తల్లివి నీవే తండ్రివి నీవే!-42

2
11

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

అప్రమేయం హృషీకేశం-1

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖామ్బురుహమ్।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే॥
(శ్రీవేఙ్కటేశ్వర స్తోత్రం 6, 7)

46.అప్రమేయః

ప్రమాతుం శక్యం ప్రమేయం। న ప్రమేయం అప్రమేయం సః। ప్రమాయ ఈద్యతి ప్రమీయ సార్వధాతుకార్థథాతుకయోః గుణ ప్రమేయ॥

  • ఏ విషయంలోనూ ఇలాంటి వాడొకడున్నాడని చెప్పశక్యం కానివాడు.
  • శబ్దాదులు లేనివాడు. కనుక ప్రత్యక్ష ప్రమాణాలకు అందడు.

ఇంతకు మునుపు ।ధాతురుత్। ను గురించి తెలుసుకునే సందర్భంలో..

ధాతుభిః తదుపలక్షితశబ్దైః రువతే॥ – శబ్ద్యతే ఇతి ధాతురుత్, అతిశయేన ధాతురుత్ ధాతురుత్తమః

ధాతువులచే, క్రియాపదములచే ఉపలక్షితమైన శబ్దములచే పిలువబడువాడు దాతురుత్. ధాతురుత్లలో అత్యున్నతుడు కనుక ధాతురుత్తమః. అందుకే గొప్ప శబ్దస్వరూపుడు.

అని తెలుసుకున్నాం.

ఎంత గొప్ప శబ్ద స్వరూపుడు అంటే మన ఊహలకు అందనంత. మహర్షులు కూడా సంపూర్ణంగా ఆయన గురించి తెలుసుకొనలేక ఒక్కొక్కరు వారు తెలుసుకొనగలిగినంత వరకే నామ రూపములలో ఆ భగవచ్ఛక్తిని వర్ణించారు. బ్రహ్మ గారికి కూడా పూర్తి స్థాయిలో తెలియదనే నిరూపించబడినది.

The root particle, its surroundings, in it, outside of it, and beyond.

Once again ఆణ్డాళ్ తెలిపిన పెరియాయ్!

Cosmic Microwave Background Radiation (CMBR):

This is the afterglow of the Big Bang. It’s a faint radiation that fills the universe and is considered a significant piece of evidence supporting the Big Bang theory. While it’s not sound (శబ్దము/ధ్వని) in the traditional sense, scientists have converted the patterns in this radiation into sound-like representations. This allows us to “hear” the early universe’s remnants.

బిగ్ బ్యాంగ్ తదనంతర పరిణామాలలో..

Imagine the universe as a giant oven. Billions of years ago, it was incredibly hot and dense – like a superheated fireball. This fireball started expanding and cooling down, just like a cake taken out of the oven.

The Cosmic Microwave Background Radiation (CMBR) is like the leftover warmth from that giant oven. It’s a faint glow of energy that fills the entire universe. It’s kind of like the echo of the Big Bang, the event that started it all.

Cosmic Microwave Background Radiation (CMB) is like a snapshot of the early universe. Imagine going back in time to when the universe was just a baby – only 380,000 years old!

3,80,000 సంవత్సరాల వయసున్న విశ్వాన్ని శాస్త్రవేత్తలు బేబీ అంటున్నారు. మరి ఈ అనంత కాల పరిణామాలతో పోలిస్తే మన జ్ఞానం ఎంత?

At that moment, everything was super hot and dense. But as the universe expanded, it cooled down.

Now, fast-forward to today. The CMB is like a faint glow that fills the entire universe. It’s made up of microwave radiation. This radiation carries information about the universe’s past, revealing its initial conditions and how it evolved.

It provides strong evidence for the Big Bang theory.

It helps scientists understand the composition and structure of the universe.

It reveals details about the early universe, including its temperature and density variations.

It’s important to note that the CMBR is not visible to the naked eye. It’s a form of radiation that can only be detected with specialized instruments.

ఈ రేడియేషన్ మన సాధారణ నేత్రాలకు కనపడదు. అది ఉంది అని తెలుసుకునేందుకు చాలా కాలం పట్టింది. అలా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలను వాడాలి. ఒక రేడియేషన్ అవశేషాని కోసమే ఇన్ని పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తుంటే ఇక ఆ అప్రమేయుడైన భగవంతుడు ఉన్నాడని మనం తెలుసుకునేందుకు ఇంకెంత శ్రమించాలి?

However, its existence and properties are a testament to the incredible story of our universe’s birth and evolution.

Scientists study the CMB to learn about the Big Bang, dark matter, and the overall structure of the cosmos. So, in a nutshell, the CMB is our cosmic time capsule, helping us understand where we came from!

అలాగే ఆ అప్రమేయుడి గురించి మహర్షులు వారి వారి స్థాయిలను బట్టీ తపస్సు ద్వారా తెలుసుకోగలిగారు. ఈ Cosmic Microwave Background Radiation ఎలా మనకు విశ్వావిర్భావానంతరం 3 లక్షల 80 వేల సంవత్సరాల కాలం నాటి సమాచారాన్ని అందిస్తుందో అలాగే మహర్షులు కూడా వారి వారి తపశక్తితో ఈ విశ్వశక్తి యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అవగతమైనంత వరకూ వివరాలను మనకు అందించారు.

పరతత్వ విషయంలో ఒక ప్రత్యక్ష ప్రమాణానికి లొంగే శబ్దం లేదు. అందుకే ఇన్ని ప్రయత్నాలు.

పరమాత్మ గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఏ శాస్త్రవాక్యమూ ప్రమాణమై ఆ తత్వానికి అంతకు ముందు లేని అతిశయాన్ని కల్పించలేదు.

ఎందుకంటే ఆయనే అన్నిటికీ ప్రమాణం.

అందుకే శ్రీమహావిష్ణువు శాస్త్రప్రమాణవేద్యుడు కూడా కాదు.

ఈ విశ్వం గురించి శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రతి సిద్దాంతానికీ కొన్ని ప్రమాణాలు దొరుకుతాయి.

On one hand we have proofs and clues for the standardisation of or causes for agreeing with the Big Bang Theory. On the other side, we have enough information to support the Steady State theory. కానీ కాలక్రమంలో ఈ Big Bang సిద్ధాంతమే నిలదొక్కుకుంది. కానీ అదే పరమ ప్రామాణికం కాదు. అయినా మన శక్తి కొద్దీ అటు ఆ Steady State సిద్ధాంతాన్ని, ఇటు ఈ Big Bang సిద్ధాంతాన్ని తెలుసుకొనక తప్పదు. వేటి ప్రమాణాలు వాటికి ఉన్నాయి.

అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ ఆ పరమాత్మ మార్గాన్ని మనకు దగ్గర చేసేందుకు ఉన్న ఆయుధాలు. ఏ ఆయుధం గొప్పదంటే ఏమంటాము? అందుకే శాస్త్రమైనా, సైన్స్ అయినా ఉన్న సిద్ధాంతాలను వాటి లోపాలతో సహా తెలుసుకుని, వాటిని అంగీకరించి మన ప్రయాణం మనం చేయక తప్పదు.

కాకపోతే సైన్స్ విషయంలో లాగా కాకుండా ఈ శాస్త్ర విషయాలలో భగవంతుడిచ్చిన కొన్ని హామీలు ఉన్నాయి.

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ।

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥

అంటే ఆ విశ్వశక్తితో మనం మమేకమైతే సిద్ధాంతాలతో పని లేకుండా మనకు లభించాల్సిన ఫలితం లభిస్తుంది. కాకపోతే కాస్త ముందు వెనుకలుగా. ఆ ముందు వెనుకలు లేకుండా త్వరగా తెమలాలంటే..

Stephen Hawking ‘on the shoulders of giants’ అన్నట్లు మనకు లభించే శాస్త్ర ప్రమాణాలను అన్వేషించాలి.

శరణాగతి చేసిన వారికి మోక్షం త్వరగా లభిస్తుంది. కానీ అంతగా

నీవు తప్పనితః పరంబెరుగ అని మనం అనలేము కదా. అలా అనగలిగే స్థితికి తీసుకుని వెళ్ళేవే ఈ శాస్త్రాలు, సిద్ధాంతాలు, అన్వేషణలు. అందుకే వీటి ఆవశ్యకత మనకు ఉంది. తీసిపారవేయ కూడదు.

యద్వేయం శాస్త్రయోనిత్వం కధం॥ అని శంకరాచార్యులు ప్రశ్నించుకుని స్వయం ప్రకాశకుడైన పరమాత్మ ప్రమాణాలను అనుసరించి తెలియబడేవాడు కాకపోయినా, సర్వ ప్రమాణాలకు ఆయనే సాక్షి కనుక పరమాత్మయందారోపింపబడిన ఆయన కాని వాటిని (అంటే.. limitations in a theory) ఈ శాస్త్ర ప్రమాణాలు నివృత్తి చేస్తాయి కనుక శాస్త్రయోనిత్వాన్ని అంగీకరించవచ్చు అని నిర్ధారించారు.

ఇంద్రియ సంబంధమైన ప్రత్యక్షాది ప్రమాణాలకు భగవానుడు అందడు. అక్కడే అపరోక్షానుభూతి వచ్చింది. శాస్త్రమును అధ్యయనము చేయుటకు మనను పూనింపజేసేది మనస్సే కనుక

।యన్మనసా నమనుతే। – మనస్సు భగవంతుని తెలుసుకొనలేదు అని కేనోపనిషత్ తెలియజేసింది. కనుక శాస్త్రాలు కూడా భగవానుని గురించి తెలుసుకొనలేవు. ఎంత వేదాలు అపౌరుషేయాలు అయినా ఆ పురుషోత్తముని గురించి పూర్తిగా తెలుసుకొనుటకు సహకరించలేవు. అందుకే ఆ శ్రీమన్నారాయణుడి గురించి వేదములలో లేదు.

వేదాలలో ఇంద్ర వరుణాదుల గురించే తప్ప విష్ణువు గురించి లేదని, శివ కేశవుల మహాత్మ్యాలు మద్యలో చేరినవి అనటం తప్పు. ఆ వేదాలు కూడా ఆ శ్రీహరి గురించి తెలుపలేవు. He is beyond all these things. అప్రమేయుడు. అనాదినిధనుడు.

బ్రహ్మ సూత్రాల ప్రకారం

శాస్త్రయోనిత్వాత్॥

తత్తుసమన్వయాత్॥

ఆ పరబ్రహ్మము గురిమచి శాస్త్రములు ఎఱుకపరచలేకపోయినను శాస్త్రాధ్యయనము మనసులోని మాలిన్యములను (దారిలో వచ్చే సమస్యలను పరిష్కరించుటకు సహకరించి) తొలగించి శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధబుద్ధికి అవసరమైన మార్గము అందుతుంది.

అందుకే

॥బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి॥ – బ్రహ్మమును గూర్చి తెలియగోరువాడు బ్రహ్మమే కాగలడు

అని ముండకోపనిషత్ చెప్పింది.

ఆధునికులు కూడా అదే చెప్తారు కదా..

You are your thoughts. You become your thoughts.

భగవానుడు అప్రమేయుడు కావటం చేత ఇంద్రియములు ఆయనను చేరలేవు. పైగా ఆయనే ఈ ఇంద్రియములను వశపరచుకుని ఉన్నాడు.

ఈ విషయాన్ని హృషీకేశః అనే తరువాత వస్తున్న నామము స్పష్టపరుస్తున్నది.

ఇక పరాశర భట్టర్ ఇలా అంటారు..

యం నాయం భగవాన్ బ్రహ్మా జానాతి పురుషోత్తమమ్॥ – పురుషోత్తముని బ్రహ్మ దేవుడు కూడా ఎఱుగడు.

నహ్యాది మధ్యాన్త మజస్య యస్య విధ్మో వయం సర్వమయస్య ధాతోః। నచ స్వరూపం న పరప్రభావం నచైవసారం పరమేస్వరస్య॥ – ఆ శ్రీమన్నారాయణుని ఆది మధ్యాంతంబును, ప్రభావంబును, బలమును కూడా ఎఱుగము

అని సాక్షాత్ పితామహుడని పిలువబడే ఆ బ్రహ్మ గారి చేతయే తెలుపబడినది.

స న శక్యస్త్వయా ద్రష్టుమ్ మయాఽన్యైరాపి సత్తమ॥ – సంపూర్ణ జ్ఞానముతో తెలుసుకొనవలసిన వీనిని నీవో, నేనో, ఇతరులో చూడనశక్తులము అని బ్రహ్మ గారు శివునికి తెలిపెను.

సత్యసంధ తీర్థుల వారు ఈ నామము గురించి మరి కొంచెం లోతుగా ప్రస్తావించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here