వారాల ఆనంద్ చిన్న కవితలు

0
6

[dropcap]1)[/dropcap] చంద్రమా! మబ్బుల చాటున దాక్కోకు వెన్నెల విరబూయి
నాకు నిద్రా, వెలుగూ కావాలి
మనసేమో లోక సంచారం చేయాలి
~ ~
2) పువ్వుల్నీ, పాటల్నీ, పక్షుల్నీ
ప్రేమించని వాళ్ళూ వుంటారు
వాళ్ళు తమని తామే ప్రేమిస్తారు
~ ~
౩) నాకు రెండు హృదయాలు కావాలి
ఒకటి ప్రేమను పంచడానికి
మరోటి దుఖాన్ని దాచడానికి
~ ~
4) అసూయ అసహనం కవలలు
ఎదుటివాడి నవ్వునీ
ఎదుగుదలనీ చూడలేవు
~ ~
5) వర్షంలో తడిసి వృక్షం విలపించదు
దుఃఖంలో మునిగిన మనిషి వికలం చెందడు
~ ~
6) చిన్న పొగమంచు కప్పబడిన పర్వతం చిన్నదయిపోదు
ఒక్క ఓటమి వాళ్ళ మనిషి మరుగున పడి పోడు
~ ~
7) ప్రేమ నన్ను ఆక్రమిస్తుంది, ఆనంద పరుస్తుంది
మహా ప్రేమ వినమృన్ని చేస్తుంది
విముక్తం చేస్తుంది
~ ~
8) రుణ మన్నది
ఒక్కరితో ముడి పడదు
ఒక్క సారి ముగిసి పోదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here