తల్లివి నీవే తండ్రివి నీవే!-16

0
9

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

స్థిరాంకంలో చివరి అంకె

పూర్ణ శక్తిః పూర్ణ గుణో నిర్దిష్ట సకలేశ్వరః।
నిర్గుణో నిష్కలానంత సచ్చితానంద విగ్రహః॥

సంపూర్ణమైన శక్తి గలిగిన వాడు, సమస్త గుణములు కలవాడు, దోషరహితుడు, సమస్త లోకాలకు అధిపతి, గుణరహితుడు, నిమేషాది శూన్యుడు, పరిమితి లేనివాడు, సచ్చితానంద స్వరూపుడు అయిన శ్రీమహావిష్ణువుకు నమస్కారము.

We are apt to think of the universe as something apart from God, as a product that has nothing to do with divinity. But the Thousand Names (శ్రీవిష్ణు సహస్రనామం) reminds us from the outset that the Lord is the universe.

భగవానుడే ఈ విశ్వము. ఆయన అన్నిటిలో ప్రవేశించాడు. అన్నిటియందు నిలిచి ఉన్నాడు.

He has entered into all things. At the core of creation, in the heart of every creature, is the Lord, the very basis of existence. అందరి హృదయాలలో ఆయనే.

In this sense the world is not so much the creation of the Lord as an emanation from him. The Upanishads, India’s most ancient scriptures, say that just as a spider spins a web out of itself, so the Lord has spun this entire universe out of his own being.

Imagine a spider sitting in the middle of her web. She doesn’t go away once she has made it, that is her home.

కానీ ఆ ఇల్లు ఎక్కడ ఉన్నది?

This is the analogy the Hindu mystics and saints use, only they take it one step further. At the end of time, they say, the Lord will draw the web of the universe completely back into himself. Christian mystics use similar language: we come from him, we rest in him, and to him we shall return.

Because we have come from the Lord, all we have to do to see him is to look within ourselves and discover who we really are. This is the ancient cry of Socrates-Gnothi seauton, “Know thyself” – and in spite of the progress of searion, liation, it is a cry we still need to hear.

ఇక్కడ ఆంగ్లంలో ఇచ్చినది ఏక్నాథ్ ఈశ్వరన్ శ్రీవిష్ణు సహస్రనామం గురించి ప్రస్తావిస్తూ అన్న మాటలు. ప్రపంచంలో ఏ మూల ఏదేశంలో, ప్రాంతంలో, సంస్కృతిలో చూసినా ఒక శక్తి ఉందని, అదే సృష్టి చేస్తుందని (సనాతనంలోనే భగవచ్ఛక్తి నుంచీ సృష్టి ఉద్భవించిందని ఉన్నది. మిగిలిన చోట్ల సృష్టి కూడా సృష్టింపబడినదే), అదే అన్నిటినీ నడుపుతుందని, చివరికి రాత్రవగానే పక్షులన్నీ వాటి గూళ్ళు చేరినట్లుగానే, సృష్టి కూడా సృష్టి జరగటానికి కారణమైన ఆ శక్తిలోనే లీనమైపోతుందని నమ్మటమో, చెప్పటమో ఉంటుంది.

ఎందుకంటే దేశకాలమాన పరిస్థితులకతీతంగా జీవులన్నీ ఒకటే. వాటి అవస్తలు (కష్టాలు కాదు), వాసనోపాధులు ఒకటే.

కృష్ణాయ వాసుదేవాయ
దేవకీనందనాయ చ।
నందగోపకుమారాయ
గోవిందాయ నమో నమః॥
కృష్ణాయ యాదవేంద్రాయ
జ్ఞానముద్రాయ యోగినే।
నాధాయ రుక్మిణీశాయ
నమో వేదాంతవేదినే॥
కృష్ణాయ వాసుదేవాయ
హరయే పరమాత్మనే।
ప్రణతః క్లేశనాశాయ
గోవిందాయ నమో నమః॥

ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, కనపడని కాలబిలాలు, చీకటి పదార్థాలు మొదలయిన వన్నిటి సమూహాలను, సముదాయాలను విశ్వం లేదా యూనివర్స్ అంటున్నాం. విశ్వం లోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. స్థలకాలాదులు, అన్ని రకాల రూపాలు తీసుకున్న పదార్థం.. బలం, గతి, భౌతిక నియమాలు, స్థిరాంకాలు (Physical Constants) వీటిని నియంత్రిస్తూ వుంటాయి.

ఏవిటా స్థిరాంకాలు? అవి ఎందుకు అలాగే ఉన్నాయి? వాటిలో అన్నిటికన్నా చిన్న స్థిరాంకం ఏది? అన్నిటికన్నా పెద్ద స్థిరాంకం ఏది? ఆ స్థిరాంకాల విలువలు సంపూర్తిగా అంతు చిక్కిన వారు ఉన్నారా?

We always talk about taking the values on approximations. The approximate values may be highly nearer to the original and authentic value but they’re not absolute. Either you take Planck’s constant whose value is h = 6.62607015×10−34 JHz−1 or Avogadro number whose value is 6.02214076×1023 mol-1 (one of the smallest and one of the biggest physical constants), we always talk about some sort of approximation. Some claim they might be absolute values. But they are not.

It may be

99.999999999999999999999999999999999999999999999999999999999999999999..

but it was never 100%, it is never 100%, and will never be 100%.

అందుకే అనేది అర్థ సంపూర్ణం అని. మనకు తెలిసింది, తెలుస్తున్నది, తెలియబోయేది అర్థమే. మరి ఆ అర్థము సంపూర్ణ మయేది ఎప్పుడు? గురువు వలన. ఆ గురువు ఎలాంటి వారు అయి ఉండాలి? విశ్వ శక్తిని సంపూర్ణ అవగాహన చేసుకున్న వారైనా కావాలి. లేదా ఆ ప్రయత్నంలో నిమగ్నమైన వారు అయినా కావాలి. అలాంటి గురువు వల్ల మనకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?

ఈ విశ్వ శక్తిని మరియొక కోణంలో తెలుసుకునేందుకు మనకు దారి చూపుతారు. తద్వారా మన అవగాహనే ఎల్లప్పుడూ అసంపూర్ణం అని మనకు తెలిసి వచ్చేలా చేస్తారు. దానివల్ల ప్రయోజనం మనం అహంకార మమకారాలకు లోను కాకుండా, ద్వైత స్థితికి దూరంగా అద్వైత స్తితికి దగ్గరగా ఉంటాము. మకి ఇంతకీ భగవంతుడేమి చేస్తుంటాడు?

ఈ స్థిరాంకాలలో ఉన్న చివరి అంకె ఆయనే. ఉదాహరణకు 10/3 = 3.33333..

ఆ చివరి అంకెని చేరటమే మోక్షం.

అప్పటిదాకా తర్వాతి అంకె కోసం వెతుకులాటలో ఉంటాడు జీవుడు. ఎప్పుడైతే ఆ చివరి అంకెను చేరతాడో ఇక ఆ ప్రయాణం అక్కడితో ముగుస్తుంది.

వివిధ సందర్భాలకు, భౌతిక శాస్త్ర విషయాలకు విశేషాలకు వివిధ స్థిరాంకాలు ఉన్నట్లే, భగవంతుని చేరటానికి, తెలుసుకోవటానికి వివిధ మార్గాలు. అన్నిటిలోను ఒకటే సమస్య.

EVERYTHING IS AN APPROXIMATION. మనం చేయవలసిందల్లా ఆ యా స్థిరాంకాలలో ఏదో ఒకదానిని ఎంచుకుని వాటిలో ఆ తరువాత అంకె కోసం వెతుకుతూ పోవటమే.

ఈ మార్గాలన్నిటినీ మొట్టమొదటగా అర్థం చేసుకున్న జీవుడే మనం చెప్పుకునే చతుర్ముఖ బ్రహ్మ. అంత తెలిసినాయన కూడా నాకు ఏమీ తెలియదు అని చెప్పాడు. అప్పుడు పరమాత్మే స్వయంగా వచ్చి ఆయనకు చతుఃశ్లోకీ భాగవతం ఉపదేశించాడు.

ఇక్కడో చిన్న పొరబాటు చేశాడీ జీవుడు. అదేంటేంటో తరువాత చూద్దాము.

ఇప్పుడు పరాశర భట్టరు గారు అన్న విధంగా..

పరమాత్మ కనుక జగత్తులో ప్రవేశించాడు. అందువల్లే అది విశ్వమైనది. అది విశ్వం కాబట్టే పరమాత్మ ప్రతిరూపం అయినది. జగత్తే పరమాత్మ. పరమాత్మే జగత్తు. అదే విశ్వం. శక్త్యమృత బీజాలతో ఆరంభమవుతుంది. మనమనుకునే ప్రపంచం, ప్రకృతి అనేవి కూడా ఆ విశ్వశక్తిలో అంతర్భాగాలే.

సగుణ బ్రహ్మ, ప్రధానంగా సౌలభ్యం మార్గంగా ఎంచుకుని వ్యాఖ్యానం వ్రాసిన మన భట్టరు గారు విశ్వం ఏమి చేస్తుందనే ప్రశ్నకు వ్యాపిస్తుందని తెలిపారు. ఆ వ్యాపన కూడా మనకు తెలిసే లాగనే జరుగుతుందని చెప్పారు. ఆ వ్యాపించటమనేదే విష్ణుః.

ఆ వ్యాపించటం ఎన్ని రకాలుగా జరుగుతుంది? అనంతం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here