వారెవ్వా!-18

0
6

[dropcap]ఆ[/dropcap]ది యెపుడో, అంతమెపుడో
అంతుబట్టని చిరంజీవి.
చాటు మాటుగా సాగునెప్పుడు
సాటిలేనిదీ సంబరం.
అంతు లేనవినీతి కిదియే
ఆనవాలుగ నిలిచిపోయె.
అన్ని రంగము లందు దానికి
హద్దు పద్దులు లేవు నిజము.
పేరు ‘లంచ’మ్మైన దానికి
పలు నామములున్నవయ్యా!

***

దురాచారము రూపుమాపుట
దూరాభారము కాదు గాని,
దాని కోసమె శాఖలెన్నో
దర్జాగా వెలసె నిప్పుడు.
అందులోనే అక్కడక్కడ
లంచముల కంచములు వెలసె.
కంచె చేనును మేయుచున్నను
కట్ట డెవ్వరు చేతురయ్య?
మనిషి లోనే మార్పు యత్నం
మహా దుర్లభ మాయెనయ్య!

***

నేతలైనా, దూతలైనా
అత్యాశను అసలు వదలరు.
కూడబెట్టిన దెంత వున్నా
మేడలెన్నో లేచియున్న
పాపభీతిని, దైవభీతిని
పటాపంచలు చేసినారు.
మరణకాలము నందు పాపము
పడగలెత్తి కాటు వేయును.
కొంచెమైనా లంచమేమీ
అడ్డు రాదు నిత్య సత్యము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here