వారెవ్వా!-39

0
7

మన భారత రాజ్యాంగ మందు
మైనారిటీ అంశముంది.
మైనారిటీ శబ్దమునకు సరి
యైన వివరణ కానరాదు.
మతాచారణా ధారముగనే
జనాభాను లెక్కగట్టిరి.
హిందువులు మెజారిటీలని
ఇతరులు మైనారిటిలనిరి.
మైనారిటీల హక్కులెన్నియొ
మెజార్టీలను మించిపోయెను.

***

కొన్ని రాష్ట్రాల మైనార్టీలు
కొన్నింటిన మెజార్టీలు.
కొన్ని రాష్ట్రాల మెజార్టీలు
కొన్నింటిన మైనార్టీలు.
హిందువేతర మైనార్టీలకు
అన్నింట ప్రత్యేక హక్కులు
హిందూ మైనార్టీల కెక్కడ
లేవు ప్రత్యేక హక్కులే.
ఒకే దేశములోని ప్రజలకు
ఎందుకొరకీ వివక్షతలు?

***

జమ్ము – కాశ్మీర మందున
హిందువులు మైనార్టీలే.
ఉన్నతులు కాశ్మీరు పండితుల
ఉగ్ర ముస్లిములు తరిమినారు.
ఈశాన్య రాష్ట్రాలలోన
హిందువులు మైనారిటీలు.
అచట హిందూ మైనార్టీలకు
ఉండవెందుకా హక్కులే?
రాజ్యంగములో ఇంకెప్పుడు
జరుగునో సవరణ కార్యము?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here