వారాల ఆనంద్ చిన్న కవితలు 1

4
6

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~~

1) ఎప్పుడో ఒక సారి పలకరిస్తావు
నేనేమో పలవరిస్తాను
మన సంభాషణ నిరంతరం కొనసాగుతుంది
~ ~
2) నువ్వంటే ఎంతో ఇష్టం… అంతే కోపం కూడా
కనిపించి మురిపిస్తావు
కనిపించక కరిగిస్తావు.. కన్నీ‌టినిస్తావు
~ ~
౩) దశాబ్దాలు నడిచాయి.. శతాబ్దాలు గడుస్తాయి
నువ్వు నిజం, నేను నిజం
ఇద్దరి నడుమా నిశ్శబ్దం మరింత నిజం
~ ~
4) నువ్వు మాట్లాడతావు నాకు వినబడుతుంది
చెవిలో నిలబడుతుంది
కానీ నీ చిన్న నవ్వే హృదయాన్ని చేరుతుంది
~ ~
5) నువ్వు కనిపించగానే ఎక్కడెక్కడినుంచో
మెరుపులా వెలుగొచ్చి నా కళ్ళల్లో చేరుతుంది
కమ్ముకున్న మబ్బులు కరిగి చినుకులు కురుస్తాయి
~ ~
6) నీలోనూ నాలోనూ
నిండయిన ప్రేమ, నిలువెత్తు భయం
రెండు తీరాల నడుమ ప్రవాహంలా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here