‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ – కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన

2
12

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

Dharma (sanatana) says ACT. ధర్మం ‘చేసేయ్’ అని చెప్తుంది.

ధర్మం దేశ కాలమాన పరిస్థితులను అనుసరించేది.

సనాతన ధర్మం అంటే నిత్యనూతన ధర్మము. It’s evergreen. అది ఒక మతం కాదు. ఏ ఒకరి ఫేంటసీల నించీ ఊడి పడింది కాదు. అదొక జీవన విధానం. Evidence based (faith)

ఇంకోరకంగా చెప్పాలంటే ప్రకృతికి దగ్గరగా ఉంటూ దానితో అవసరమైనంత మేర మమేకమవుతూ, తామరాకు మీద నీటిబొట్టులా దేన్నీ మనకు అంటించుకోకుండా, దేనికీ మనం అంటుకోకుండా common sense వాడుతూ జీవించే విధానాన్నే సనాతన ధర్మం అంటారు.

ఆ సనాతన ధర్మం మాత్రమే మార్పు సహజం అని చెప్తుంది. అదే చేత్తో ఆ మార్పు శాస్త్రబద్ధంగా ఉండాలని కూడా చెప్తుంది. శాస్త్రమంటే అపౌరుషేయాలైన వేదాలు, వేదాంతము, దాని సారాన్ని అందించే ఉపనిషత్‌లు, బ్రహ్మసూత్రాలు.. అదే కాదు ఆధునిక విజ్ఞానం కూడా (హేతువు గూర్చిన అన్వేషణ కూడా సనాతన ధర్మంలో భాగమే).

శాస్త్ర వాక్యాలకు కాలానుగుణంగా సవరించిన వ్యాఖ్యను వ్రాయాలని భగవద్రామానుజులు తెలియజేశారు. We always aim for the best అని. Revisionist philosophy is the need of the hour in these testing times where Sanatana Dharma is attacked from 10 directions.

కనుక సనాతన ధర్మం గొప్పతనాన్ని ఈ కాలపు యువతకు తెలియజేయాలి. అందుకు సరైన ఊతాన్ని ఇచ్చేది శ్రీవిష్ణు సహస్రనామం.

భీష్మాచార్యులు శ్రీకృష్ణ భగవానుని సమక్షంలో ధర్మరాజు సాక్షిగా మనకు అందించిన ఈ స్తోత్రామృతానికి అక్షర రూపం ఇచ్చింది వ్యాస మహర్షి.

దానికి త్రిమత (అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత) వ్యాఖ్యలు అందించారు ఆది శంకరులు, రామానుజుల వారి ఆజ్ఞ అనుసరించి పరాశరభట్టరు, సత్యసంధ తీర్థులు.

ఈ మూడు వ్యాఖ్యానాల ఆధారంగా షణ్మతాలకు (గాణాపత్యం, సౌరము, వైష్ణవము, శైవము, శాక్తేయము, స్కాందము) తగిన విధంగా అనుసంధానిస్తూ, ఆధునిక తత్వవేత్తలలో అత్యున్నత వ్యాఖ్యానాలను స్పర్శిస్తూ

వినూత్నంగా చేయబడుతున్న బృహత్తర ప్రయత్నమే

వేదాల గీతాచార్య సృజించిన

‘తల్లివి నీవే తండ్రివి నీవే!’

ఇందులో ఏదీ శాస్త్ర విరుద్ధంగా ఉండదు. కానీ నూతనత్వంతో తొణకిసలాడుతుందీ వ్యాఖ్యానం.

***

వచ్చే వారం నుంచి సంచికలో చదవండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here