వందేమాతరం-5

0
7

[box type=’note’ fontsize=’16’] భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానికాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]మ[/dropcap]రుదినం అడవిలో కూడలి మార్గం (చౌరస్తా) అయిన ముత్యాలమ్మ వాగువద్ద తన వారందరితో సమావేశమైన శివయ్య, “బ్రిటిష్ సైనికులు అడవి మార్గంలో ప్రవేశించగానే ‘సోమన్న’ పశువు అరుపుతో మనలను హెచ్చరిస్తాడు, ముత్యాలమ్మ వాగు పరి సరాలలో ఉన్న మీరంతా ఇలా దాడి చేయాలి” అని ప్రతి ఒక్కరికి వారి వారి పనులు అప్పగించాడు. “ఈరోజు నుండి ఇద్దరు యువకులు అడవి దారికి రాత్రులు కావలి కాయాలి. కొండపైన స్ధావరానికి నేను, చంద్రన్న రాత్రులు  కావాలి కాస్తాము. ఇదే మనందరం చివరసారి కలుసుకోవడం, మీకు కేటాయించిన స్ధానాలలో మీరు ఉండి పొవాలి, మీ అందరికి ఆహారం ప్రతిరోజు ఇక్కడికే ఇదే జమ్మిచెట్టు కొమ్మకి బుట్ట వేలాడ దీయబడి ఉంటుంది, మరెవ్వరికైనా సందేహాలు ఉంటే అడగండి” అన్నాడు శివయ్య.

“ఎటువంటి సందేహాలు లేవు అన్నా, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాం, ఎట్టి పరిస్ధితులలోనూ ప్రాణాలపై తీపితో వెనుక అడుగు వేయమని ఈ ముత్యాలమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం” అన్నాడు ఓ యువకుడు.

అంతా అతని చేతిపై చేయి ఉంచి ప్రమాణం చేసారు.

ఏర్పాట్లు అన్ని మరో పర్యాయం పరిశీలించి, చంద్రయ్యతో రహస్య స్ధావరం చేరాడు శివయ్య.

తమ సైనికుల మరణ వార్త విన్న కలెక్టర్ మండిపడుతూ శివయ్యను బంధించి గాని,శవంగా గాని తెచ్చిన వారికి పదివేల రూపాయలు బహుమతి ప్రకటించాడు. వెంటనే మూడువందలమంది సైనికులను, మందుగుండు సామాగ్రి, పాలెం దారిచూపే వారితో కలసి బయలు దేరాడు.

***

బాలలు ఇక్కడ మనం భారత దేశ చరిత్రగురించి తెలుసుకుందాం!

క్రీ.శ. 1600 డిసెంబర్ 31 న ఈస్టిండియా కంపెనీ మెదలయింది.1608 గుజరాత్ లోని సూరత్‌లో మొదటి స్ధావరం ఏర్పాటు చేసుకున్నారు. ఆంద్రప్రదేశ్ మచిలీపట్నంలో ‘కోరమండల్ కోస్టు’ అనే ఫ్యాక్టరీ నిర్మించారు.

1612లో బెంగాల్లో ‘యూరోపియన్ ట్రేడింగ్’ కంపెని ప్రారంభించారు. 1640 లోమద్రాసు ప్రసిడెన్సీలోనూ,1687 బొంబాయి ప్రెసిడెన్సీలోనూ,1690లో బెంగాల్ ప్రెసిడెన్సీలోనూ, వ్యాపారాల పేరున స్ధరపడ్డారు.

భరతభూమిపై అడుగిడిన పాశ్యాత్యులు వర్తకం పేరిట నాటి మొగల్ పాలకులను మోసగించారు. మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన చివరిరాజు ‘షాఅలం’ తరువాత ఢిల్లీ పాలకులు బలహీనులుగా మారారు. అప్పటివరకు అఖండభారతంగా ఉన్న భారతావని చిన్నచిన్నరాజ్యాలన్ని స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఇది ఆంగ్లేయులకు మంచి అవకాశం అయింది. వారు నాటి రాజులలో అనైక్యత, ప్రలోభాలు కల్పించి భారతదేశాన్ని తమ స్వాధీనంలోనికి తెచ్చుకున్నారు. పాండిచ్చేరిలో ప్రెంచ్ స్ధావరం 1674లో ఏర్పడింది.ప్రెంచ్ గౌర్నర్’ డ్యూమాస్’ యుధ్ధంలో మహరాష్ట్రులను ఓడించాడు.

మారిషన్ దీవులనుండి బయలుదేరిన ప్రెంచ్ నౌకాదళం 1749 లో మద్రాసును స్వాధీన పరుచుకుంది. అనంతరం మద్రాసు బ్రిటీష్ వారు స్వాధీనపరుచుకున్నారు. 1763 ప్రెంచివారు పతనం ప్రారంభం అయింది.

1757లో బోబ్బిలి యుధ్ధం జరిగింది. ప్రెంచ్ వారు గెలిచినా, అనంతరం బ్రిటిష్ వారికి అధికారం దక్కింది. 1500 సంవత్సరంలో తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజ్యం పతనానంతరం, మైసూరు స్వతంత్రరాజ్యమై ఒడయర్ వంశస్తులు పాలించసాగారు.

1783 తరువాత ప్రెంచివారు భారదేశాన్ని వదలివెళ్లారు. వారు ముందుగా బెంగాల్ కోటపై కన్నువేసారు. ఆ కోటకు అధిపతిగా ఉన్న’సిరాజుద్దౌలా’ బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి భారతీయుడుగా చరిత్రలో స్ధానం పొందాడు.1757 లో జరిగిన ‘ప్లాసీ యుధ్ధం’లో బ్రిటీష్ వారు సిరాజుద్దౌలా రాజుకు వ్యతిరేకంగా ‘మీర్ జాఫర్’ అనే అతని సమీపబంధువుకు బ్రిటీష్ సేనలు మద్దత్తునిచ్చి మీర్ జాఫర్‌ను గెలిపించాయి. 1765లో ‘రాబర్ట్ క్లైవ్’ మూడవసారి గవర్నర్‌గా వచ్చాడు. 1767లో క్లైవ్ ఇంగ్లాడ్ వెళ్లి, 1774 లో ఆత్మహత్యచేసుకున్నాడు.

భారతదేశం నుండి బ్రిటన్‌కు ధనప్రవాహం ప్రారంభం అయింది. విదేశి వస్త్రాలు విరివిగా దిగుమతి కావడంతో, గ్రామీణ చేనేత కార్మికులు దిక్కులేని అనాథలైనారు. జమిందారీ వ్యవస్ధ బలపడింది. 1798లో అధికారం స్వీకరించిన ‘వెలస్లీ’ 1799లో మైసూర్ పై దాడి చేసాడు. అప్పుడు ‘టిప్పు సుల్తాన్’ మరణించాడు. 1795లో కర్నాటక నవాబు మహ్మద్ అలి చనిపోవడంతో రాజవంశాన్ని తప్పించి, యావత్తు సంస్ధానాన్ని కంపెని ఆక్రమించింది.

ముప్పై సంవత్సరాలు ఇండోర్‌ను ఆదర్శంగా పాలించిన ‘అహాల్యబాయి’ 1796లో మరణించడంతో, అనంతరం జస్వంతరావు హోల్కార్ దారిదోపిడి వాళ్ల సహాయంతో ‘పీష్వా బాజీరావు’ను ఓడించాడు. అలా యావత్తు మహారాష్ట్ర ఓటమి పాలైనది. 1833లో ‘విలియం బెంటిక్’ గవర్నర్ జనరల్ అయ్యాడు. రాజారామమోహనరాయ్‌తో కలసి ‘సతీ సహగమనం’ నిషేదించాడు.

1813లో ఆంగ్లభాష భారతదేశపు అధికారభాష అయింది. అప్పటివరకు ‘పర్షియన్’ అధికారభాషగా ఉండేది.

1857 సిపాయి తిరుగుబాటు జరిగింది. దానికి కారణం యురోపియన్ సైనికులకు ఎక్కువ జీతాలు భారతీయ సైనికులకు తక్కువ జీతాలు ఇవ్వడం, సుదీర్ఘ యుద్ధాలతో భారతీయ సైనికులలో అసంతృప్తి, వంటి పలు కారణాలు ఉండేవి. నాటి భారతీయ సైన్యంలో మొత్తం రెండు లక్షలు ఉండగా, నలభై అయిదు వేలమంది బ్రిటీష్ సైన్యం ఉండేది. ఆవు, పంది కొవ్వుతో తయారైన తూటాలను సైన్యంలో ప్రవేశ పెట్టడం, తోలుతో చేసిన టోపీలు ధరించమనడంతో హిందూ, ముస్లిం సైనికులలో ఆగ్రహం పెల్లుబికింది. ‘తిరుగుబాటు’ చేసారు. ‘మంగళ్ పాండే’ను 1857 ఏప్రెల్ 8న ఉరితీసారు.

1857 ముందుకాలంలో ఉన్న ఒప్పందాలను ఆంగ్లేయులు ఉల్లంఘించి, పన్నుల బకాయి పేరున, పరిపాలన లోపాల పేరుతో స్ధానిక పాలకులను అధికారం నుండి తొలగించారు. 1857లో మొదట బారక్‌పూర్‌లో సైన్యం తిరుగుబాటు చేసింది. త్వరలోనే అణగారి పోయింది. అనంతరం మీరట్‌లో మే 10 తేదిన సిపాయిలు తిరుగుబాటు చేసి చెరసాలలోని ఖైదీలను విడుదలచేసి, యూరోపియన్‌లను చంపివేసారు. అలా కాన్పూరు, లక్నో, ఢిల్లీలకు వ్యాపించింది. మోగల్ వంశస్తుడైన ‘బహదూర్ షా’ను తిరుగుబాటుదారులు భారత చక్రవర్తిగా ప్రకటించారు.

బ్రిటీష్ సేనలు డిసెంబర్ 6 న కాన్పూర్‌ను స్వాధీనపరుచుకున్నారు. అలా ఢిల్లీ పైకి నడచిన బ్రిటీష్ సేనలు, సెప్టెంబర్ 14న కాశ్మీర్ దర్వాజాను ధ్వంసం చేసాయి. నగరంలో దొరికినవారిని తుపాకి బానెట్లతో పొడిచి చంపారు. తిగురుబాటుదారులను హింసించి చంపివేసారు. బహదూర్ షా బర్మాలో ఖైదీగా మరణించాడు. ఢిల్లీ బ్రిటీష్ వారివశం అయింది. 1857 ఏప్రెల్‌లో ‘తాంతియా తోపే’ను బ్రిటీష్ వారు ఉరితీసారు.

‘మణికర్ణిక’ పేరు కలిగి ఝూన్సికోటకు రాణి అయిన ‘ఝూన్సిరాణి’ 1858 లో తన దత్తపుత్రుడిని వీపున కట్టుకొని, నానాసాహెబ్, తాంతియా తోపేలతో కలసి తెల్లవారితో యుద్ధం చేస్తూ 1958 జూన్ 17న వీరమరణం పొందింది.

‘నానాసాహెబ్’ నేపాల్ వెళుతు మరణించారు. 1880లో వెలుగుచూసిన బంకించంద్ర చటర్జీ ఆనందమఠం కొరకు రాసిన ‘వందేమాతరం’ గీతాన్నితొలిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరచి ఆలపించారు.1885భారతీయ కాంగ్రెసు స్ధాపన జరిగింది. 1885నుండి కాంగ్రెసువారు 1900 వరకు బ్రిటీష్ వారికి విజ్ఞాపనలు పంపుతూ వారు ఉండేవారు.

1890లో నాటి బ్రిటీష్ ప్రభుత్వం బాల్యవివాహాలను కట్టడి చేస్తు ఓ చట్టం చేసింది. 1901లో కలకత్తాలో రవీంద్రనాద్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ స్ధాపించారు. ఆ విద్యాలయం 1920 లో అంతర్జాతీయ గుర్తింపు పొంది ‘విశ్వభారతి’గా నేటికి సేవలు అందిస్తుంది.

1905 లో బెంగాల్ ను కర్జన్ ప్రభువు రెండుగా విభజించారు. 1906 ఆల్ ఇండియా ముస్లింలీగ్ స్ధాపించారు. 1906 దాదాజినౌరోబాయి నేతృత్వంలో త్రీవ్ర నిరసనలు తెలిపారు. 1907లో కాంగ్రెసు అతివాద,మితవాద వాదులుగా రెండువర్గాలు ఏర్పడ్డాయి. 1907 లో రాజద్రోహ సమావేశాల చట్టం, అమలు అయింది. 1908 లో తిలక్ గారిని బ్రిటీష్ ప్రభుత్వం ఆరేళ్లు మాండలే చెరసాలలో బంధించింది. అప్పటివరకు వందేమాతరం ఉద్యమం ముమ్మరంగా కొనసాగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here