డా. మైనేపల్లి ప్రభావతీ దేవి గారికి నివాళి

0
11

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి డా. మైనేపల్లి ప్రభావతీ దేవి గారు 18-09-2022 నాడు హైదరాబాదు లోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు.

డా. ఎం. ప్రభావతీ దేవి గారు సంచికలో ‘దివి నుంచి భువికి దిగిన దేవతలు’ అనే పాఠకాదరణ పొందిన వ్యాస పరంపరని అందించారు.

ప్రభావతీ దేవి మైనేపల్లి వెంకటేశ్వర్, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు 25-05-1944న శ్రీకాకుళంలో జన్మించారు. వారి తండ్రి గారు అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీకాకుళం పవర్ హౌస్‌లో ఇంజనీరుగా పనిచేసేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాకా, 1954 తరువాత వారి కుటుంబం విజయవాడకి మారింది. ప్రభావతీ దేవి మేరీ స్టెల్లా కాలేజీలో తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తమ వదిన గారు అనారోగ్యం పాలయి కొంతకాలం మంచానికే పరిమితం అయినప్పుడు ప్రభావతీ దేవి రాంచీ వెళ్ళి ఆవిడకి సేవలు చేశారు. ఆ కాలంలో రాంచీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

తదుపరి చీరాలలో ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంగ్లీషు లెక్చరర్‍గా చేరారు.

ఎంఫిల్, ఆ పై పిహెచ్‌డి చేసేందుకు ప్రభావతీ దేవి హైదరాబాదులోని CIEFL లో చేరారు.

ఆమె ఇంగ్లీషు లెక్చరర్‌గా వెంకటగిరి, నిజామాబాద్, నెల్లూరులలో పని చేశారు.

 

‘English for All’, ‘నేను – మూడు శరీరాలు’, ‘దివి నుంచి భువికి దిగిన దేవతలు’ అనే పుస్తకాలు వెలువరించారు.

కంచి కామకోటి పీఠం పరమచార్యకి ప్రభావతీ దేవి గారు భక్తురాలు. ఎన్నో ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

  సంచిక ప్రభావతి గారికి అత్యంత ఇష్టమయిన పత్రిక.  భారతీయ  సంస్కృతి సాంప్రదాయాల పట్ల  అచంచల విశ్వాసమూ,  గౌరవమున్న    ప్రభావతిగారు సంచిక కోసం ఎంతో ఇష్టంగా, ఆప్యాయంగా రచనలు చేశారు. ఆమె  ఆత్మకు  సద్గతులు కలగాలని   సంచిక భగవంతుడిని ప్రార్ధిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here