టెక్నాలజీ ప్లస్, మైనస్ 1

0
8

[box type=’note’ fontsize=’16’] “సాఫ్ట్‌వేర్ తయారీలో కంపెనీలు సమాచారాన్ని సంగ్రహించడానికి అనువుగా ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాయి. తయారీలో లొసుగుల కారణంగా సమాచారం సేకరించగల అవకాశాలు సరేసరి” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]సై[/dropcap]బర్ దాడులకు సమాచార వ్యవస్థలే కాదు, ఏవియేషన్, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వ్యవస్థలు ఏవీ అతీతం కాదు. ఇక్కడ దాడి చేయటం చాలా సులువు, ఖర్చు తక్కువ. కానీ ఈ దాడుల వల్ల కలిగే నష్టం చాలా దారుణంగా ఉంటుంది.

మన దేశంలో జరుగుతున్న సైబర్ దాడులకు 30% పైగా చైనా భూభాగం మీది నుండే జరుగుతున్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందం 2018 వెలువరించిన నివేదిక చెప్తోంది. కేంద్రబ్యాంక్ (RBI), O.N.G.C. వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు రూపకల్పన జరుగుతోందని ఆ అధ్యయనంలో తేలింది.

మన బి.ఎస్.ఎన్.ఎల్. తో సహా టెలీ కమ్యూనికేషన్ రంగంలోని సంస్థలు అనేకం చైనా పరికరాలనే వాడుతున్నాయి. కీలకమైన పరికరాలకు దిగుమతులపై ఆధారపడడం కూడా సైబర్ దాడులకు ఒక కారణం. భారతదేశం సాఫ్ట్‌వేర్ సేవలలో ముందు ఉంది. సాప్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీలో వెనుకబడి ఉంది. 2017లో మన సాఫ్ట్‌వేర్ ఎగుమతుల (applications) విలువ 50,000 కోట్ల రూపాయలు కాగా దిగుమతుల విలువ 70,000 కోట్ల రూపాయలకు పై మాటే.

సాఫ్ట్‌వేర్ తయారీలో కంపెనీలు సమాచారాన్ని సంగ్రహించడానికి అనువుగా ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటాయి. తయారీలో లొసుగుల కారణంగా సమాచారం సేకరించగల అవకాశాలు సరేసరి. కంప్యూటర్స్‌కి సంబంధించి – హార్డ్‌వేర్ డిజైనంగ్, తయారీ, నిల్వ, పంపిణీ ఇలా అనేక దశలు ఉంటాయి. ఏదో ఒక దశను తమకు అనుకూలంగా మార్చుకుని నిఘా సంస్థలు దాడులకు తెగబడిన సందర్బాలు కోకొల్లలు.

ఇరాన్ అణుకేంద్రంలో వినియోగించబడే సాప్ట్‌వేర్‌లోని కొన్ని లొసుగుల ఆధారంగానే అమెరికా, ఇజ్రాయిల్ ‘స్టక్స్‌నెట్’ వైరస్‍ను సృష్టించి సైబర్ దాడులతో ఇరాన్ అణుకార్యక్రమాన్ని దెబ్బతీశాయి. 2010లో N.S.A. నిఘా పరికరాలను సిరియాకు సరఫరా చేయించిన అమెరికా తరువాత చల్లగా సిరియా టెలికాం వ్యవస్థలోకి చొరబడింది.

2016లో రష్యా విదేశీ నిఘా విభాగంలోని ‘కోజి బేర్’ బృందం ఉక్రెయిన్‍పై దాడి చేసిందని ఆరోపణలున్నాయి. అనేక సందర్భాలలో వలె అమెరికా – రష్యా ‘సైబర్ ఆయుధ వనరుల కేంద్రం’ అని ఆడిపోసుకోవటం షరా మామూలే.

2020 డిసెంబరులో అమెరికాలో ఒక సైబర్ దాడి బయటపడింది. ఈ దాడికి ప్రణాళిక మార్చి – జూన్ మధ్యలోనే రచించబడిందని బయటపడింది. ‘సన్ బరస్ట్’గా పేర్కొనబడిన ఆ వైరస్ ఏకంగా 18,000 నెట్‌వర్క్స్‌ లోకి చొరబడింది. ఇంధనం, కామర్స్ వంటి పలు కీలక సంస్థలుగా వాటిని గుర్తించడం జరిగింది. డిసెంబరు 8న ‘ఫైర్ ఐ’ అనే సంస్థ మొదటగా దానిని గుర్తించింది. గుర్తించాక తీగె లాగితే డొంక కదిలి బయటపడ్డ విషయాలు దిగ్భ్రాంతి కలిగించాయి. ఓరియన్ సాఫ్ట్‌వేర్ లోకి ఆ ‘సన్ బరస్ట్’ మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. ఆ వైరస్ ద్వారా సమాచారాన్ని తీసుకున్న పి.సి.లన్నీ హాకర్స్ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ‘సోలార్ విండ్’ అనే నెట్‍వర్క్ సేవల సంస్థ మార్చి – జూన్‍ల నడుమ ఈ వైరస్‍కు గురికాగా, డిసెంబర్‌లో గాని బయటపడలేదు. అమెరికా వంటి దేశానికే అంతు చిక్కనప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వెనకబడి ఉన్న దేశాల పరిస్థితి ఊహించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here