టెడ్డీ బేర్

    0
    5

    [dropcap]”గ్రాం[/dropcap]డ్ మా, వేర్ is మై BEN? Ben! Ben! వేర్ అర్ యు?  ఎక్కడున్నావు?” అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుని వచ్చింది అనామిక.

    “అనామికా! ఏమైంది?” అంది గ్రాండ్ మా.

    ఇంతలో “గ్రాండ్ మా ఏంటి? అమ్మమ్మ అనాలని చెప్పనా?” అని అమ్మ కోప్పడింది.

    “సారీ! సారీ! అమ్మమ్మా! నా బెన్ కనపడటం లేదు. ఐ వాంట్ హిమ్.”

    “నీ బెడ్ క్రింద దాక్కున్నాడేమో చూసావా?” అంది అమ్మమ్మ.

    “అండర్ మై బెడ్. ఉండు చూసొస్తా” అని పరిగెత్తింది అనామిక.

    “అమ్మగారు! బెన్ ఎవరు? ఎప్పుడు వచ్చాడు?” అని అడిగింది పనిమనిషి రాధ.

    ఇంతలో అనామిక ఆనందంగా “అమ్మమ్మ! గ్రాండ్ మా! ఐ ఫౌండ్ బెన్” అంది.

    అనామిక చేతిలో ముద్దుగా ఉన్న చిన్న టెడ్డి బేర్ బొమ్మని చూసిన రాధ “బెన్ అంటే బొమ్మా? ఎవరో చిన్న పిల్లోడు అనుకున్నా” అంది ఆశ్చర్యంగా.

    “నో. బెన్ ఈజ్ నాట్ బొమ్మ. నా బెస్ట్ ఫ్రెండ్. యు నో” అంది అనామిక బెన్‌ని గుండెకి అదుముకుంటూ.

    “ఓకే! బెన్ దొరికాడు కదా! బ్రేక్‌ఫాస్ట్ తిను.”

    “సరే! మరి నా బెన్ కి కూడా ఇవ్వు. He likes boiled egg.”

    “సరే. నువ్వు తిను” అంది అమ్మ

    కొద్దిసేపటి తరువాత రాధ కూతురు రవళి వచ్చింది. ఆడుకోవటానికి ఎవరూ లేరని బోర్ ఫీల్ అవుతున్న అనామికకు రవళిని చూసి హ్యాపీగా అనిపించి “రవళీ! కం లెట్ అజ్ ప్లే” అంది.

    “ఏంటి? ఎక్కడికి?” అంది రవళి.

    “నా రూమ్ లోకి. బెన్, నేను, నువ్వు ఆడుకుందాము. ఓకే?”

    “అమ్మా! పాప పిలుస్తోంది వెళ్లి ఆడుకోనా?” అని రాధని, అమ్మమ్మ గార్ని పర్మిషన్ అడిగింది రవళి.

    “ఓకే!” అని అనంగానే ఇద్దరు రూంలోకి వెళ్లారు. అనామిక బొమ్మలు చూసిన రవళి ఆశ్చర్య పోయింది.

    “అమ్మో! ఎన్ని బొమ్మలో! టెడ్డి బేర్స్! 1,2,3, 10. ఎన్నో. అనామిక అన్ని నీవేనా?”

    “నావే” అంది గర్వంగా.

    “నీ బెన్ ని ముట్టుకోవచ్చా?”

    “నో. మై బేబీ బెన్. నేనివ్వ” అంటూ వీపు వెనక్కి దాచేసింది బెన్‌ని.

    “సర్లే! ఆడుకుందాము.”

    కొద్దిసేపు బొమ్మలతో ఆడుకున్నారు. ఇద్దరూ 8 years old. ఆటకు కొద్దీ విరామం ఇచ్చారు. అమ్మ ఇచ్చిన స్నాక్స్ తింటూ అనామిక రవళి అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇస్తోంది. మనం విందామా ?

    “అనామిక! అనామిక! నీ బెన్ బొమ్మ ఎలుగ్గొడ్డులా ఉంది.”

    “ఎలుగ్గొడ్డు! అంటే?”

    “అదే! బేర్. ఎలుగుబంటి” అంది రవళి

    “అదా! రవళీ నీకు టెడ్డి బేర్ స్టోరీ తెలీదా?”

    “స్టోరీ? తెలీదు. ప్లీజ్! ప్లీజ్! చెప్పవా?” అని రిక్వెస్ట్ చేసింది రవళి.

    “సరే విను. గ్రాండ్ మా చెప్పిన స్టోరీ నీకు చెబుతా. టెడ్డి బేర్ అంటే స్మాల్ బేర్ అదే బేబీ బేర్‍ట. లాంగ్ లాంగ్ ఎగో… చాలా చాలా కాలం రోజుల కిందట టెడ్డి బేర్ రష్యాలో చాలా ఫేమస్. అప్పటికి అమెరికా, ఇంకా వేరే దేశాల్లో దాని గురించి తెలీదు. రష్యాలో పిల్లలు ఆడుకోవటానికి బేబీ బేర్ బొమ్మలు అమ్మలు చేసి ఇచ్చేవారు. అమ్మ చెప్పింది రవళీ” అంది అనామిక.

    “అవునా?”

    “ఎస్. విను.”

    “రష్యా folk stories అంటే లోకల్ స్టోరీస్ లో బేర్ అండ్ బేబీ బేర్ హీరో లు. నీకు మాషా అండ్ బేర్ కార్టూన్ తెలుసా? చాలా బాగుంటుంది. ఐ విల్ షో యు. బేర్ టాయ్స్ పెద్దవాళ్ళకి కూడా గిఫ్ట్స్‌గా ఇస్తారట.”

    “అనామికా! అంటే బర్త్ డే, ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ అవునా?” అంది రవళి.

    “ఎస్. అలాగే. బేర్ బొమ్మ కధల్లో మంచి చేడు గుడ్ అండ్ బాడ్ పనులు చేస్తే ఏమి అవుతుందో చెప్పారు.”

    “అవునా. నాకు ఎలుగ్గొడ్డు కథలు చెప్పు. ప్లీజ్. ప్లీజ్” అని అడిగింది రవళి.

    “మరి బేబీ బేర్ కి టెడ్డి బేర్ అని ఎవరు పేరు పెట్టారు?” అంది రవళి.

    “రవళీ! మా అమ్మమ్మ టెడ్డి బేర్ నేమ్ అదే పేరు గురించి చాల లోకల్ స్టోరీస్ ఉన్నాయి, ఒకటి చాల ఫేమస్ అంది. అమెరికా 26 ప్రెసిడెంట్ Roosevelt కి గుర్తుగా పెట్టిన పేరుట. 1901-1909 లో జరిగిన స్టోరీ.”

    “1901? అబ్బో! ఇప్పుడు 2020 కదా!” అంది రవళి.

    “అవును. సో లాంగ్ కదా. సరే విను. మధ్యలో మాట్లాడకు. Roosevelt గారి ని ఫ్రెండ్స్ టెడ్డి అని ప్రేమగా పిలిచేవారట. నన్ను పరి అని పిలుస్తారు కదా! 1902 November నెలలో ప్రెసిడెంట్ Roosevelt Mississippi లో బేర్‌ని వేటాడడానికి అందరితో వెళ్లారు. స్టాఫ్, ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ అందరు హార్స్ బ్యాక్ మీద రైడ్ చేస్తూ హంటింగ్ కి వెళ్లారు.”

    “గుర్రాల మీద వెళ్ళారా? ఎందుకు?” అంది ఆశ్చర్యంగా రవళి.

    “అయ్యో! రవళి! నీకేమి తెలీదు. ఓల్డెన్ డేస్‌లో… పాత కాలంలో మనకి ఉన్నట్లు కార్స్ వాళ్లకి లేవుట. అందుకు” అంది అనామిక.

     “అబ్బా! వినమన్నానా? వాళ్ళతో పాటు హంటింగ్ డాగ్స్ ఉన్నాయి. డాగ్స్ కి హంట్ చెయ్యటం, యానిమల్స్‌ని smell చేసి పట్టించటం వచ్చుట. Dogs were experts. బట్ ఆ రోజు ఎంత సేపు తిరిగిన వాళ్లకి ఒక్క బేర్ కూడా దొరకలేదుట. అలసిపోయి వాళ్ళ క్యాంపింగ్ టెంట్స్ దగ్గరకు వచ్చారు. రవళి you know what they saw?. వాళ్లకి ఏమికనపడిందో తెలుసా?

    చెప్తా విను. అక్కడ ఒక పెద్ద బేర్ ఇంకో బేబీ బేర్ చెట్టు మీద ఫుడ్ తింటున్నాయిట. అందరు Roosevelt ని బేర్‌ని హంట్ చెయ్యమని చెప్పారు. వాళ్ళ అరుపులు విన్న బేర్ భయంతో బేబీని తీసుకుని ఎస్కేప్ అవటానికి ట్రై చేసిందిట. అది చూసిన ప్రెసిడెంట్ పాపం! మదర్ అండ్ బేబీ బేర్ అని వాటిని సేఫ్‌గా వెళ్లిపొమ్మన్నారుట. మంచి వారు కదా, బేర్ ని చంపేస్తే పాపం బేబీ బేర్ కి ఫుడ్ ఎలా? అమ్మ కోసం ఏడుస్తుంది. పాపం.”

    “అవును. తరవాత ఏమైంది?”

    “ఇంకో ఫన్నీ విషయం తెలుసా? అమెరికన్, బ్రిటిష్ సైనికులు వార్ లో ఫర్ కోట్స్ వేసుకునేవారుట. వింటర్ లో అక్కడ చాలా చాలా కోల్డ్‌గా ఉంటుందిట. వాళ్ళు వాటిని హాయిగా ఉన్నాయని సరదాగా కోట్‌ని టెడ్డి అనేవారుట. ఫన్నీ people” అంది అనామిక.

    “సిల్లీ. టెడ్డి అంటే బేబీ బేర్ కదా? ఫర్ కోట్ ఎలాగా అవుతుంది?” అంది రవళి.

    “ఇంకా రవళి ఇది తెలుసా? ఒలంపిక్ గేమ్స్, వేరే గేమ్స్ లో టెడ్డి బేర్ ని ఒక mascot గా వాడతారుట.”

    “అంటే?” అంది రవళి.

    “అంటే అంటే ఆ! ఒక సింబల్ లా. 1972 లో ఒలంపిక్ లాంగ్ జంప్ ఛాంపియన్ Randi Williams టెడ్డి బేర్ టాయ్ పట్టుకున్న ఫోటో ని life magazine లో వేసారుట. మామ చెప్పారు. బేస్ బాల్ గేమ్ ప్లేయర్ Ron Bryant ని బేర్ అని పిలిచేవారు.”

    “అవునా? ఎందుకు?” అంది రవళి.

    “ఎందుకంటే ఎక్కడికి బేస్ బాల్ గేమ్ ఆడటానికి వెళ్లినా he used to carry his teddy బేర్. నా లాగా. like me. if don’t find my టెడ్డి బేర్ బెన్ ఐ విల్ క్రై. నీకు తెలుసా ? నాకు నా గ్రాండ్ మామ్ చెప్పింది టెడ్డి బేర్స్ లో రకాలు వెరైటీస్ ఉంటాయట.”

    “అంటే? సరిగ్గా చెప్పు” అంది రవళి.

    “కలర్స్, సైజులు స్పెషల్ గా ఉన్నవి. ప్రిన్సెస్ డయానా యూజ్ చేసిన టెడ్డి బేర్ రాయల్ పర్పుల్ కలర్. ఇంకా two flowers heart మీద ఉన్నాయిట. ఇంకా ఆ! Sometimes బేర్ బొమ్మలు చేస్తున్నప్పుడు స్మాల్ or బిగ్ డిఫెక్ట్స్ వస్తే వాటిని పక్కకి పెడతారట.”

    “అవునా? పాడైనవి పడేస్తాము కదా!” అంది రవళి

    “అవును. బట్ అలాంటి టెడ్డి బేర్స్ వెరీ కాస్ట్‌లీ. రవళి మనం చిల్డ్రన్ వి లైక్ టెడ్డి బేర్స్ కదా! మన బెస్ట్ ఫ్రెండ్ కదా! సో టెడ్డి బేర్ హీరో గా బోలెడు స్టోరీ బుక్స్ ఉన్నాయి తెలుసా. మై టెడ్డి taught me so many good habits like getting up ఎర్లీ, అండ్ షేరింగ్ is caring లాంటివి” అంది అనామిక

    “జల్దీ నిద్రలేవాలి, జల్దీ నిద్ర పోవాలి, ఇంకా హెల్ప్ చెయ్యాలి అని బెన్ చెప్పాడు తెలుసా?” అంది అనామిక తెలుగులో.

    “రవళీ! నాకు భయం వేస్తే నా టెడ్డి బెన్ ని గట్టిగా పట్టుకుంటాను. తెలుసా? మా గ్రాండ్ మామ్ ఛోటా బేబీ గా ఉన్నప్పుడు భద్రాచలం ఫారెస్ట్ లో రియల్ బిగ్ బేర్ ని చూసిందిట.”

    “ఏంటి, ఎలుగ్గొడ్డును చూసారా? అమ్మమ్మ” అంది రవళి ఆశ్చర్యంగా

    “You know ఆ బ్లాక్ బేర్ ఎదో ఫ్లవర్ తిని sleepy గా అయ్యి చెట్టు ఎక్కి డుబుక్కున కింద పడి నిద్రపోయిందిట. సిల్లీ బేర్.”

     ఇద్దరు బేర్ చెట్టు మీద నుండి క్రింద పడటం ఊహించుకుని గట్టిగా నవ్వుకున్నారు. హ హ హ

    “ఆ ! ఫ్లవర్ నేమ్ నేమ్ ఆ ఇప్పపూవు.”

    “ఇప్పపువ్వు?”

    “అవును. గ్రాండ్ మామ్ నాకు ఒక డ్రై ఫ్లవర్ ఇచ్చింది. తిన్నాను. స్వీట్ బట్ ఫన్నీ టేస్ట్.”

    “ఏంటి ఇప్పపువ్వు తిన్నావా? అమ్మమ్మ చిన్నప్పటి పువ్వు ఇప్పటి దాకా ఉందా?” అంది రవళి వింతగా.

    “అబ్బా! నీకేమి అర్ధం కాదు. అమ్మమ్మ ఫ్రెండ్ భద్రాచలం నుండి వన్ వీక్ బ్యాక్ తెచ్చి ఇచ్చిందిట.”

    “కిడ్స్ కి, బిగ్ పీపుల్ కి టెడ్డి బేర్స్ గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా? ఐ గాట్ మెనీ. మై ఫస్ట్ టెడ్డి నేను 9 మంత్స్ బేబీ గా ఉన్నప్పుడు విక్టోరియా ఆంటీ ఇచ్చింది. నా దగ్గర 10 టెడ్డీలు ఉన్నాయి. మా అమ్మకి చాల ఉన్నాయి. అవన్నీ నావే” అంది అనామిక

    ఇంతలో అక్కడికి అమ్మ వచ్చి బేర్స్ కబుర్లు విని. “అనామికా, రవళీ మీకు ఇంకొన్ని ఫ్యూ మోర్ బేర్ ఫాక్ట్స్ చెబుతా వినండి” అంది అమ్మ.

    “హే! అమ్మ గోయింగ్ టు టెల్ మోర్ అబౌట్ బేర్” అంది అనామిక.

    “మనం విందామా?”

    “ప్రతి ఏడాది నవంబర్ 7 డేట్ నాడు హాగ్ ఏ బేర్ డే గా సెలెబ్రేట్ చేస్తారు.”

    “Hug a bear day! Wow! What to do on that day? అంది అనామిక

    “ఒక టెడ్డి బేర్ టాయ్ ని hug చేసుకోవాలి. ఫ్రెండ్స్ అందరు బేర్ హగ్ చేసుకోవాలి. అంటే బేర్ లా గట్టిగ హాగ్ చెయ్యాలి.”

    “అమ్మా! It’s fun. ఐ విల్ కాల్ మై ఫ్రెండ్స్ ఆన్ Saturday తో ప్లే బేర్ హాగ్” అంది అనామిక. “రవళి నువ్వు కూడా రా !” అంది.

    అమ్మ చెప్పటం కంటిన్యూ చేసింది

    “అనామికా! నేను నీకు చెప్పిన గోల్డిలాక్స్ అండ్ ది త్రి బేర్స్ స్టోరీ గుర్తుంది కదా! ఆ స్టోరీని Robert Southey అనే స్టోరీటెల్లర్ ఆర్ స్టోరీ రైటర్ ఇంగ్లాండ్‌లో 1837లో రాసాడు. “

    “అమ్మా నాకు స్టోరీ తెలుసు. రవళీ చెప్పనా?”

    “సరే.”

    “ఒక డీప్ జంగల్ లో ఒక చోట పెద్ద,చిన్న,, బుల్లి బేర్స్ వాళ్ళ ఇంట్లో ఉండేవి. అవి చాలా మంచివి. వెరీ గుడ్ మానర్స్, హెల్పింగ్, ఫ్రెండ్లీ, నమ్మకమైనవి. ముగ్గురికి డైనింగ్ టేబుల్, చైర్స్, ఫుడ్ బౌల్స్ ఇంకా! ఆ! పడుకోవటానికి బెడ్స్ ఉన్నాయి. ఒక రోజు అవి porridge చేసుకున్నాయి. యు నో రవళి ? It’s yummy!” అంది అనామిక.

    “నీకెలా తెలుసు? నువ్వు తిన్నావా?” అంది రవళి.

    “నో! బట్ ఐ నో” అంది అనామిక.

    అమ్మ నవ్వుకుంది.

    “ఆ yummy porridge వెరీ హాట్ వేడిగా ఉంది. చాలా చాలా. అందుకని ఆ ముగ్గురు బేర్స్ అడవిలోకి ఫ్రూప్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చేలోగా ఒక వెరీ బాడ్ విమెన్ వచ్చింది అక్కడికి. ఆవిడ వాళ్ళ ఫామిలీ వదిలి అడవిలో తిరుగుతోంది.”

    “అయ్యో ఎందుకు? పాపం” అంది రవళి.

    “నో she was very bad. అందరిని కొట్టి, తిట్టి, అన్ని spoil చేసి లైక్ దట్. Bears ఇంట్లోకి తొంగి చూసి టేబుల్ మీద ఉన్న ఫుడ్ చూసి దొంగల డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లి ఒక బేర్ ఫుడ్ తినేసి, ఒక చైర్ విరగ్గొట్టి నిద్రవస్తే

    ఒక బెడ్ మీద పడుకుంది. ఇంటికి వచ్చిన bears జరిగింది చూసి upset అయ్యారు. ఎవరో వచ్చారు” అంటూ “వెతకండి” అన్నారు.

    “ఈ లోపల ఆ ఓల్డ్ బాడ్ లేడీ విండో లోంచి దూకి దొరక్కుండా పారిపోయింది. మళ్ళీ రాలేదు. ఇంతేనా అమ్మా స్టోరీ?” చెప్పింది అనామిక.

    “ఎస్ బేబీ.  ఓకే నెక్స్ట్ వినండి” అంది అమ్మ.

    “1906 లో first time oxford డిక్షనరీ లో టెడ్డి బేర్ అని వాడారు. బేర్ టాయ్స్ లో కొన్ని అంటే stuffed కానివి కూడా ఉంటాయట. వాటిని bruins అంటారట. 1924 లో Disney Alice and 3 bears అనే ఫస్ట్ animated color film produce చేసింది.”

    “అమ్మా మన బేర్ ఎలా ఉంటుంది?”

    “బేర్ కి నల్లని పొడవాటి జుట్టు ఉంటుంది. బ్లాక్ కోట్. Long muzzle, బిగ్ lips v shaped వైట్ ప్యాచ్ చేస్త మీద ఉంటుంది. నేను మా విలేజ్ కి వెళ్ళినప్పుడు ఒక ఎలుగు బంటిని ఆడిస్తున్న వ్యక్తి శంభయ్యని చూసాను. తాడుతో కట్టి ఉంది. శంభయ్య చెప్పినట్లు డాన్స్ చేస్తున్నది. చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తున్నారు. పాపం బెదిరినా డాన్స్ ఆపలేదు. దాని కళ్ళలో బాధ. May be missing family. డాన్స్ చూస్తున్న వాళ్ళు కొంతమంది మనీ అండ్ ఫ్రూప్ట్స్ ఇచ్చారు. బేర్స్ పండ్లు, గడ్డి, గింజలు, యాంట్స్, హనీ, విప్పా పువ్వు లాంటి స్వీట్ ఫ్లవర్స్, insects larva లాంటివి తింటాయిట. శంభయ్య లాంటివాళ్లు బేర్ ని పట్టుకుని ఫుడ్ ఇవ్వకుండా ఏడిపించి చెప్పినట్లు వినేలా చేస్తారు. Poor bear.so sad” అంది అమ్మ

    “అనామిక నీకు తెలుసా? Olden days లో kings’ court లో kalandars అనే nomad / దేశ దిమ్మరి వాళ్ళు bears తో రక రకాల విన్యాసాలు చేయించి మనీ తీసుకునే వాళ్ళు. bears ని పట్టుకోవటానికి పోచర్స్ మదర్ బేర్ ని చంపి babies ని పట్టుకెళ్లి ట్రైన్ చేస్తారుట. వాళ్ళు బేర్ ని తాడుతో కట్టటానికి వాటి ముక్కు నోస్ లోకి హాట్ మెటల్ రాడ్ తో హోల్ చేసి తాడు పెట్టి కడతారు. తాడు లాగితే పెయిన్ కి అవి ఆడుతాయి.”

    “అమ్మా! They are very bad people. So cruel” అంది అనామిక కోపంగా.

    “అవును. వాళ్ళని కొట్టాలి” అంది రవళి.

    “అమ్మా! Can’t we save bears?”

    “తప్పకుండా. కానీ selfish people development పేరుతో…”

    “అంటే ఏమిటి?” అని మధ్యలో అడిగింది అనామిక.

    “నీకు తెలిసేలా చెప్పాలంటే బిగ్ బిల్డింగ్స్, మాల్స్, రిసార్ట్స్, ఫ్యాక్టరీస్, మైనింగ్ కోసం ఫారెస్ట్ ని కట్ చేస్తున్నారు. సో అడవిలో ఉండే యానిమల్స్ బర్డ్స్, అల్ క్రీచర్స్ వాటికీ ఉండటానికి హౌస్/ప్లేస్ లేక వాటికి ఫుడ్, వాటర్ దొరక్క చనిపోతున్నాయి. కొన్ని ఏనుగులు, బేర్స్, మంకీస్, snakes లాంటివి మనం ఉన్న చోటికి ఫుడ్ వెతుక్కుంటూ వస్తే మనం వాటిని భయపెట్టి వెళ్ళగొడతాము. లేదా చంపేస్తాము. పాపం! ఫారెస్ట్ వాటిది. బట్ మనుషులు అన్ని నాకే అని ప్రకృతిని, పర్యావరణాన్ని పాడుచేస్తునారు” అన్నది అమ్మ బాధగా.

    “రియల్ బేర్ ని చంపేస్తాము. టెడ్డి బేర్ ని లవ్ చేస్తాము. Worldwide bears పెద్ద సంఖ్యలో చనిపోయాయి. లాక్స్ లో ఉండే బేర్స్ హ్యాండ్రేడ్స్ లోకి వచ్చేయి. ప్రభుత్వాలు, క్లైమేట్ చేంజ్ లీడర్స్, ngo లతో ప్రజలు కూడా కలిసి ఒక ఉద్యమం లాగా సేవ్ ఫారెస్ట్, సేవ్ వైల్డ్ అనిమల్స్, సేవ్ బేర్స్ అని గట్టిగా అడిగి వాటిని కాపాడే చర్యలు తీసుకోవాలి.”

    “అమ్మా, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి సేవ్ ఎర్త్, సేవ్ వైల్డ్ అనిమల్స్, సేవ్ ఫారెస్ట్, సేవ్ వాటర్ అని పోస్టర్స్ చేసి స్కూల్లో చూపిస్తా. అంకుల్ నేచర్ క్లబ్‍లో జాయిన్ అవుతాము. వియ్ సేవ్ నేచర్. ఓకే. హ్యాపీ” అంటూ అనామిక అమ్మని హాగ్ చేసుకుని కిస్ చేసింది ప్రేమగా.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here