వారాల ఆనంద్ చిన్న కవితలు 6

1
6

[dropcap]వా[/dropcap]రాల ఆనంద్ రచించిన 7 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

~ ~

1) కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా
విశ్వం లోకి చేసే ప్రయాణమే
‘కళ’
~ ~
2) కన్నీళ్లు కళ్ళల్లో శాశ్వతంగా తిష్ట వేసుకోవు
కను రెప్పల్ని సెలవు కోరి
చెక్కిళ్ళ పై జాలువారతాయి
~ ~
3) ఇంటి సమస్యలు గోడల్లో పుట్టవు
మనస్సులో పుట్టి
మనుషుల నడుమ గోడల్ని కడతాయి
~ ~
4) నవ్వుతూ చేసే కరచాలనాల్ని మర్చిపోతావు
కన్నీళ్ళతో చెప్పే వీడ్కోలు
చివరంటా గుర్తుంటుంది
~ ~
5) ‘రహస్యాల్ని’ ఎక్కువ కాలం దాచి వుంచలేం
‘మనసు’ బరువుల్ని ఎంత త్వరగా
దించు కోవాలా అని చూస్తుంది
~ ~
6) నీ సౌందర్యం నన్ను అమితంగా ఆకర్షిస్తుంది
అది నన్ను చేరుకోలేనప్పుడు
నన్ను నా నుంచి విముక్తం చేస్తుంది
~ ~
7) మనలో మనం మాట్లాడుకోవడం అంటే
వినేవాళ్ళు లేరని కాదు
అర్థం చేసుకునే వాళ్ళు కరువని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here