తల్లివి నీవే తండ్రివి నీవే!-51

0
11

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

కర్మల మర్మం

ప్రతిభటశ్రేణిభీషణ వరగుణస్తోమభూషణ

జనిభయస్థానతారణ జగదవస్థానకారణ।

నిఖిలదుష్కర్మకర్శన నిగమసద్ధర్మదర్శన

జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన॥ 1 ॥

శుభజగద్రూపమండన సురజనత్రాసఖండన

శతమఖబ్రహ్మవందిత శతపథబ్రహ్మనందిత।

ప్రథితవిద్వత్సపక్షిత భజదహిర్బుధ్న్యలక్షిత

జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన॥ 2 ॥

(సుదర్శన అష్టకం – వేదాన్తదేశిక కృతం 1, 2)

ఇక్కడ, కాలానికి అతీతుడు అనే సందర్భం వచ్చింది కనుక, భూతభవ్యభవత్ప్రభుః అనే నామాన్ని మరోసారి గుర్తు చేసుకోవచ్చు.

అక్కడ వాక్యాలను మరోసారి గుర్తు చేసుకుంటే..

<<< ఆ యజ్ఞార్థం జరిగిన చర్యలే వషట్కారః అన్న నామానికి అసలైన నిర్వచనం. అందుకే శ్లోకరూపంలో చెప్పబడింది.

Cosmic wit. వైశ్విక చమత్కారం. జీవులలో కర్మాచరణకు కావలసిన శక్తిగా నిలిచి, ఆ యఙ్ఞం నిరాటంకంగా జరిగేందుకు దోహద పడుతున్న శక్తి స్వరూపమే వషట్కారః.

ఇది ఎల్లప్పుడూ భూత కాలమందు, వర్తమానం కాలమందు, భవిష్యత్ కాలమునందు నిరాటంకంగా జరుగుతూనే ఉంది కనుక ఆయన భూత, భవ్య, భవత్ప్రభుః కూడా. అంటే భూత భవిష్యత్, వర్తమానం కాలాలను తన అధీనంలో ఉంచుకున్నాడు కనుక భూత, భవ్య, భవత్ప్రభుః. ఉంచుకున్నాడు కనుకనే, ఆ శక్తి ఉంది కనుకనే, ఆయన కాలానికి ప్రభువయ్యాడు. కాలస్వరూపుడయ్యాడు. >>>

అందుకే ఆయన స్థవిరః ద్రువః.

ఇదే విషయాన్ని కాస్త చమత్కారంగా ఏక్‌నాథ్ ఈశ్వరన్ ఇలా అంటాడు. ఈయన చెప్పేది పాశ్చాత్యులకు ఎక్కువగా అవగతమయ్యేందుకు. అందుకు తగిన ఉదాహరణములే తీసుకుంటాడు.

This (భూత, భవ్య, భవత్ప్రభుః) eloquently reminds us of the universal principle of cause and effect, often called Karma. Jesus himself summarised it perfectly: “With whatever measure ye mete out unto others, with the same measure shall it be measured unto you.”

This law governs our lives, past, present, and future. Just as physical laws guide the planets, this law shapes our destinies. Our past actions create our present circumstances, and our present choices determine our future. We ignore this law at our own risk.

Consider our health. To thrive, we must respect our bodies. Those who disregard their bodies through unhealthy habits like smoking or overeating will eventually face the consequences. While some might see illness as random misfortune, mystics understand it as the natural outcome of violating natural laws.

However, this principle offers immense hope. If our thoughts and actions shape our future, then we hold significant power over our destiny. We are not merely puppets of fate. Instead, every action we take plants a seed for future joy or suffering. The responsibility, and the freedom, are ours.

ఇంగ్లీషులో Volition అనే పదం ఉంది. Any Rand కు బాగా ఇష్టమైన పదం అని చెప్తుంది. దానికి ప్రామాణిక అర్థం ఇలా చెప్తారు.

The power to choose something freely or to make your own decisions.

Free will కు Volition కు తేడా ఉంది. Volition is all about your choices and choosing power. But, free will is all about the freedom to express what the person intended to. It is not necessarily about making choice but about his right to express his views without any constraints.

మానవులకు తగినది Volition. ఆ Volition ను ఉపయోగించి చేసుకునే ఎంపికలు ధర్మము అనే నియంత్రణ ఆధారంగా జరగాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు భగవద్గీతలో.

ఈ విషయాన్నే కొనసాగిస్తూ ఏక్‌నాథ్ ఈశ్వరన్..

The concept of Karma suggests that our current situation is a result of our past actions, desires, and thoughts. If we are experiencing hardship, it is not a punishment from a higher power, but rather a consequence of our own choices.

The good news is, we have the power to change our future by changing our present behaviour. By shifting our mindset and actions, we can create a better tomorrow. This means acknowledging our past mistakes and actively choosing a more positive path. We can do this by focusing on interconnectedness, considering the needs of others, and letting go of selfish desires. This can lead to a future filled with well-being, security, and fulfilment.

Through deep meditation, we can transcend the limitations of time and enter a state of timeless awareness. This allows us to release the burdens of the past and future, including painful memories, anxieties, and attachments. By letting go of these mental and emotional burdens, we can find liberation and inner peace. This process of “emptying the memory,” as described by Saint John of the Cross, is a key to spiritual freedom.

మనిషి ఆధీనంలో కర్మ (అనుకుంటామలా), భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.

ఈ కర్మలు 3 రకాలుగా ఉంటాయి.

  1. ఆగామి కర్మలు
  2. సంచిత కర్మలు
  3. ప్రారబ్ధ కర్మలు

ఆగామి కర్మలు:

ప్రస్తుతం మనం ఈ జీవితంలో చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి. మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మల్లో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు. కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టబడి ఉంటాయి (waiting for gestation time). ఉదాహరణకు మనం భోజనం చేస్తాం. ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం. వాటి ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితాలను ఇవ్వకుండా, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి పేరుకుని ఉంటాయి. ఇలా ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ ఆగామికర్మలు.

సంచిత కర్మలు:

సంచిత కర్మలంటే పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లి దండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటిది. లేదా వారి ఆస్తులను పంచుకుంటం లాంటివి కూడా. పూర్వ జన్మల్లో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్ళక తప్పదు. జీవుడు తను అంతవరకు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో ప్రయాణిస్తాయి. జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. దీనికి కారణం సంచిత కర్మలు.

ప్రారబ్ధ కర్మలు:

ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది. ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం. ఇలా పోగు చేసుకోవడం వలనే మళ్లీ మళ్లీ ఈ జన్మలు, శరీరాలు వస్తున్నాయి. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు.

ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. అంతకు మించి, నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన, జన్యుపర సమస్యలు లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం! అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే.

కర్మల నుంచి విమోచనం ఎలా?

పూజలు, యజ్ఞ యాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనం వీటిని మనకు నిర్దేశించింది ఆగామి కర్మల నుంచి విమోచనం కొరకే. పుష్కర స్నానాలు వంటివి కూడా అందుకే. మరీ వేలంవెర్రిగా కాకుండా ఎఱుకతో భక్తి శ్రద్ధలతో జీవితంలో ఒకసారి చేస్తే చాలు. మన నివాస స్థలానికి దగ్గరగా ఉండే నదీ పుష్కరాలు శ్రేష్ఠం. వైష్ణవులకు కావేరీ స్నానం, సకల జనులకు గంగా స్నానం కొంత వరకూ కర్మ ఫలాన్ని తొలగిస్తాయి.

ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం చేసే ఈ కర్మకాండల వల్ల (నదీ/పుష్కర స్నానాలు క్షేత్ర దర్శనం, పూజలు) కోటి జన్మల పాపాలు ఏమీ కొట్టుకుని పోవు.

ఇక్కడ కోటి అంటే శ్రేణి అని అర్థం తీసుకోవాలి. కొన్ని వరుసల పాపాలు తొలగుతాయి. అలా ఇతోధికంగా ధర్మబద్ధమైన జీవనానికి కర్మ సాధన జోడైతే పాత కర్మల యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది.

మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం. వెళ్ళే దారిలో చీమలు వంటి సూక్ష్మ జీవులను చంపడం లాంటివి. లేదా బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు మనం నడవటం ద్వారా మరణిస్తాయి. ఇలా తెలియకుండా చేసిన పాపాల నుండి విమోచన కోసమే, ఈ పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు మొదలైనవి. కావాలని ఎఱుకతో చేసే పాపాలు/కర్మలు వాటి ఫలితాలు అంత త్వరగా పోవు.

పితృదేవతలకు తర్పణం ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుండి విమోచనం పొందవచ్చు.

ప్రారబ్ధ కర్మలను మాత్రం అనుభవించి తీరాల్సిందే.

ఆగామి కర్మఫలం అంటకుండా ఉండాలి అంటే..

మనం ఇప్పుడు చేసేవన్నీ ఆగామి కర్మలే. ఎలాంటి కర్మ చేసిన ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం. అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకు అంటకుండా, బంధం కాకుండా తప్పించుకునే ఉపాయాలను శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో తెలియచేసాడు.

కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన।

మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి॥ (భగవద్గీత 2:47)

శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే మనకు అధికారము ఉంది కానీ ఆ కర్మ ఫలముల పైన కాదు. కర్మ ఫలములకు హేతువులము అని ఎప్పుడూ అనుకోక భగవదర్పణంగా చేయాలి. అది ఎలాగో శ్రీకృష్ణుడు మనకు భగవద్గీత మూడవ అధ్యాయమైన కర్మయోగంలో తెలిపాడు. చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.

అంటే కర్త్రుత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాసక్తి లేకుండా, లోకహితార్థంగాను, ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.

అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వారా మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి. కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకుని, మన మనోబుద్ధులు అందుకనుగుణంగా సవరించుకుని కర్మలు చేయాలి. ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బాణం వదలాలా వద్దా అనునది మన Volition. బంధాల నుంచి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.

ప్రారబ్ధ కర్మలు బంధం కాకుండా ఉండాలంటే..

జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి ఉన్న సంచిత కర్మలలోనుండి ఏవి పక్వానికి వస్తాయో ఆ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు.ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించటానికి తగిన శరీరాన్ని ధరించి జీవుడు ఈ లోకంలోనికి వచ్చిపడతాడు. ఆ ప్రారబ్ధ కర్మలన్నిటిని తప్పక అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తేనే ఆ కర్మలు ఖర్చు అయ్యేది. అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనస్సు నుండి విడిచిన బాణం వంటివి. కనుక ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవన్నామ స్మరణతో భక్తి యోగం ద్వారా అనుభవించి ఖర్చుచేసుకోవాలి.

సంచిత కర్మలు బంధం కాకుండా ఉండాలంటే..

ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం వుంది. కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణంతో చేస్తాము. ప్రారబ్ద కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకూ ముందు జన్మలవి, ఇప్పుడు ఖర్చు చేద్దాం అంటే పక్వానికి రాలేదు. కనుక వీటిని అన్నిటి నుంచి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధనం లేకుండా ఉండాలంటే, మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాస్వతనందాన్ని పొందాలంటే, ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలంటే ఈ సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి.

ఎక్కడ చేయాలి??

జ్ఞానాగ్నిలో!

“జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం” అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయటం ఒక్కటే మార్గం. ఆ జ్ఞానాన్ని పొందటం అంత తేలికేమీ కాదు.

కర్మలు మనుషులను ఎలా మోక్షం పొందకుండా అడ్డం పడతాయో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో జడభరతుని కథ ప్రసిద్ధమైనది. గొప్ప సాధకుడు కూడా ఈ కర్మల బారినపడి వాటికి ఎలా ఫలితాలను అనుభవించాల్సిన స్థితికి వస్తాడో తెలుపుతుంది.

అగ్నీధ్రుడు జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు. ‘పూర్వాచిత్తి’ అనే అప్సరస వలన అతనికి తొమ్మిది మంది పుత్రులు కలిగారు. వారు

  1. నాభి
  2. కింపురుషుడు
  3. హరివర్షుడు
  4. ఇలావృతుడు
  5. రంయకుడు
  6. హిరణ్మయుడు
  7. కురువు
  8. భద్రాశ్వుడు
  9. కేతుమాలుడు – అనువారు.

జంబూ ద్వీప వర్షాలను (దేశాలను) ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు అగ్నీధ్రుడు. తమ తమ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు.

పెద్దవాడయిన నాభి భార్య మేరుదేవి. వారిరువరికీ విష్ణువు ఋషభుడు అనే పేరుతో కుమారుడుగా జన్మించాడు.

ఋషభుడు తన అద్భుత శక్తి చేత ఇంద్రుడిని జయించాడు. తన రాజ్యానికి ‘అజనాభము’ అని పేరు పెట్టాడు. అతని భార్య జయంతి. వారికి నూర్గురు పుత్రులు కలిగారు. వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు మన భరతుడు. అతను ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు.

భరతుడు పరమ భాగవతోత్తముడు. విశ్వరూపుని కుమార్తె అయిన పంచజనిని వివాహం చేసుకున్నాడు. అన్ని విధాల తనతో సమానులైన 5 గురు పుత్రులను కన్నాడు. భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. ఎన్నో యజ్ఞాలూ, యాగాలూ, సత్కర్మలూ చేసి పరమ పురుషుడిని ఆరాధించాడు. శ్రీమన్నారాయణుని తన మనసులో ప్రతిష్టించుకొని పూజిస్తూ వచ్చాడు.

తుదకు కుమారులకు రాజ్యాన్ని అప్పగించి విరక్తుడై సర్వం త్యజించి పులహ మహర్షి ఆశ్రమ మైన సాలగ్రామ క్షేత్రానికి వెళ్లి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని ప్రశాంత వాతావరణంలో భగవంతుడిని ఆరాధిస్తూ గడపసాగాడు. లేడి చర్మం వస్త్రంగా ధరించి వివిధ పుష్పాలతో, తులసి దళాలతో శ్రీహరిని పూజిస్తూ భగవచ్చింతన తప్ప వేరొక విషయం పట్టక గొప్ప భక్తుడై బ్రహ్మజ్ఞాని అయ్యాడు.

అన్నిటికీ అతీతుడై జడత్వముతో వుండడము వల్ల అతనికి ‘జడభరతుడు’ అని పేరు వచ్చింది.

ఒకనాడు అతడు పరమ పవిత్రమైన చక్రానదికి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించి ప్రణవమును జపిస్తూ కాసేపు ఆ నది ఒడ్డుననే కూర్చున్నాడు. అప్పుడొక లేడి అక్కడికి నీళ్ళు తాగడానికి వచ్చింది. అది నిండు గర్భవతి.

అది నీళ్ళు తాగుతుండగా సమీపంలో నుండి సింహ గర్జన వినిపించింది. లేళ్ళు పిరికి జీవులు. ఆ లేడి సింహగర్జనమునకు బెదిరిపోయి నదికి అడ్డంపడి నదిని దాటడానికి ప్రయత్నిస్తూ వుంటే, అప్పుడు దానికి గర్భస్రావమై దాని బిడ్డ నదిలో పడిపోయింది. అది కూడా చూసుకోకుండా ప్రాణభయంతో నది దాటి ఒడ్డుకు వెళ్లి ఆయాసంతో అక్కడే మరణించింది.

జడభరతుడు నదిలోకి దిగి ఆ చిన్న లేడికూనను చేతిలోకి తీసుకొని, దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి తన వెంట ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు. తల్లి లేని దాన్ని చూసి అతనికి దయ, జాలి కలిగాయి. అప్పటినుండీ దానిని యెంతో అభిమానంగా చూసుకునే వాడు. దానికీ గడ్డి, ఆకులు తినిపించడం, దాన్ని మృగాల బారిన పడకుండా కాపాడటం.. అలా కన్నబిడ్డ లాగా సాకాడు. అది కూడా ఒక క్షణం కూడా అతన్ని విడిచి పెట్టకుండా అతని వెనక వెనకే తిరుగుతూండేది.

స్నానానికి వెళ్ళినా, ధ్యానం చేసుకుంటున్నా ఎప్పుడూ అతని వెంటే వుండేది. అన్ని బంధాలూ విడిచి భగవంతుని ఆరాధనలో కాలం గడుపుతున్న భరతుడికి ఈ లేడి మూలంగా ఒక ఎడతెగని బంధం ఏర్పడినది. రోజురోజుకూ అది ఎక్కువైపోయి ఆ లేడి పిల్లే అతని లోకం అయిపోయింది.

క్రమంగా అతని పూజలూ, జపతపాలూ, దేవతార్చనలు, అనుష్ఠాన క్రియలూ మూలకు చేరాయి. తన సాధన వెనక పడినందుకు జడభరతుడు విచారించ లేదు. పైగా పరోపకారం, శరణాగత రక్షణ తన కర్తవ్యం అనుకున్నాడు. ఆ లేడి క్షణం కనిపించక పొతే విలవిలలాడి పోయేవాడు. ఈ స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిచాయి. అతనికి అవసాన దశ వచ్చేసింది.

అయితే మరణ సమయంలో కూడా తను భగవన్నామ స్మరణ చేయక ఆ లేడినే తలుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆ కారాణం వల్ల అతను మరుజన్మలో ఒక లేడిగా పుట్టాడు. అయితే అతను పూర్వజన్మలో చేసిన పుణ్యం, తపోబలం వల్ల అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తన పూర్వజన్మ తలుచుకొని యెంతో దుఃఖపడ్డాడు.

“భగవదారాధన చేస్తూ యోగిగా తను మోక్ష పదం పొందడానికి బదులు అవివేకియై ఒక లేడి పిల్లను చేరదీసి తుదకిట్లా భ్రష్టుడనయ్యానే,” అని వాపోయాడు. ఆ విధంగా జడభరతుడు విరక్తి పొంది తాను వుండే ‘కాలాంజనం’ అనే పర్వతం నుండి సాలగ్రామ క్షేత్రమైన పులహ ఆశ్రమానికి వెళ్లి పోయాడు. ఈ మృగ జన్మ ఎప్పుడు అయిపోతుందా? అని ఆరాట పడుతూ తుదకు ఆహారాదులు వర్జించి నదీజలాలలో ప్రవేశించి ఆ మృగ దేహాన్ని విడిచి పెట్టాడు.

తరువాత మరో జన్మ తీసుకోవలసి వచ్చింది. కారణం ఏవో ప్రత్యేక పరిస్థితులలో తప్ప మోక్షం కలగాలంటే మానవ జన్మమే కావాలి.

దేనిమీదా అతిగా వ్యామోహం పెంచుకోకూడదు. తమ పిల్లల మీద గానీ, మనవలూ, మనవరాళ్ళూ అని అతి ప్రేమ పెంచుకొని దైవారాధన మరిచి, వాళ్ళే సర్వస్వమని ఎక్కువ మమకారాన్ని పెంచుకోకూడదు. తామరాకు మీది నీటి బొట్టు వలె వుండాలి. ధనం మీదా, పిల్లల మీదా, వేరే దేని మీద ఐనాసరే విపరీత వ్యామోహం (ఇష్టం, ప్రేమ వేరు, వ్యామోహం వేరు) వుండకూడదు.

కర్మఫలం అన్నది మనకు time independent గా (జన్మలతోనూ, కాలంతోనూ సంబంధం లేకుండా) వస్తూనే ఉంటుంది. దానిని వదిలించుకుని మోక్షం పొందాలాంటే శాశ్వతుడైన (time independent at unimaginably highest class) భగవానుని నామస్మరణ మనకు మార్గము.

ఆ శాశ్వతుడి గురించే ఇప్పుడు తెలుసుకుందాము.

శాశ్వతః – కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.

ఆ శాశ్వతుడు ఎవరు?

మనకు కూతవేటు దూరంలో మన నేలమీద నడయాడిన శ్రీకృష్ణ పరమాత్మయే.

అందుకే తరువాత నామం

కృష్ణః!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here