వాన చినుకు ప్రయాణం

0
2

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా వానల గురించి, వర్షాలెలా పడతాయో బొమ్మలు గీసి పిల్లలకి సులువుగా అర్థమయ్యేలా కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]చి[/dropcap]న్నారి ప్రకృతి బెడ్‌రూమ్ కిటికీ నుండి ఆకాశంలో ముసురుతున్న నల్లని వాన మబ్బుల్ని చూస్తున్నది. ప్రకృతికి తెలుసు కొద్దిసేపటిలో వాన కురుస్తుందని. చాల రోజులుగా వాన చినుకుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. వాన చినుకు, ప్రకృతి పాప స్నేహితులు. పిల్లలు, వాన చినుకులు ఎప్పటినుండో నేస్తాలు కదా.

తొలి వాన చినుకు పాప బుగ్గ మీదపడి పలకరించింది. ప్రకృతి ఆనందంతో ఎగిరి గంతేసింది. ప్రకృతి తన నేస్తాలయిన వాన చినుకులను “ఇన్ని రోజులు మీరు ఎక్కడకు వెళ్లారు? మీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా?” అని అడిగింది.

“మా చిన్ని నేస్తమా! మేము ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణిస్తున్నాము. నీలాంటి చిన్ని నేస్తాలను, రైతులను, ప్రజలను, ప్రాణులను పలకరించి వస్తున్నాము” అన్నాయి వాన చినుకులు.

“ప్రకృతీ! మేము ఎక్కడ నుండి ఎలా ఇక్కడకు వచ్చామో తెలుసా? ”

“తెలీదు. ఎలా? చెప్పండి. ప్లీజ్” అంది ప్రకృతి.

“విను. మేము అంటే వాన చినుకులం. మమ్మల్ని నీరు అని కూడా అంటారు. ఈ భూమి మీద అనేక రూపాల్లో ఉన్నాము.”

“అంటే ఎలా?” అంది ప్రకృతి.

“ఎలా అంటే నదుల్లో, సముద్రాలూ, చెరువులు, బావులు, మంచు అదే స్నో, వాన చుక్కల్లో ఉంటాము. మా ప్రయాణంలో మొదటి స్టెప్ సూర్యుడు వేడెక్కి నీటిలో ఉన్న మమ్మల్ని ఆవిరి రూపంలోకి మార్చి భూమి ఫై పొరల్లోకి తీసుకెళ్లటంతో ప్రారంభం అవుతుంది. దీన్నే ఆవిరి అవటం అంటారు. ఎవాపరేషన్.

మాలాగే లెక్క లేనన్ని నీటి చుక్కలు నీటి ఆవిరిగా మారి ఆకాశంలో కదులుతున్న మబ్బుల్లోకి చేరుతాయి.

తరువాతి స్టెప్ మాలాగే ఆకాశంలోకి వచ్చిన నీటి ఆవిరి మబ్బుల్లో చేరి మబ్బులు కదలలేకుండా చేస్తాయి. అప్పుడు నీటి చినుకులతో నిండిన నల్లని మబ్బులు బరువెక్కి నీటి ఆవిరిని మొయ్యలేక ప్రసవ వేదన పడే తల్లిలా ఉరుములు, మెరుపులు, గాలితో మమ్మల్ని వేగంగా భూమి మీదకు నెట్టి వేస్తాయి. మేమందరం వేగంగా భూమి మీద కురుస్తాము.

  

తిరిగి నదులు, చెరువులు, సముద్రాలూ, నేల పొరల్లోకి చేరుతాము. దీన్ని వర్షపాతము లేదా వాన కురవటం అంటారు.

వాన కొన్నిసార్లు మంచుగా, పొగ మంచుగా, వడగళ్ళులా అదే ఐస్ ముక్కల్లా కురుస్తుంది. నీరు, భూమి మీద ఉన్న జీవులందరికీ, వనాలకు మేము ఆత్మీయ బంధువులం. వాన, నీరు లేని ప్రాంతాన్ని ఎడారి అని పిలుస్తారు.

మా చిన్ని నేస్తం ప్రకృతీ! ఈ మా ప్రయాణాన్ని వాటర్ సైకిల్ అంటారు. భూమి పై కురిసే వాన నీరు చాలా ఉంటుంది. కానీ తాగటానికి దొరికే పనికి వచ్చే నీటి శాతం ఒక్క శాతం మాత్రమే.

వర్షపాతం అన్ని చోట్ల ఒక్కలా ఉండదు. అందుకు అనేక కారణాలు. వాటిలో కొన్ని అడవులు నరికివేసిన చోటులో వాన సరిగా పడదు. అందుకే అడవులను పెంచాలి. నీరు ఆవిరి అయిన చోటే వాన పడుతుందని ఖచ్చితంగా చెప్పలేము.

నీటి లభ్యత తక్కువగా ఉండటంలో మరో కారణం మీరు అదే మనుషులు… నీటిని వివిధ రకాలుగా కలుషితం అంటే మురికి చేస్తారు. చెరువుల్లో జంతువులూ కడగటం, బట్టలు ఉతకటం, ఫ్యాక్టరీల వ్యర్ధ, మురుగును నదులు, కాలవలు, భూమిలోకి వదలటంతో నీరు పాడై మనుషులు, జంతువులూ చెట్లు, పక్షులకు పనికి రాకుండా పోతున్నది.

అంతే కాదు, నీటిని వృథాగా పరబోయటం కూడా ఎక్కువే. మానవ తప్పిదం వల్ల మీరే కాదు భూమి, ప్రాణులకు ప్రాణ సమానమైన నీటిని నాశనం చేస్తున్నారు.

మీకు తెలుసా, ఆఫ్రికా దేశాలలో నీటి కోసం ప్రజలు  చాలా దూరం వెళ్తున్నారు. ఆసియాలో కూడా అంతే.

చిన్ని నేస్తమా! మీ తరమైనా మమ్మల్ని పొదుపుగా వాడి ప్రకృతిని కాపాడండి. నీటిని  పొదుపుగా వాడి, శుభ్రపరచి, తిరిగి వాడుకొని ఆనందంగా ఉండండి. భూమి మీద హక్కు మనుషులు ఒక్కరికే కాదు. ఇతర జీవులకూ ఆ హక్కు ఉంది. మీరు జీవిస్తూ, ప్రకృతిలో భాగమైన ఇతరులనూ బ్రతకనివ్వండి.

ఓహ్! మాటల్లో పడిపోయాము. ఆహ్! వాతావరణం వేడేక్కుతున్నది. మా ప్రయాణం మళ్ళీ మొదలు అయ్యింది. బై! ప్రకృతీ” అని వాన చినుకులు ఆవిరిగా మారి మబ్బుల్లోకి వెళ్ళాయి.

“బై! ఫ్రెండ్స్. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవాలని అనుకుంటున్నా. సీ యూ సూన్” అని వీడుకోలు పలికి వాన చినుకులు చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ వానలో తడిసిన ప్రకృతి అమ్మ పిలుపుతో ఇంట్లోకి వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here