వారెవ్వా!-26

1
7

[dropcap]ది[/dropcap]గుమతాయెను విదేశీయుల
నుండి వినూతన రోగముల్!
పాశ్చాత్య వ్యామోహ మందున
ప్రాచ్యులెన్నో వెంట తెచ్చిరి.
భారతీయుల కంటు బెట్టిరి
బాధలందు ముంచి తీసిరి.
కొత్త వ్యాధుల కోరలందున
వేల ప్రాణా లుత్తరెంచె.
చైనా నుండి కరోనా వచ్చె
కల్లోలము ప్రజ్వరిల్లె.

***

పాశ్చాత్యము నుండి ఎయిడ్స్
వచ్చి ప్రాణాలను హరించె.
స్పెయిన్ దాటి వచ్చి స్వైన్‌ఫ్లూ
చావులకు గత్తరగా మారె.
మలేసియా నుండెగిరి వచ్చి
నిఫా మనుషుల సఫా జేసె.
దక్షిణ సూడాన్ నందు బుట్టి
ఎబోలా ప్రాణాలు మింగె.
డెంగ్యూ మనీలా దేశమొదిలి
వేల ప్రాణాల్ మింగివేసె.

***

అన్ని రోగక్రిములు మన దే
శమ్మునందు నాశమొందె.
కరోనాకు ఎదురు లేదని
కదిలి చేరెను దేశమంత.
మందు మాకు లేదటంచును
లాక్‌డౌనులకు దారి దీసె.
మనుషులంతా సొంత యింటికి
పరిమితమ్మని తాళమేసె.
కరోనాపై విశ్వవిజయం
ఖాయమందును భారతాన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here