వారాల ఆనంద్ హైకూలు-7

0
8

[dropcap]సం[/dropcap]చిక పాఠకుల కోసం శ్రీ వారాల ఆనంద్ రచించిన 8 హైకూలను అందిస్తున్నాము.

9)

రాలుతున్న పండు టాకులు

దట్టమయిన కొమ్మల మధ్య

దుఃఖ ధ్వని   

~

10)

ఏక ధారగా వాన

వారం రోజులుగా గడప దాటలేదు

నేనూ సూర్యుడూ

~

11)

వాన తడిసిన ఉదయం

నింగీ నేలా పదన పదన 

మనసింకా ఆరలేదు

~

12)

నడిరాత్రి దీపం వెలుగులో

అక్షరాలు వణికాయి

కాగితం తెల్ల బోయింది

~

13)

వాకిట్లో అందమయిన ముగ్గుల్ని 

వాన తుడిచేసింది

ఆమె కళ్ళల్లో తడి చేరింది   

~

14)

వాగు పొంగింది

చెరువు నిడింది

నింగిలో పక్షుల గుంపు కువ కువ   

~

15)

ఉదయం చినుకుల మధ్య

గాలి తిరుగుతున్నది

టీ కప్పులో ఇరానీ చాయ్ ఘుమ ఘుమ  

~

16)

ఆమె కంటి నిండా ఎదురు చూపులు

పోస్ట్ మాన్ కోసమో

ప్రేమ లేఖ కోసమో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here