తల్లివి నీవే తండ్రివి నీవే!-52

0
12

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

శిష్ట రక్షణమ్ దుష్ట శిక్షణమ్

తవ కరకమలవరే నఖమద్భుతశృంగం

దళితహిరణ్యకశిపుతనుభృంగం

కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే॥4॥

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం

దశముఖమౌళిబలిం రమణీయం

కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే॥7॥

(జయదేవ దశావతార స్తోత్రం)

57.శాశ్వతః

భగవద్గీత మీద చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. ఆ పవిత్రమైన గీతను ఒక వ్యక్తిత్వం వికాస గ్రంధంగా భావించి దానిని ఆ కోణంలో వ్యాఖ్యానించారు. కొందరు ఆథ్యాత్మిక గ్రంథంగా భావించి అలాగే వ్యాఖ్యానాలు అందించారు.

ప్రముఖంగా మనకు ఆది శంకరాచార్యుల వారు చేసిన అద్వైత వ్యాఖ్య (చాలామంది పండితులు, ఆథ్యాత్మికవేత్తలు పరమప్రామాణికంగా భావిస్తారు) ద్వైత వ్యాఖ్య మధ్వాచార్యుల వారు చేయగా, భగవద్రామానుజులు విశిష్టాద్వైత వ్యాఖ్య చేశారు.

అది కాకుండా recorded history లో పుస్తకరూపంలో భగవద్గీతకు దాదాపు 5676 వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి కాక రకరకాల పీఠాధిపతులు (చిన్నజీయర్ స్వామి ఇత్యాదులు, సుందర చైతన్యానంద ఇత్యాదులు), పిరమిడ్ ధ్యానాన్ని అనుసరించే వారికి సుభాష్ పత్రి గారు..

ప్రామాణిక వ్యాఖ్యలను ప్రక్కన పెడితే ఇతర వ్యాఖ్యలు ఏవైనా సరే వారి వారి అభిప్రాయాలను కలుపుతారు. లేదా పెద్దల వ్యాఖ్యలను అనుసరిస్తారు, వారి స్వంత మాటల్లో తిరిగి రాస్తారు. ఇక వ్యక్తిత్వ వికాస సంబంధంగా వ్రాసేవారు ఎంత విపరీత వ్యాఖ్యానాలు ఇస్తారన్నది వారి వారి స్థాయిని బట్టీ తెలుస్తుంది.

ఇకపోతే భగవద్గీతను అలాగే చదివి భిన్నంగా అర్థం చేసుకున్న విఖ్యాత శాస్త్రవేత్తల ఉదంతాలు కూడా మనకు తెలుసు. ఉదాహరణకు ఆపెన్హీమర్ (J. Robert Oppenheimer) సంగతి చూద్దాం.

అమెరికాకు చెందిన ఆపెన్హీమర్‌కు భగవద్గీత అంటే గౌరవం. తనను ప్రభావితం చేసిన పది అద్భుత పుస్తకాల్లో గీత ఒకటి అని చెప్తాడు. సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ప్రతి వారం ఒక సంస్కృతం ఆచార్యుడిని రప్పించుకుని.

The Professor of History, James A Hijiya, wrote in his book “The Gita of J. Robert Oppenheimer”, “Krishna’s message to Arjuna is clear: you must fight. To Oppenheimer, the message would have seemed equally clear. If it was proper for Arjuna to kill his own friends and relatives in a squabble over the inheritance of a kingdom, then how could it be wrong for Oppenheimer to build a weapon to kill Germans and Japanese whose governments were trying to conquer the world.”

In a squabble over the inheritance of a kingdom – ట!

దేవ-ఆసురీ శక్తుల మధ్య జరిగిన చివరి యుద్ధాలలో ఒకటి, అసురులను నిర్జించేందుకు పరమాత్మ అవతరించిన ఘట్టాన్ని, ధర్మ సంస్థాపన లక్ష్యంగా జరిగిన యుద్ధాన్ని అన్నదమ్ముల మధ్య రాజ్యం కోసం జరిగిన యుద్ధంగా అనుకోవటమే పెద్ద సమస్య.

చాలాకాలం నుంచీ రామాయణ భారతాలను వాటికి ఉన్న పవిత్రతను, వాటిలో ఉన్న దివ్యశక్తులను ఉపసంహరించి మామూలు మనుషుల మధ్య జరిగిన సంఘటనల సమాహారంగా చూడటం జరుగుతోంది. అలా చూస్తేనే ఆపెన్హీమర్‌లా తప్పుటడుగులు వేస్తారు.

Robert Oppenheimer, the “father” of the atomic bomb, is said- he quoted the line, “Now I am become Death, the destroyer of worlds.”

The quote

The line is a paraphrase of verse 11.32 of the Bhagavad Gita, which says

కాలోఽస్మి లోకక్ష్యయకృత్ ప్రవృద్ధో

లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః।

ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే

యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః॥

కాలః — కాలము

అస్మి — నేను

లోక-క్ష్యయ-కృత్ — లోక వినాశమునకు హేతువు

ప్రవృద్ధః — విజృంభించిన

లోకాన్ — లోకములు

సమాహర్తుమ్ — ప్రళయకాల వినాశము

ఇహ — ఈ లోకము

ప్రవృత్తః — ప్రమేయము

ఋతే — లేకుండా

అపి — అయినా

త్వాం — నీవు

న భవిష్యంతి — బ్రతికి ఉండరు

సర్వే — అందరూ

యే — ఎవరైతే

అవస్థితాః — నిలిచిఉన్న

ప్రతి-అనీకేషు — ప్రతిపక్షమున ఉన్న

యోధాః — యోధులు.

నేనే మహాకాలమును. (సమస్తలోకములను సృష్టించినవాడను). సమస్త లోకములను లయము చేసే మూలకారణమును. నీది లేదా ఇతరుల ప్రమేయము లేకున్నను, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు (నశిస్తారు).

కాలాగుగుణంగా మరణించక తప్పదు కదా!

Oppenheimer’s interpretation

Oppenheimer’s take of the verse saying “I am death” was a misinterpretation.

The verse actually means “I am time, the cause of world-destruction, mighty; come here to annihilate the worlds”.

కాలంతో అన్నీ నశించి పోవలసినదే.

Oppenheimer was attracted to Hinduism and found it a useful philosophy to structure his life around. He learned from the Gita that it was his duty to build the bomb, and it was the leaders’ duty to use it wisely. But he couldn’t understand the profound destruction the nuclear bomb causes. He couldn’t even estimate.

ఎందుకు?

ఆ గీతా వాక్యాన్ని సరిగ్గా అవగతం చేసుకోలేదు కనుక.

ప్రయోగంతో పాటు ఉపసంహరణ కూడా తెలిసిన వారు ఉన్న కాలమది. ఈనాడు ఉపసంహరణ ఎంతమందికి తెలుసు? ఎక్కడ ప్రయోగించాలా, ఎప్పుడు ప్రయోగించాలి, ఎందుకు ప్రయోగించాలి, అస్త్ర లక్ష్యం ఏమిటి? ఎంతమేర దాని ప్రభావం కనిపించాలి ఇవన్నీ అంచనా వేసుకునేవారు. అలా విచక్షణ వాడగలిగిన వారికే ఆ అస్త్ర రహస్యాలు అందింపబడేవి.

పైగా

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నది మనకు బాగా అలవాటై వాడుకలో ఉన్న వాక్యం.

నిజానికిది..

శిష్ట రక్షణ దుష్ట శిక్షణ.

కావాలంటే గీతలోనే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను చూద్దాము.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత।

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥4.7॥

ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥4.8॥

ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.

కానీ రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ముందు యూదులను రక్షించాకే హిట్లర్ మీదకు వెళ్ళారా? నాజీలను శిక్షించారా? లేదు కదా! జపాన్ మీద అణు బాంబు వేశాక అక్కడ జరిగిన నష్టం ఇప్పటికీ పూర్తిగా తొలగ లేదు. అక్కడ అణు ధార్మికత ప్రభావం ఇంకా ఉన్నది.

కానీ స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు.. శిష్ట రక్షణ తరువాతే దుష్ట శిక్షణ చేశాడు.

శ్రీరామావతారంలో మాత్రం దుష్ట శిక్షణ (రావణ వధ) తరువాతే శిష్ట రక్షణ (సీతమ్మను విడిపించటం) జరిగింది. కారణం రామావతారంలో మానవ లక్షణాలను చూపాడు పరమాత్మ.

ఇక్కడ ఈ విషయాన్ని మరింతగా ధ్రువీకరించటానికి గజేంద్ర మోక్షణం పరిశీలించాలి.

స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి దిగి వచ్చాడు అని శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుతో చెప్తాడు. అది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా చెప్పుమని ప్రార్థిస్తాడు. ఆ మహర్షి గజేంద్ర మోక్షం గాథను ఇలా వివరించాడు.

పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉంది. అది పదివేల ఆమడల పొడవూ, అంతే వెడల్పూ, ఎత్తూ కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుమూ నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గలగలలాడుతూ పారే సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగు రంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికూటం దేవతలనూ, యక్షులనూ, కిన్నరులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది.

ఆ అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు, ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటంత భయంకరంగా ఉంటాయి. అవి ఒకనాటి సాయంత్రం కొండగుహలలో నుండి విహారానికి బయలుదేరాయి. ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి.

ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ళ మడుగు వైపు నడిచాయి.

ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారితప్పి గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. అవి మాత్రమే మిగిలాయి తోడుగా. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు గజరాజు. ఒకచోట ఒక నీటి మడుగు చూసాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు కలువలూ ఉన్నాయి.

మదపుటేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మసరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి. విపరీతమైన శబ్దాలు చేస్తూ నిండుగ నీళ్ళు త్రాగాయి. గజరాజు తన తొండంతో నీళ్ళు పీల్చి మునిగాళ్ళపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆడ ఏనుగులపై నీళ్ళు చల్లాడు. తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేసాడు. దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి.

ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగి ఉన్న మొసలిరాజు అతనిని చూసాడు. భుగ భుగ మనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరి పడేటట్లు, గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావుదెబ్బ తిని నీళ్ళలో పడిపోయింది. వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. ‘ఏనుగు కంటె మొసలి, మొసలి కంటె ఏనుగు బలమైనవి’ అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్య పోయారు.

కరి మకరి రెండూ ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ, తలలు ముక్కలయ్యేటట్లు, నెత్తురు కారేటట్లు వాడి పండ్లతో పొడుచుకున్నాయి. పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుకున్నాయి. సరస్సులో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు అసహాయంగా చూస్తూ ఉండిపోయాయి.

మొసలికి నీటిలో బలం ఎక్కువ. క్రమంగా దానికి బలమూ పట్టుదలగా పెరిగాయి. గజరాజు రాను రాను కృష్ణ పక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరస పడుతున్నాడు. మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెడనూ వీపును కరిచి బాధపెట్టింది. తోక కొరికింది. ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొంది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది. గజేంద్రుడు ఘోరమైన మొసలి వాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళూ పగళ్ళూ వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు.

పూర్వ జన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేశాడు. “ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుని ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు? ఈ మొసలిని అడ్డగించే వారెవ్వరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను. ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దానజలధారలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను? భగవంతుడా భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమతుందో?

ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, చివరికి మరల ఎవరియందు కలిసి పోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లోను ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో! లేడో!ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుని ప్రార్థించాడు. “భగవంతుడా! నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గి పోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం చిక్కి పోయింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. రావయ్యా! కరుణించి నన్ను కాపాడవయ్యా” అని వేడుకున్నాడు.

ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్నవారిని కాపాడే భగవంతుడు శ్రీమహావిష్ణువు వైకుంఠంలో, అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువపువ్వుల పాన్పుపై శ్రీమహాలక్ష్మితో వినోదిస్తున్నాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరచెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి ‘కాపాడు కాపాడు’ అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు. గజరాజును కాపాడాలనే ఆత్రుతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్లిపడి లేచాడు. “కాపాడు కాపాడు” అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతోంది. అతనిని కాపాడాలని తొందర పడుతున్నాడు.

లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు. శంఖు చక్రాలను చేతిలోనికి తీసుకోలేదు. సేవకులెవరినీ పిలవలేదు. గరుడవాహనం సిద్ధపరచుకోలేదు. చెవులపై జారిన జుత్తుముడిని సరిచేసుకోలేదు. ప్రణయకోపంతో లేచి వెళ్ళుతున్న లక్ష్మీదేవి చీరకొంగును వదలి పెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశమార్గాన బయలు దేరాడు. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడుడూ, శంఖమూ, చక్రమూ, నారదుడూ, విష్వక్సేనుడు, వారి వెనుక వైకుంఠంలో నున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు.

లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళుతున్నాడో అడగాలనుకుంది, కాని అడగలేక పోయింది. ఆకాశమార్గాన వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేసారు. కాని గజరాజును కాపాడాలనే తొందరలో మైమరచి వారి మ్రొక్కులు కూడా అందుకోలేదు. అలా బయలుదేరివెళ్ళిన నారాయణుడు “త్రికూటం” చేరాడు.

వెంటనే గజేంద్రుడిని తన చేతితో పట్టుకుని పైకి లాగి గట్టున ఉంచాడు. ఆ పరమాత్మ చేతి స్పర్శ తగలగానే గజరాజుకు సంపూర్ణ సాంత్వనం లభించింది.

విష్ణువు మొసలిని సంహరించటానికి తన చక్రాన్ని (సుదర్శనం) పంపాడు. ఆ చక్రరాజు దేవతలను కాపాడేది, భూమండలాన్ని వణికించే వేగం కలది. ఎదురు లేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తల నరికి వేసింది, దాని ప్రాణం తీసింది.

గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణుమూర్తి హస్త స్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారి పోయింది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేసాడు. ఆ మొసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదలి ‘హూహూ’ అనే గంధర్వుడిగా మారిపోయింది. ఆ గంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి, స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు.

మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్యుడనే రాజు. ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది.

అదీ విషయం. శిష్ట రక్షణమ్ తరువాతే దుష్ట శిక్షణమ్.

ఎందుకింత వివరణ అంటే ఏక్నాథ్ ఈశ్వరన్ “శాశ్వతః” అనే నామానికిచ్చిన వ్యాఖ్యానం కొంత వరకూ సమంజసంగానే ఉన్నా, దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. అన్వయం చేయటంలో తప్పు జరిగింది.

ముందు ఆయన ఏమి చెప్పాడో చూద్దాము.

Śāśvtah

The supreme reality is eternal, always having existed and always will. This reality reveals our true nature when we transcend the belief that we are merely physical beings, constrained by body, mind, and intellect.

As Sri Krishna declares in the Bhagavad Gita, “You were never born. Therefore, you will never die.”

The true essence of you is eternal, existing even before your physical form or the birth of the sun. That which was never created cannot cease to exist upon the death of the body. This profound realization comes in the ultimate peak of meditation, called samadhi, where we unite with the divine presence residing within our consciousness.

మరి మన ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఆచార్యులు ఎలా చెప్పారు? ఏమి చెప్పారు?

చూద్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here