[dropcap]తె[/dropcap]లుగువారి అభిమాన రచయిత్రి ‘బలభద్రపాత్రుని రమణి’ రచించిన ‘వైకుంఠపాళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.
***
మాళవికకి నందినిని చూస్తున్నకొద్దీ తనేం పోగొట్టుకుందో తెలిసింది.
“నందినీ… నందినీ డార్లింగ్!” అంటూ శశిధర్ ఆమెని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా వెంట తిరుగుతున్నాడు.
ఇద్దరూ కళ్ళతో చిలిపి సైగలూ, నవ్వులూ… ప్రపంచంలోని ఆనందం అంతా వాళ్ళే స్వంతం చేసేసుకున్నట్లు కనిపించారు.
ఓ రెండు గంటలు వాళ్ళతో కలిసి గడపడం మాళవికకి కష్టం అయిపోయింది.
“నే వెళ్తానే!” అంది.
“ఆగు… ఈ రాత్రికి వుండిపో” అని నందిని బలవంతం చేసింది.
మాళవిక శశిధర్ వైపు చూసింది.
తెల్లని లాల్చీ పైజామాలో దృఢంగా అందంగా వున్న అతని చూడగానే అతని ద్వారా తను పొందిన అవమానం గుర్తొచ్చింది.
***
ఈ సరికొత్త ధారావాహిక… సంచికలో… వచ్చే వారం నుంచి.