వారాల ఆనంద్ చిన్న కవితలు 9

0
7

వారాల ఆనంద్ గారు రచించిన 6 చిన్న కవితలను పాఠకులకు అందిస్తున్నాము.


~ ~
1)
మాటలు పలుక లేనప్పుడు
చంద్రుడితో గుస గుస లాడాను
మాట్లాడ్డం వచ్చినంక
నాతో నేనే సంభాషించు కుంటున్నాను
~ ~
2)
చిన్నప్పుడు తొక్కిన
సైకిల్‌కి పంక్చరయింది
ఇప్పుడు నాకూ స్నేహానికి గండిపడింది
~ ~
3)
ఒకడేమో తాగీ తాగీ
మౌనాన్ని బద్దలు కొట్టాడు
ఇంకొకడు వాగీ వాగీ మౌనాన్ని శరణు జొచ్చాడు
~ ~
4)
ఆవేశం మాటను జారవిడిచింది
బుల్లెట్ గాయానికి
ఎదుటివాడి గుండె గాయపడింది
~ ~
5)
చుట్టూరా హద్దులు సరిహద్దులు అనేకం
కొన్ని లోకం గీసినవి
మరికొన్ని నేను బద్దలు కొట్టినవి
~ ~
6)
ఎండ భగ భగా మండుతున్న వేళ
చినుకు చిటపటా రాలింది నేల తడితడయి
గాలి గజగజా వణికి పకపక నవ్వాయి
*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here