వారెవ్వా!-36

0
10

[dropcap]వే[/dropcap]యి వత్సరాలకు పూర్వము
అఖండ భారతము నిజమే.
భారతము ఖండితమ్మాయెను
భారతీయుల అనైక్యతన.
సన్నబడిపోయింది దేశము
స్వాతంత్ర్యము వచ్చు నాటికి.
పాకిస్తాన్ మత రాజ్యమాయె
పక్కలోన బల్లెమాయె.
ఆక్రమించె కాశ్మీరు కొంత
పాలకుల బలహీనతలన.

***

హిందీ-చీనీ భాయీ భాయని
చైనా మోసము చొచ్చుకొచ్చె.
వేల కిలోమీటర్ల భారత
భూమి కబ్జా చేసి నిలిచె.
చేవ చచ్చిన పాలకులు తమ
చేతులెత్తి మిన్నకుండిరి.
తీన్ బీగా బంగ్లాదేశ్‌కు
ధారపోసిరి కుయుక్తులతో.
సిగ్గు ఎగ్గులు లేక కొందరి
మతముతో బలహీనమాయె.

***

తిరిగి చైనా మోసమునకు దిగి
లఢక్, డొక్లాం తనదెయనెను.
లిపులేకు, కాలాపానీలు
లింపియధుర తనదియనుచున్
నేపాలము గూడా స్వార్థము
తోడ మ్యాపులు జూపినాది.
మిన్నకుంటే పక్క దేశాల్
రెచ్చిపోవుట సహజమగును.
భారతీయ యువత బాధ్యతలు
మరువరాదు, తిరగబడుచున్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here