వారాల ఆనంద్ చిన్న కవితలు 2

5
9

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~~

7) నీ సౌందర్యం పూల బాణంలా తాకుతుంది కానీ
నా దేహానికీ హృదయానికీ నడుమ
అలుపెరుగని దూరం
~ ~
8) నువ్వెవరు నేనెవరు
ఒకటీ కాదు వేరూ కాదు
చీకట్లో వెల్తురు వెల్తురులో చీకటి
~ ~
9) అలల మీద నడుస్తాను
గగనపు నీడల్ని గమనిస్తాను
నువ్వెక్కడయినా కనిపిస్తావేమోనని
~ ~
10) గుట్టల్ని ఎక్కాను గుహల్ని వెతికాను
విసిగి వెనుతిరిగాను, అలసి తొంగిచూసాను
చిత్రంగా నువ్వు నాలోనే వున్నావు నేనయి వున్నావు
~ ~
11) ఊరించడానికో ఉడికించడానికో
మెరిసి మాయమవుతావు విచ్చుకుని గుచ్చుకుంటావు
నేనేమో ఆశను హత్తుకుని నిలబడేవుంటాను
~ ~
12) ఉదయాన్నే బయట చల్ల గాలి విసురుగా విస్తారంగా
నేనేమో నడక నెపం మీద బయల్దేరుతాను
లోనికీ బయటకీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here