియూ ఇతర విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత తెలుగు రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28.

ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28.

మొట్టమొదటి రచనా విభాగం

కథలూ కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణంచేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలను ఈ తెలుగు రచనా విభాగం “పోటీ”లో పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28

ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28

అన్ని పోటీలకు ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కో పోటీలో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 5 అంగుళాలు x 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్‌సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతోబాటు విధిగా జత పరచాలి. ‘మొట్టమొదటి కథానిక’, ‘మొట్టమొదటి కవిత’ పోటీలో పాల్గొనేవారు తమ రచనలు మొట్టమొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొనగలరు: https://tinyurl.com/tagsform పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.
  • రచనల్లో ఎక్కడా మీ పేరు కాని, మీ కలంపేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రంలో ఆ వివరాలు రాస్తే సరిపోతుంది.
  • మీ రచనలను తెలుగులో టైపు చేసి పంపితే బాగుంటుంది. యూనికోడ్ (Unicode)లో ఉన్న మీ రచనలు పంపితే మాకు శ్రమ తగ్గించినవారు అవుతారు అని గమనించగలరు. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువశక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది, సుజనరంజని, శాక్రమెంటో స్థానిక పత్రిక సిరిమల్లె, మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలునిబట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2019 పండుగకు ముందు ప్రకటించబడతాయి. కాపీరైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు, ఇంకెక్కడా ప్రచురించకూడదు.
  • కాలిఫొర్నియాలో శాక్రమెంటో నగరంలో, జనవరి 19, 2019న జరగబోయే TAGS 15వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభాముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి. రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం.
  • పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018.

మీ రచనలు మా ఈ-మెయిలు http://telugusac@yahoo.com కు PDF, JPEG లేదా Unicodeలో పంపండి. Unicodeలో పంపితే మరీ మంచిది.

భవదీయులు,

శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

నాగ్ దొండపాటి (అధ్యక్షులు)

అనిల్ మండవ (చైర్మన్)

దుర్గ చింతల (కార్యదర్శి)

మల్లిక్ సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్)

మోహన్ కాట్రగడ్డ (కోశాధికారి)

వెంకట్ నాగం (సంపాదకులు, ట్రస్టీ)

రాఘవ చివుకుల (సమాచార అధికారి)

సత్యవీర్ సురభి (సలహామండలి సభ్యుడు)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here