వామ్మో… !

0
9

[dropcap]రా[/dropcap]యండి అని ఒకరడిగారు

రాతిరంతా
రాతిరిని అడుగుతూనే ఉన్నా
గడ్డం పట్టుకుని బతిమాలుతూనే ఉన్నా
ఓ కవితనివ్వమని

కమ్మని కౌగిలినిచ్చింది
కమనీయమైన కలలనిచ్చింది
అలసటతీరేంత
హాయైన ఆదమరపు నిదురనిచ్చింది
కానీ … కానీ కవితనీయలేదు
ఏ రమణీయార్థమూ మదిలోకి రానీయలేదు
చల్లగా కాలం గడిపి
చీకటి చక్కగా చెక్కేసింది..!!

ఉదయాన్నే ఉషోదయాన్ని
ఉల్లాసంగా హుషారైన విష్ చేశా

కాఫీ కప్పుతో ఓ కవితను నాకందించి
కన్నుగొట్టి వెళ్ళిపోయింది
కొంటెగా నా వంక చూస్తూ….
నేనుండగా రాతిరితో రాగాలెందుకూ
సరసాలూ సరాగాలెందుకూ అంటూ
అలా… ఓ సన్నాయినొక్కుల దీర్ఘం తీస్తూ….
వామ్మో….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here