తల్లివి నీవే తండ్రివి నీవే!-50

0
13

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

అగ్రాహ్యమ్

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ
కాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ
శ్రీదేవుదుండేటి శేషాద్రి కొండ

సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ

వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

(కట్టెదుర వైకంఠము కాణాచైన కొండ – అన్నమయ్య)

సుందర చైతన్యానంద, వారు చేసిన వ్యాఖ్యనంలో ఇలా అన్నారు.

<<<సనాతనుడు, శాశ్వతుడు అయిన భగవానుడు స్థవిరోధ్రువః అని కీర్తింపబడినాడు. స్థవిరుడు అనగా పురాణపురుషుడు. ధ్రువుడు అనగా స్థిరమైనవాడు. స్థవిరోధ్రువః అనునది ఏకనామము. విశేషణాల విశిష్టము. స్థవిరుడు కనుక కాలాతీతుడు. ఆయనను ఆధారం చేసుకుని అనంతమైన మార్పులు జరుగుతూ ఉన్నా తాను మాత్రము పరిణామ రహితుడుగా ఉండి, ఏ మార్పులూ చెందక స్థిరుడై ధ్రువుడు అని కీర్తింపబడ్డాడు.

సనాతనుడు, శాశ్వతుడు అయిన భగవానునిచే సర్వమూ నడపబడుతున్నది. దేహేంద్రియ మనోబుద్ధులు ప్రవర్తించుచున్నవి. ఎవరి ప్రభావముచే ఇంద్రియములు నడుచుచున్నవో అట్టి ఇంద్రియములు తనను గ్రహించలేవు. దీని గురించి రాబోయే నామము ద్వారా మనకు మరింత తెలుస్తుంది.>>>

ఇది దాదాపు శంకర వ్యాఖ్యయే కానీ శంకరాచార్యులవారు రెంటిని కూడా విడిగానూ చూపారు. సుందర చైతన్యానంద కలిపి మాత్రమే తీసుకున్నారు.

ఇప్పుడు సత్యసంధ తీర్థుల వారి ద్వైత వ్యాఖ్యానం చూద్దాము.

వృద్ధః॥ – వృద్ధుడైనవాడు. ॥ప్రవయాః స్థవిరో వృద్ధః॥ అని అమరకోశములో ఉన్నది.

చుట్టూ ఉన్న అందరికన్నా ఎక్కువ కాలం నుంచీ ఉన్నవారిని వృద్ధ అని అంటారు. కేవలం వయసును బట్టీ వచ్చే వార్థక్యం కలవారు వృద్ధులు కారు. అలా సకల చరాచర, గోచరాగోచర సృష్టి, అది ఉన్న విశ్వము..

ఆ విశ్వానికి అంతర్బహిరంగా ఉన్న పరమాత్మ మాత్రమే వృద్ధః. అంటే వార్థక్యం మీద పడినవాడు అని కాదు. అందరికన్నా, అన్నిటికన్నా పూర్వం నుంచీ ఉన్నవాడు అని. ఆద్యంతములు లేనివాడు. ఆది, అంతము ఉన్న మర్త్యులు కొంత కాలము మాత్రమే ఉనికిలో ఉంటారు. కానీ ఆద్యంతములు లేని భగవంతుడు అనాదిగా, శాశ్వతముగా ఏ మార్పు కూడా లేకుండా అలాగే ఉంటాడు.

ఇక శంకర వ్యాఖ్య చూద్దాము.

పురాణః స్థవిరః॥ – పురాణపురుషుడు. ప్రాచీనుడు. స్థిరంగా ఉండేవాడు.

త్వేకం హ్యస్య స్థవిరస్య నామ॥ ఇతి బహ్వృచాః – ప్రాచీనుడు. స్థిరంగా ఉండేవాడు.

వయోవచనో వా స్థిరత్వాద్ ధ్రువః॥ – వయస్సులో అందరికంటే ప్రాచీనుడు. స్థిరంగా ఉంటాడు కనుక ధ్రువుడు.

పరాశర భట్టరు వ్యాఖ్య ఇలా ఉన్నది.

ఏవం సకలమూలకారణత్వేఽపి లౌకిక మృదాది-కారణ-వైలక్షణ్యం వివక్షతి – స్థవిరః॥ – సంకల్పమూలంగా సమస్థమునకూ కారణమగుచున్ననూ (మనుః) ఆ కారణాలకు విలక్షణంగా ఉండేవాడు స్థవిరః.

అన్ని కాలములలోనూ ఉండు వాడు. అన్ని కాలాలకూ అతీతమైనవాడు.

He is time independent.

క్వాంటమ్ మెకానిక్స్‌లో మనకు time independent equations కనిపిస్తుంటాయి. అత్యంత ప్రఖ్యాతమైనది ష్రాడింగర్ సమీకరణము (Schrödinger’s Time Independent Equation).

Time-independent equations are used in many areas of physics and engineering to understand things like:

భౌతికశాస్త్రంలో, ఇంజనియరింగ్‌లో time independent equations మనకు తారసపడుతుంటాయి. వాటి సహాయంతో మనం ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఎలా అమరి ఉంటాయి అని చూడగలము.

అణువుల్లో శక్తి ఎలా ఉంటుంది, ఏ విధంగా అమరి ఉంటుంది అని చూడవచ్చు.

Standing waves in various systems: Like the vibrations of a drumhead or the oscillations of a bridge.

ఒక బ్రిజ్‌లో (స్థిర) కంపనాలు ఏ విధంగా ఉంటాయో గమనించవచ్చు.

ఒక భౌతిక వ్యవస్థ స్థిరత్వంగా ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవటానికి మనకు ఈ టైమ్ ఇండిపెండెంట్ సమీకరణాలు అక్కరకు వస్తాయి.

నిజానికి స్థిర వ్యవస్థలు ఉండవు. అన్నీ అస్థిరంగానే ఉంటాయి. అయినా అవి స్థిరంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది పరిశీలించి ఊహిస్తారు. తద్వారా ఆ యా వ్యవస్థల లక్షణాలు, అవి ఎలా నడుస్తాయో మనకు అంచనా వస్తుంది.

కాలాతీతుడైన భగవానుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలీ విశ్వసృష్టి ఎలా జరిగింది అనేది కాస్తయినా మన అంచనాలకు అందవచ్చు.

But most of the physical systems are approximations. Not the exact things to the last digit. So,

అదీ సంగతి.

God is time independent. Yet all current time independent equations cannot throw a complete picture of the origins of the universe.

సర్వం కాలం తిష్ఠతీతి॥ – సర్వ కాలాలలోను ఉండువాడు స్థవిరుడు. ముందే చెప్పుకున్నట్లు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోనే కాదు, ఆ యా కాలాలకు అతీతంగా ఉండేవాడు.

నిశ్చలస్వరూపుడు, నిశ్చయస్వరూపుడు కనుక ఆయన ధ్రువుడు. He is Dhruva because he is time independent. He is the ultimate Frame of Reference. Based on him, everything else is defined. But he cannot be defined by using anything else. He is the absolute. We can just approximate him. The nearer to the absolute value, the better the chances of salvation (Moksha).

కాలాతీతంగా జీవులకు ఎన్ని దేహాలు మారుతున్నా లోపలి చైతన్యం మాత్రం నిశ్చలత్వంతో ఉన్న ఆత్మయే. అది నారాయణ స్వరూపం.

కూటస్థం అచలం ధ్రువమ్॥

ఈ ధ్రువమే – నిశ్చలనిశ్చయమైన విష్ణు చైతన్య శక్తియే దేవతలకు మూలమని వేదాలు ఉద్ఘోషించాయి.

ఈ ధ్రవశక్తిని ఆధారం చేసుకునే ఈ విశ్వమూ, దేవతలు నిర్వహింపబడుతున్నారు. ఈ ధ్రవశక్తి సనాతనము. అందుకే అది అచలము. ఎప్పుడు మొదలైందో, ఎక్కడ మొదలైందో ఎవరి అంచనాలకూ, ఊహలకూ అందదు. అందుకే దీనిని పోల్చేందుకు ఏవీ మనకు అందవు. దేనితో పోల్చినా దీని స్థాయికి తగనివే. దిగువనే ఉంటాయి. అయినా మనకు అవగతమయ్యేందుకు వీలైనంత (మనకు) ఉన్నతమైన వాటితో పోలుస్తుంటాము.

అనియంత్రణమ్ అయిన భగవానుడు, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ మన కోసం సగుణ సాకార రూపాన్ని తీసుకోవటానికి కొన్ని నియంత్రణలకు (constraints) లోబడతాడు. తనకు తానుగా. ఆ నియంత్రణలు కాల సంబంధంగా ఉంటే అవి మనం Time Dependent equations గా సుమారుగా అర్థం చేసుకోగలము. ఒకవేళ time independent అయితే ఇతర నియంత్రణలు వాడుకోవలసి వస్తుంది.

ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః।

ధ్రువం త ఇన్ద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్॥

ఆకాశ పురుషుడైన వరుణుడు, త్రిలోకాధిపతి, దేవతలకు రాజు అయిన ఇంద్రుడు, దేవతలకు గురువైన బృహస్పతి ఎవరిని కేంద్రముగా చేసుకుని తమ కర్తవ్య నిర్వహణ చేస్తారో ఆయనే (ఆ విశ్వశక్తియే) ధ్రువః.

ఈ జగత్తును అంతా ధరించి ఉన్నది కనుక ధ్రువము. The Eternal Frame of Reference on which the entire known and unknown universe is plotted.

ఇక నియంత్రణలు వాడితే

ధరతీతి ధర్మః – ధర్మ స్వరూపుడు కనుక ధ్రువుడు.

ధర్మము అనేది ఒక నియంత్రణ. ఆ నియంత్రణ ఉంది కాబట్టే ఈ భౌతిక జగత్తు మనకు అవగతమౌతోంది కొద్ది పరిమాణములో అయినా. ధర్మము దేశకాలమాన పరిస్థితులను బట్టీ మారుతుంది. That is why Dharma is the constraint thanks to which the classical law of human existence works. It is the pivot on which entire existence of material world happens.

ఈ ధర్మము అనేది ఏకకణ జీవుల నుంచీ చతుర్ముఖ బ్రహ్మ గారి వరకూ ఆచరించి తీరాల్సిన నియంత్రణ.

ఈ ధ్రువమైన సనాతన నారాయణ పరబ్రహ్మ తత్వం మనకు అందినట్లే అనిపించినా అందదు. మన ఇంద్రియమనోబుద్ధులకు. అదే తరువాత నామమైన

56. అగ్రాహ్యః – తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింపనలవి కానివాడు.

57.శాశ్వతః – కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.

58.కృష్ణః – సర్వమును ఆకర్షించువాడు. దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు. సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు.

59.లోహితాక్షః – తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.

60.ప్రతర్దనః – ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.

61.ప్రభూతః – పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.

62. త్రికకుద్ధామః, త్రికకుబ్ధామః – సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి – మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.

త్రికకుత్ – మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి

ధామః – నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.

63. పవిత్రం – పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.

64. మంగళం పరం – అన్నింటికంటె మంగళకరమగు మూర్తి. స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.

అగ్రాహ్యః శాశ్వతో కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః।

ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్॥

అగ్రాహ్యః అనే నామమునకు ద్వైత వ్యాఖ్యానం తెలుసుకుందాము.

॥సాకల్యేన గ్రాహ్యః న భవతీతి అగ్రాహ్యః॥ – పూర్తిగా తెలుసుకునేందుకు సాధ్యం కానివాడు. He can only be approximated.

॥సర్వస్యాపి గృహీతత్వేన న విద్యతే గ్రాహ్యం యస్యేతి వా॥ – సమస్తమూ గ్రహించుట చేత ఇక గ్రహించటానికి ఏదీ లేని వాడు.

మనం గ్రహించటం కాదు. ఆయన గ్రహించటానికి ఇక ఏదీ లేదు. ఎందుకంటే అంతా ఆయనే అయినప్పుడు, ఇక ఆయనకు గ్రహించటానికి ఏమి ఉంది?

*ఆయన – విశ్వశక్తి.

గ్రహ ఉపాదానే ధాతువు.

గ్రాహ్యో న భవతీత్య గ్రాహ్యః॥ – ఎవరికీ, దేనికీ పట్టుబడని వాడు. భక్తికి మాత్రమే కట్టుబడతాడు.

ఆహ్యః గుణైః వ్యాపనీయః। అగ్రశ్చాసౌ ఆహ్యశ్చేతి వా॥ – గుణముల చేత వ్యాపించిన వారిలో శ్రేష్ఠుడు. అగ్రేసరుడు.

‘అహ వ్యాప్తౌ’ ఇత్యతో ణ్యత్. అహ వ్యాప్తౌ అనే ధాతువుకు ణ్యత్ అనే ప్రత్యయము చేర్చగా ఆహ్యః అగును.

ఇక శంకర వ్యాఖ్య ప్రకారం

ఇంద్రియమనోబుద్ధులచే గ్రహించేందుకు శక్యము కానివాడు అగ్రాహ్యుడు.

॥యన్మనసా న మనుతే॥ ఉపనిషద్వాక్యము. మనసుచే తెలియబడువాడు కాడు.

॥యత్ చక్షుషా నపశ్యతి॥ – కంటికి చూచుటకు వీలు కాని వాడు.

॥యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ॥ – ఎచ్చటికైతే వాక్కు, మనస్సు చేరలేక తిరిగివచ్చుచున్నవో అదియే బ్రహ్మము అయినందువలన భగవానుడు అగ్రాహ్యుడై ఉన్నాడు. సకలము తాను గ్రహించుచు ఉన్నాడు. అందుచేత తాను కాల స్వరూపమై, కాలాతీతమై మనగలుగుచున్నాడు. అట్టివాడు శాశ్వతుడు. తరువాత నామము అదే కదా!

క్లుప్తంగా చెప్పాలంటే కర్మేంద్రియములచే దర్శింపశక్యము కాని వాడు అగ్రాహ్యః.

చివరగా భట్టరు గారు చెప్పిన విషయము చూద్దాము.

అగ్రాహ్యః – గ్రహీతుం శక్య గ్రాహ్య। న గ్రాహ్య అగ్రాహ్యః॥ ఎవరి వలననూ గ్రహింపశక్యము కాని వాడు. అంటే ఆయనంతట ఆయన గ్రహింపబడదలచుకుంటే గ్రహింపబడతాడు.

ఉదాహరణకు ధ్రువునికి దర్శనమిచ్చినపుడు ఆ పిల్లవాడు ఆయనను తాను ఉపాసించిన రూపులో కనబడకపోయే సరికి కంగారు పడ్డాడు. అప్పుడు ధ్రువుడు దృష్టి పెట్టుకున్న రూపములోనే దర్శనమిచ్చి అతనికి గ్రహింపుకు వచ్చాడు. కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here