వక్త-2

0
10

[box type=’note’ fontsize=’16’] “శ్రోతల మెచ్చుకోలే వక్తగారికి ఉత్సాహం మరి!” అంటూ, ఆ గదిలో ఏం జరిగిందో వివరిస్తున్నారు భువనచంద్ర ‘వక్త-2’లో. [/box]

గది తలుపులు తెరుచుకునేంత వరకూ దుఃఖం
తెరుచుకున్న మరుక్షణం మందస్మితం
సౌండ్ ప్రూఫ్ తలుపు వెనుక
సైకలాజికల్ ట్రీట్‌మెంట్.

“అప్పుడేమయిందో తెలుసా?”
వక్తగారి కళ్ళ మెరుపు.
“ఏమయిందేమిటీ?”
శిష్యుల కుతూహలం.

“నువ్వంటే భయం లేదు పొమ్మన్నాను.
నీ ఇష్టం వచ్చింది చేసుకో – అన్నాను.
మాట్లాడితే మక్కె విరుగుతుందన్నాను
కళ్ళు తేలేసి తలదించుకున్నాడు.”

వర్ణించాడు వక్త.
వెర్రెత్తారు శిష్యులు.

“భలే అన్నావ్ గురూ…
ధైర్యమంటే నీదే!”
శ్రోతల మెచ్చుకోలే
వక్తగారికి ఉత్సాహం మరి!

“మరి నిన్నేమీ అనలేదా?”
అనుమానప్పక్షి కుతూహలం.

“ఎందుకనలా?
సారీ సారీ అన్నాడు.
పొరపాటయిందని
పొడిదగ్గు దగ్గాడు.”
సందేహం తీర్చాడు వక్త.

వచ్చింది శ్రోతలకు హుషారు
క్రెడిట్ కార్డు కొచ్చింది బేజారు.

నవ్వినవాడొకడైతే
మెచ్చినవాళ్ళైదురుగు.
‘మందు’ అని ఒకడంటే
‘మాక్కూడా’ అన్నారు మరొకరు.

అన్ని శరీరాలు కాళ్ళ మీద నిలబడ్డాయి.
వక్తగారి పర్సుకి కాళ్ళొచ్చాయి.
అర్ధరాత్రికి అన్ని గ్లాసులు ‘ఢీ’కొన్నాయి.
అర్ధచంద్రుడు మబ్బుల్లో ఆవలించాడు.

***

చెప్పింది ఒకటైతే
జరిగింది మరొకటి.

తలుపు వెనుక ఆఫీసర్ చేతుల్లో
బ్రెయిన్ వాషూ
తలుపవతల శిష్యుల చెతుల్లో
పర్సు వాషూ.

లెక్కా జమా చూస్తే
మిగిలింది
మూడువేల తిట్లు
ముగ్గురి నలుగురి
అభినందనలూ.

మందు తాగి మరిచిన బాధ
మళ్ళీ ముందుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here