వారెవ్వా!-41

0
8

స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను
సంబరముగా చేసుకున్నము.
వజ్రోత్సవ వేడుకల నిక
విజయవంతం చేయుదాము.
సాధించినది యెంత వున్నా
సాధనలో ఇంకెంతో వుంది.
భారతాంబిక పాదాలకు
పారాణిగా మారినోళ్ళకు
నిత్య నీరాజనములిద్దాం
త్యాగధనుల దలుచుకుందాం.

***

వజ్రోత్సవ కాలమందున
వేడుకలను చేసుకుంటూ
విశ్వవిప్లవ ప్రణేత వీర
సావర్కరు దలుచుకుందాం.
ఝాన్సీ రాణి బంకించంద్ర
మేడం కామా, వి.వి. అయ్యర్
డీంగ్ర, ఉద్దం, లాలు, బాలు,
పాల్, నేతాజీ, వాజపేయి
భగత్సింగుల ఆంతరంగము
అవగాహన చేసుకుందాం.

***

ప్రాజెక్టు లెన్నో గట్టిరి,
అవినీతికి హారతులిచ్చిరి.
ఇటీవలెనే పాలకులు సం
కేతికముగా వృద్ధి జేసిరి.
పాకు, చీనా మదమ్మణచగ,
వీర భారతి కీర్తి బెరిగె.
రాకెట్టుల పరిశోధనలను
రంజుగా పెంచేసినారు.
వందేమాతరమంటు ప్రజకు
ముందు ముందుదారి జూపిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here