తందనాలు-20

0
11

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

191
కోరికలు ఎక్కువైనప్పుడు
తీరిక లేక సతమతమౌతారు
తీర్చుకునే సమయమూ, సందర్భమూ రావాలి
ఖర్చులెక్కువైనా తీర్చుకోక తప్పదు

192
మూడు ముళ్ళతో పెళ్లి బంధం
ఏడడుగులతో సంసారం మొదలు
కడు సుకుమారంగా సంసారం సాగు
ఏడాది తిరిగేసరికి కేర్ కేర్ మని పాప

193
మూడు ముదనష్టం
ఏడు ఏడుపుకే కదా
నడుమ వచ్చేనాలుగు, అయిదు ఆరు మంచివేగా
కడు వివరంగా ఆలోచించితే అన్ని అంకెలు మంచివే

194
పుట్టుట గిట్టుట కొరకేగా
తట్టుకొని నిలబడే వాళ్ళు
పట్టుమని పది కాలాలపాటు వుండే వాళ్ళు ఎందరో
చిట్ట చివరికి నిర్యాణంతో సరి

195
సున్నా విలువ ఒంటరిగా ఉంటే శూన్యమే
దేని ప్రక్కనన్నాచేరితేనే విలువ
వెనుక భాగాన చేరితే విలువే లేదు
సున్నా కూడా విలువైనదే

196
ఒకటెప్పుడూ మొదటి స్థానమే
చక చకా పనులు మొదలు పెట్టటానికి
వంకలు పెట్టకుండా ప్రారంభించ వచ్చు
చాకచక్యంగా పని పూర్తి అగు

197
రెండు ద్వితీయ స్థానమేగా
కడు సునాయాసంగా సాగిపోవు పనులు
ముడులెన్నడూ వుండనే వుండవులే
తడుముకోకుండా అన్ని పనులు నెరవేరు

198
మూడు తృతీయ స్థానమే
చెడు జరుగునని మానవుల నమ్మకము
గడ్డు సమస్యలు వస్తాయని భయం
తడుముకోకుండా ప్రారంభించు, జయం చేకూరు

199
నాలుగు ఉన్నత స్థానం
కలుషితాలు యేమి వుండవు
పలు పనులు ఆరంభానికి మంచిదే
నలుగురు మెచ్చుకునే విధంగా పనులు పూర్తవుతాయి

200
ఐదు పంచమ స్థానం
లేదు ఏ దోషం ఈ అంకెతో యే పనికైనా
వద్దని అనుకోవాల్సిన పని లేదు
కాదు కూడదని ఆలోచించాల్సిన పని లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here