సరికొత్త కవితా ప్రక్రియ – ‘వాక్కు’ – త్వరలో – ప్రకటన

0
15

[dropcap]శ్రీ [/dropcap]రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కు’ త్వరలో సంచికలో ప్రచురితమవుతున్నది.

~

ప్రక్రియ అనే పదానికి ఇంగ్లిష్‌లో method, pattern, process, procedure, manner, technique,  form వంటి పదాలు నిఘంటువుల ద్వారా తెలియజెయ్యబడుతున్నాయి. సాహిత్యం పరంగా కవిత పరంగా form అన్న పదం ప్రక్రియ అన్న పదానికి సరైన ప్రత్యామ్నాయం. ఇంగ్లిష్‌లో ప్రామాణికమైన Karl Beckson, Arthur Ganz  LITERARY TERMS – A DICTIONARY పుస్తకం form గుఱించి ఇలా‌చెబుతోంది: 1. A fixed metrical arrangement, such as the sonnet form or the Ballade form. 2. The essential structure of a work of art  ….. … The form of a successful work of art is, as Coleridge said, shaped from within, not imposed from without. కవితాప్రక్రియ అంటే type of form of poetry.  మౌలికంగా కవితాప్రక్రియ అన్నది a form of poem (ప్రక్రియ అంటే Genre కాదు).

ప్రక్రియ అంటే “శబ్ద రూపము కలిగిన విధము” అని నిఘంటువులు సూర్యరాయాంధ్ర, శబ్దరత్నాకరము తెలియజేస్తున్నాయి. ప్రత్యేకాంశాలతో ‘నిర్ణీతమైన విధం’ ఉన్న ఒక రూపం మాత్రమే ప్రక్రియ ఔతుంది.  నిర్ణీతమైన విధం (fixed arrangement) లేనిది ప్రక్రియ కాదు. నాలుగు, ఆఱు లేదా కొన్ని పంక్తుల్లో ఉండే మామూలు రూపాలు ప్రక్రియలు అవవు. Form వేఱు format వేఱు. రూపం ప్రక్రియ కాదు. కొన్ని పంక్తుల్ని ఒక పేరుతో రాయడం కవితాప్రక్రియ అవదు. రూపం వేఱు ప్రక్రియ వేఱు. పద్యం, వచన‌కవిత, ప్రపంచపది, గజల్, రుబాయీ, హైకు, చిత్రకవిత. బంధకవిత వంటివి కవితాప్రక్రియలు. ఆ కోవలో రోచిష్మాన్ రూపొందించిన ఒక కవితాప్రక్రియ ‘వాక్కు’.

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30అక్షరాలలోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక బావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండోవరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

ఆసక్తి అన్న అర్హతతో చేస్తున్న ఈ  ప్రయత్నాన్ని ఆశీర్వదించమని అందఱినీ కోరుకుంటున్నారు కవి  రోచిష్మాన్.

~

వాక్కులు – వచ్చే వారం నుంచి

సంచికలో చదవండి…….చదివించండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here