తల్లివి నీవే తండ్రివి నీవే!-45

2
10

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

అనంత పద్మనాభమ్

పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం।

పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశం॥

ఇచ్ఛా రూపాం భగవతీం సచ్చిదానంద రూపిణీం।

సర్వఙ్ఞా సర్వజననీం విష్ణు వక్షస్థలాలయాం।

దయాళుమనిశం ధ్యాయేత్సుఖసిద్ధిస్వరూపిణీమ్॥

(ప్రాచుర్యంలో ఉన్న శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం నుంచీ)

  1. ఓమ్ పద్మాయై నమః
  2. ఓమ్ వ్యోమపద్మాయై నమః
  3. (ఓమ్ సావిత్ర్యై నమః)
  4. ఓమ్ కమలాసనాయై నమః
  5. (ఓమ్ కుముదిన్యై నమః)
  6. ఓమ్ పద్మగర్భాయై నమః
  7. ఓమ్ పద్మేస్థితాయై నమః
  8. ఓమ్ కమలోద్భవాయై నమః
  9. ఓమ్ పద్మ చిహ్నాయై నమః
  10. ఓమ్ కమలేక్షణాయై నమః
  11. ఓమ్ పద్మప్రియాయై నమః
  12. ఓమ్ పద్మనిలయాయై నమః
  13. ఓమ్ పద్మగన్ధిన్యై నమః
  14. ఓమ్ పద్మవర్ణాయై నమః
  15. ఓమ్ పద్మధరాయై నమః
  16. (ఓమ్ సర్వగన్ధిన్యై నమః)
  17. ఓమ్ పద్మమనసే నమః
  18. ఓమ్ పద్మబోధాయై నమః
  19. ఓమ్ పద్మిన్యై నమః
  20. (ఓమ్ గన్ధద్వారాయై నమః)
  21. (ఓమ్ దివ్యగన్ధాయై నమః)
  22. (ఓమ్ వైరోచిన్యై నమః)
  23. (ఓమ్ అర్కప్రభాయై నమః)
  24. ఓమ్ కమలార్చితాయై నమః
  25. ఓమ్ పుష్కరిణ్యై నమః
  26. ఓమ్ పద్మనేమ్యై నమః
  27. (ఓమ్ సూర్యాయై నమః)
  28. ఓమ్ కమలాయై నమః
  29. (ఓమ్ ఇన్దిరాయై నమః)

పాఞ్చరాత్ర శ్రీలక్ష్మీతన్త్రాన్తర్గత శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో ఉన్న లక్ష్మీదేవి దివ్య నామములు. దీనినే ప్రతినిత్యం శ్రీరంగములో అనుసందిస్తారు. అది కూడా పద్మ (లేదా ఆ పర్యాయపదాలు) సంబంధం ఉన్నవి. 20 నామములు ప్రత్యక్ష సంబంధం ఉన్నవి అయితే 9 నామములు పరోక్ష సంబంధం ఉన్నవి.

అసలు శ్రీమహావిష్ణువుకు పద్మ సంబంధం ఎందుకు అంత ప్రీతి?

లక్ష్మీదేవి సహస్ర నామములో 2% నామములు ఎందుకు పద్మ సంబంధముగా ఉన్నాయి?

An atom appears as a 3-dimensional lotus. పరమాణువు క్వాంటమ్ మెకానికల్ మోడల్ ప్రకారం మనం ఊహాచిత్రీకరణ చేస్తే అది ఒక పద్మం మాదిరి అగుపిస్తుంది. ఈ క్రింది బొమ్మ చూడండి.

విశ్వమే అణువు. బ్రహ్మాండం. ఏక బిందు రూపంలో ఉండి అక్కడి నుంచీ మహాద్భుతమైన రూపం దాలుస్తుంది.

విశ్వం అంతా ఒక పరమాణువు. పరమాణువులన్నీ విశ్వాంతర్భాగాలే. విశ్వంలో పరమాణువులు, పరమాణువులో విశ్వము. సూక్ష్మ విశ్వములు.

ఈ విధంగా చూస్తే విశ్వం పద్మం లాగా అగుపిస్తుంది. విశ్వంలో పదార్థం, దాని మార్గము. మరింత వివరంగా అర్థం కావాలంటే ఒక పరమాణువులో కేంద్రకం చుట్టూరా ఎలక్ట్రాన్లు వివిధ మార్గాల్లో తిరుగుతుంటాయి. వాటిని ఆర్బిట్లు (కక్ష్యలు), ఆర్బిటాల్‌లు అని పిలుస్తారు. ఆ మార్గాలను మనం ఊహాచిత్రణ చేయగలిగితే మొత్తం పరమాణువు ఒక పద్మంలాగా కనిపిస్తుంది.

ఈ విశ్వం ఒక పద్మం (ఇంకా వికసించని) అయితే, శక్తి వికసించటమే సృష్టి. విచ్చుకున్న తామరపూవు లాగా ఈ విశ్వం ఉంది. అనంత శక్తులు, అనంత భూతాలు ఈ పద్మపు రేకుల వంటివి. ఈ రేకులు కేంద్రంలో ఉన్న కర్ణికతో అనుబంధం కలిగి ఉంటాయి. Just like and unlike the atoms – where the electrons are associated with the nucleus. ఆ బంధం తెగితే రేకులు చెల్లాచెదురు అవుతాయి. న్యూక్లియస్ ప్రభావం లేకపోతే ఎలక్ట్రాన్ల సంగతి సరే! పరమాణువే నిలువజాలదు. అది ఎలాగో చూద్దాం.

Electrostatic attraction is the primary force that keeps electrons intact in an atom.

The nucleus, composed of protons and neutrons, has a positive charge due to the protons. Electrons have a negative charge as we all know. Opposite charges attract each other. This attraction between the positively charged nucleus and the negatively charged electrons holds the electrons in place.

The strength of this attraction depends on the distance between the electrons and the nucleus. Electrons closer to the nucleus are more tightly bound than those farther away. త్రికరణశుద్ధిగా పరమాత్మకు దగ్గరగా ఉండేవారికి పరమాత్మతో అనుబంధం దృఢంగా ఉంటుంది.

“The balance of kinetic and potential energy in an atom is what keeps its electrons from collapsing into the nucleus,” – Dan Dill, Department of Chemistry, Boston University.

ఇక్కడ మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. పరమాత్మతో మనం ఐక్యం కాకుండా అడ్డుకునేది మాయ. Both Kinetic energy and potential energy are physical quantities. When all accounts of the universe are closed, అంటే ప్రళయకాలంలో ఈ balance అనేది తప్పి, సర్వం లయమవుతుంది. వికసించిన పద్మం మరలా ముడుచుకుంటుంది. ముకుళిస్తుంది.

ఆ పైన చెప్పుకున్న కర్ణికయే నాభి. శ్రీమహావిష్ణువు నాభిద్వారా బైటకువచ్చిన పద్మము ఆ నారాయణుడి నాభితో అనుసంధానమై ఉంటుంది. ఆ పద్మంలో నుంచీనే బ్రహ్మగారు ఉద్భవిస్తారు. ఆ పైన సృష్టి జరుగుతుంది. విశ్వానికి ఉనికినిచ్చే కేంద్రక శక్తి పద్మనాభుడు. సూర్య కిరణాలు కూడా వేలాది రేకులవలె భావిస్తే వాటిని వెదజల్లే సూర్యతేజం నాభిస్థానం లాంటిది.

న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల మన కంటికి కనిపించే సూర్యుడు (సూర్యుడు ఒక నక్షత్రం. ఆ వేలాది సూర్యులకు అధిష్ఠాన దేవత లేదా ఆ తేజస్సులో ఉండే దేవత సూర్యభగవానుడు) మనగలుగుతున్నాడు. హైడ్రోజన్ అణువులు ఒకదానితో ఒకటి కలిసి హీలియమ్‌గా మారుతూ శక్తిని విడుదల చేస్తే ఆ శక్తి సూర్య కేంద్రకంగా నడుస్తుంది. ఇలా దర్శిస్తే అనంత సూర్యుల కాంతులు అనేక మహాపద్మాలై వాటి నుంచీ వెలువడుతున్న తేజము పద్మనాభుడి వల్ల సాధ్యం అవుతున్నది. విశ్వంలో ఇలా వికసించే ప్రతి శక్తికీ మూలాధారమైనవాడు పద్మనాభుడు.

నారాయణ సూక్తము, పురుష సూక్తము ఆధారంగా ఈ పద్మనాభ అన్న నామమును గురించి మరింత వివరముగా తెలుసుకొనవచ్చు. ఆ విశేషాలు పరిశీలిద్దాము.

అలాగే లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు యొక్క చైతన్యశక్తి అని చెప్పుకున్నాము కదా. దాని గురించి చూద్దాము. వీటిని పరిశీలనగా చూస్తే మనకు Ehrenfest Theorem ద్యోతకమవుతుంది. ఇంతకీ ఈ Ehrenfest Theorem ఏమి చెప్తుంది? తెలుసుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here